వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల

వైయ‌స్ఆర్ జిల్లా: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది  వైయ‌స్ఆర్‌సీపీ. శనివారం ఇడుపులపాయలో  వైయ‌స్ఆర్  ఘాట్‌ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది. 175 మంది ఎమ్మెల్యే, 25 ఎంపీ అభ్యర్థుల జాబితాల్ని మంత్రి ధర్మాన, ఎంపీ నందిగమ సురేష్‌ చదివి వినిపించారు.

 మొత్తం అభ్యర్థుల్లో 50 శాతం అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉండడం గమనార్హం. 25 ఎంపీ స్థానాల్లో బీసీలకు 11 ఎంపీ, ఓసీ 9,  ఎస్సీలకు 4 ఎంపీ స్థానాలు, ఎస్టీలకు 1 ఎంపీ సీట్లు ప్రకటించారు. మొత్తంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇచ్చినట్లు ధర్మాన ప్రకటించారు.

2019లో బీసీలకు 41.. ఇప్పుడు 48 స్థానాలు.. మొత్తంగా ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు 200లో ఎస్సీలకు 33 స్థానాలు ఇచ్చారు.  అలాగే.. 2019లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులకు మొత్తంగా 86 స్థానాలు ఇవ్వగా.. ఈసారి 200 సీట్లలో(175+25) 100 స్థానాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది పార్టీ అధిష్టానం. 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్‌ స్థానాలు గెలవడమే లక్ష్యంగా వైనాట్‌ 175 నినాదంతో ఈ ఎన్నికలకు వెళ్తున్నట్లు ఈ సందర్భంగా పార్టీ ప్రకటించింది. 

ఎమ్మెల్యే అభ్య‌ర్థుల వివ‌రాలు..

 

Back to Top