Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కర్ణాటక ఎన్నికలు ముగిసి 40 రోజులు కావొస్తోంది.. మరి బాబు చెప్పిన కేసులేమైనట్లు?: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు దొంగ దీక్షలు: మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి                               వైయ‌స్‌ జగన్‌ 198వ రోజు పాదయాత్ర సోమవారం ఉదయం మామిడికుదురు నుంచి ప్రారంభం                               కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రజలకు ఉపాధి లభిస్తుంది: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి                               కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం కడపలో మహా ధర్నా                               చింత‌ల‌ప‌ల్లి నుంచి 196వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               దేశంలోనే సీనియర్‌ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు: ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు                               రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                  
    Show Latest News
వణుకుతున్న నాలుగో సింహం

Published on : 19-May-2017 | 15:31
 

– పచ్చనేతల అరాచకాలకు వణకుతున్న పోలీసులు
– రాష్ట్రం నలువైపులా ఖాకీలపై పచ్చ చొక్కాల జులుం
– కేసులు పెట్టినా అధికారం ఉపయోగించి బయటకి

ఒకప్పుడు రౌడీయిజం అంటే బిహార్‌ను కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునేవారు.  అక్కడ పోలీసులు కూడా రౌడీల దెబ్బకు వణికిపోతుంటారు. రాజకీయ నాయకుల అండతో వారు పోలీసులను ఎలా ముప్పుతిప్పలు పెడతారో చాలా సినిమాల్లో చూపించారు. అలాంటి రౌడీయిజం కారణంగా ఆ రాష్ట్రం బాగా వెనకబడి ఉండేది. అక్షరాస్యతలో ఆ రాష్ట్రం ఎప్పుడూ అట్టడుగున ఉండేది. బిహార్‌ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ ఉండేది. ఇప్పుడు ఏపీ పరిస్థితులను చూస్తుంటే ఆ రెండు రాష్ట్రాలతో పోల్చితే పెద్దగా భిన్నంగా ఏమీ లేవు. చంద్రబాబు పదవీకాలం ముగిసే నాటికి ఏపీని ఆ రెండు రాష్ట్రాల కంటే ముందు నిలిపే అవకాశాలు పుష్కళంగా కనిపిస్తున్నాయి. జనానికి ఏమైనా సమస్య వస్తే పోలీస్‌ స్టేషన్‌కి పరిగెత్తుతారు. కానీ ఇప్పుడు బాబు పాలనలో ఆ పోలీసులకే రక్షణ లేకుండా పోతోంది. ఖాకీ చొక్కా చూస్తే జనం వణికేవారు.. ఇప్పుడు అదే ఖాకీ చొక్కాలు పచ్చ చొక్కాలను చూస్తే వణికే పరిస్థితి వచ్చింది. కార్యకర్తల దగ్గర్నుంచి సీఎం దాకా పచ్చ చొక్కా వేసుకున్న ప్రతిఒక్కరూ ఖాకీలపై పెత్తనం చేసేవారే. పోలీసులెవరూ వారి మీద కేసులు పెట్టే ధైర్యం చేయలేకపోతున్నారు. ఒకవేళ పెట్టినా అధికారం ఉపయోగించి రెండు రోజుల్లో బయటకొస్తుండడంతో ఏమీ చేయలేని పరిస్థితియ

విజయవాడ నడిబొడ్డున ఐపీఎస్‌కు అవమానం
‘నువ్వు గడ్డి తింటున్నావు. గడ్డి తిని ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ బస్సులను నడిపిస్తున్నావు. ఎంపీని నేను ఆఫీసుకు వస్తుంటే వెళ్లిపోతున్నావా?... ప్రజాప్రతినిధి అంటే నీకు లెక్కలేదా? నీ సంగతి తేలుస్తా’ అని విజయ వాడ టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్‌ అధినేత కేశినేని శ్రీనివాస్‌(నాని) రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాల సుబ్రహ్మణ్యంపై విరుచుకుపడ్డారు. ‘ఏం నీకు కొమ్ములొచ్చాయా...? పై నుంచి దిగివచ్చావా ...? ఏం బతుకు నీది?’ అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కమిషనర్‌ను తూలనాడుతూ చిందులు తొక్కారు. కేశినేని నాని, బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్‌ హౌసింగ్‌బోర్డు చైర్మన్‌ నాగుల్‌ మీరా, విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌ దాదాపు 200 మంది కార్యకర్తలతో కలిసి కమిషనర్‌ను విజయ వాడ నడిరోడ్డుపై దిగ్బంధించారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అయిన బాలసుబ్రహ్మణ్యం ను దాదాపు రెండుగంటలపాటు నిలబెట్టిమరీ దుర్భాషలాడుతూ తీవ్రంగా అవమానించారు. పైగా కమిషనరే క్షమాపణ చెప్పాలంటూ ఆయన్ని ఘెరావ్‌ చేశారు. పోలీస్‌ డీసీపీ పాల్‌రాజ్, రవాణా శాఖ డీటీసీ మీరా ప్రసాద్‌లతోపాటు పలువురు అధికారులు ఎంతగా ప్రాధేయపడినా వెనక్కితగ్గలేదు. 

