Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                               30న అనంత‌పురంలో న‌య వంచ‌న దీక్ష: వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                                ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు స్వర బ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్ మృతి ప‌ట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సంతాపం                 
    Show Latest News
ధైర్యం చెబుతూ..ఆత్మీయ భ‌రోసా

Published on : 15-Nov-2017 | 10:02
 

- వైయ‌స్ జ‌గ‌న్‌కు క‌ర్నూలు జిల్లాలో అపూర్వ స్వాగ‌తం  
- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో స‌మ‌స్య‌ల వెల్లువ‌
- రాజ‌న్న పాల‌న గుర్తు చేస్తూ..బాబు మోసాల‌ను ఎండ‌గ‌డుతూ..
కర్నూలు:  ప్ర‌జా స‌మ‌స్య‌లను తెలుసుకొని, వాటికి శాశ్వ‌త ప‌రిష్కారం చూపేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌కు క‌ర్నూలు జిల్లా ప్ర‌జ‌లు అపూర్వ స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఈ నెల 6వ తేదీన ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నిన్న క‌ర్నూలు జిల్లాకు చేరింది. రాజ‌న్న బిడ్డ రాక‌తో త్యాగాలమర్రి..చాగలమర్రి పులకించింది.. దైన్యం నిండిన గుండెలకు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాకతో ఆత్మీయ భరోసా దొరికింది. ప్రజా సంకల్ప పాదయాత్ర ఎనిమిదో రోజు కర్నూలు జిల్లాలో అట్ట‌హాసంగా సాగింది. జ‌న‌నేత‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు హార‌తి ప‌ట్టారు. ఎదురెళ్లి మ‌రి త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిని జిల్లా వాసులు గుర్తు చేసుకొని, మ‌హానేత మ‌ళ్లీ మాకోసం ఆయ‌న త‌న‌యుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రూపంలో వ‌చ్చార‌ని ఉప్పొంగిపోయారు. త‌న‌కు స్వాగ‌తం ప‌లికిన వారికి, బాధ‌లు చెప్పుకున్న ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఆత్మీయ భ‌రోసా క‌ల్పిస్తూ..మ‌హానేత పాలనను గుర్తు చేసుకుంటూ.. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకువ‌స్తాన‌ని హామీ ఇచ్చారు.  కష్టాల్లో ఉన్న వారికి ధైర్యం చెబుతూ.. చంద్రబాబు పాలనను ఎండగడుతూ జననేత పాదయాత్రను కొనసాగించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండా అని.. మ్యానిఫెస్టోలో చెప్పినవి తప్పకుండా అమలు చేస్తామని మాట ఇచ్చారు.  8వ రోజు చాగలమర్రి మండలంలో 16 కిలోమీటర్ల మేర వైయ‌స్ జ‌గ‌న్ నడిచారు. ఉదయం చాగలమర్రి నుంచి ప్రారంభమైన పయనం..ముత్యాలపాడు బస్టాండు సెంటర్‌ మీదుగా శెట్టివీడు, గొడగనూరు, ముత్యాలపాడు, చక్రవర్తులపురం మీదుగా కృష్ణాపురానికి చేరుకుంది. తొమ్మిదో రోజు ఆర్‌.కృష్ణాపురం, పెద్దకోటకందుకూరు, పాలసాగరం మీదగా ఆళ్లగడ్డ నాలుగు రోడ్ల జంక్షన్‌ వరకూ కొనసాగనుంది. అక్కడ బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  
  

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com