స్పీకర్‌ అనుచరుల వీరంగం
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తిగా స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్, అనుచరులు నిలుస్తున్నారు. కోడెల పవిత్రమైన స్పీకర్‌ స్థానంలో ఉన్నప్పటికీ ఆయన కుమారుడు చేస్తున్న ఆగడాలకు హద్దూఅదుపు లేకుండా పోతోంది. కోడెల అనుచరులు ఏకంగా పోలీసులనే అందరూ చూస్తుండగానే చెప్పులతో కొట్టారు. గుంటూరు జిల్లా పెనుమూడి ఘాట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. పెనుమూడి–పులిగడ్డ వారధి సమీపంలో పుష్కరఘాట్లకు వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయగా అక్కడే కోడెల అనుచరుల వాహనాలను ఆపారు. భక్తులకు ఇబ్బంది అవుతుందని వాహనాలను పక్కకు తీయాలని డ్యూటీలో ఉన్న పోలీసులు సూచించారు. అయితే వారు లెక్కచేయలేదు. ’కోడెల అనుచరులం అని చెప్పిన తర్వాత కూడా వాహనాలు పక్కన పెట్టమంటారా’’ అంటూ అందరూ చూస్తుండగానే చెప్పులు తీసుకుని ఒక కానిస్టేబుల్‌ను పదేపదే కొట్టారు. 

హోంగార్డుపై టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ దాడి 
– విజయవాడలో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ కార్పొరేటర్‌ హరిబాబు అనుచరుడు శ్రీనివాస్‌తో కలిసి ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఘాట్‌ రోడ్డుపైపు వెళ్తుండగా పనులు జరగుతున్నాయని హోంగార్డు ఆపాడు. దీంతో పట్టరాని కోపంతో హరిబాబు, శ్రీనివాస్‌లు నాగరాజును తీవ్రంగా కొట్టారు. అయితే విజయవాడ వన్‌టౌన్‌ పోలీసులు హరిబాబును స్టేషన్‌కు తీసుకురాగా అతన్ని అరెస్టు చేయొద్దంటూ మంత్రుల నుంచి ఫోన్లు. 

ఎస్సైని నిర్బందించిన తణుకు ఎమ్మెల్యే
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఏకంగా పోలీసులనే నిర్బంధించేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పోలీసులు కూడా తోటి పోలీసులను విడిపించుకునేందుకు ఆపసోపాలు పడ్డారు.  తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఒక ఎస్సై, రైటర్‌ను తన కార్యాయలంలోనే నిర్బంధించారు. నేల మీద కూర్చోబెట్టి వారిపై ఎమ్మెల్యే రెచ్చిపోయారు. ఎమ్మెల్యే ఉండడంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి ఖాకీలను బండబూతులు తిట్టారు.
తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం రేలంగి శివారు అంతెనవారి పేటలో దళితుల మధ్య ఇటీవల గొడవ జరిగింది. తెలుగుదేశం వారిపై ఎలా కేసులు పెడుతారంటూ ఎస్సైని తన కార్యాలయానికి పిలిపించుకున్న ఎమ్మెల్యే వారితో అమానుషంగా ప్రవర్తించారు.

ఏఎస్సైని కాలితో తన్నిన చింతమనేని 
– ఈ ఘటన జరగడానికి వారం రోజుల ముందే అదే జిల్లాకు చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏఎస్సైని కాలితో తన్ని అవమానించాడు. 
ఇవి కొన్ని మాత్రమే. రాష్ట్రం నలుమూలలా జరిగిన దౌర్జన్యాలను చెప్పుకుంటూ పోతే ఖాకీలు అవమానభారంతో కుంగిపోతారు. 
Labels : andhrapradesh, tdp, police

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com