Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                               3100 కిలోమీట‌ర్ల మైలు రాయి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.                               క‌రువు మండ‌లాల కుదింపు దారుణం: వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               పోలీసుల‌ను చంద్ర‌బాబు త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌                               చంద్రబాబు నిజ స్వరూపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయటపెట్టారు: జోగి ర‌మేష్‌                 
    Show Latest News
తెలుగు వారి పౌరుషాన్నిచాటేందుకే రాజీనామాలు
– వైయస్‌ఆర్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ

Published on : 14-Feb-2018 | 17:50
 



– రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎంపీల రాజీనామా
– ఓటుకు కోట్లు కేసులో చర్యలు తీసుకుంటారని బాబుకు భయం
–  మా ఎంపీల రాజీనామాలకు టీడీపీ మద్దతివ్వాలి
– టీడీపీకి ప్రత్యేక హోదా రావడం ఇష్టం ఉందా? లేదా?
– రాష్ట్ర ప్రజల గురించి చంద్రబాబుకు ఆలోచనలు లేవు
– మార్చి 1న కలెక్టరేట్ల ముట్టడికి తరలిరండి
– విద్యార్థులు, మేధావుల్లారా రండి..పోరాటం చేద్దాం
 
హైదరాబాద్‌: టీడీపీ నేతలు స్వప్రయోజనాలు విడిచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని, ఇకపై మీ ఆటలు, జిమ్మికులు కట్టిబెట్టాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేతలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ సూచించారు. తెలుగు వారి పౌరుషాన్ని చాటేందుకే ఎంపీలు రాజీనామా చేస్తున్నారని చెప్పారు. మా నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు పార్లమెంట్‌ సాక్షిగా ఏప్రిల్‌ 6న రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాజీనామాల విషయంలో టీడీపీ నేతల తీరు బాధాకరమని మండిపడ్డారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణతో కలిసి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్‌ సమావేశాల అనంతరం మేము రాజీనామాలకు వెనుకాడమని స్పష్టం చేశారు. మార్చి 1న కలెక్టరేట్ల ముట్టడి, 3న వైయస్‌ జగన్‌ వద్దకు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లి జంతర్‌ మంతర్‌ వద్ద 5న ధర్నా చేస్తామన్నారు. అప్పటి నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు పార్లమెంట్‌లో ఉద్యమిస్తామన్నారు. అప్పటికి కేంద్రం స్పందించకపోతే పార్లమెంట్‌సాక్షిగా ఎంపీ పదవులకు రాజీనామా చేసి వస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం టీడీపీకి ఇష్టమా? లేదా అని ప్రశ్నించారు. మా రాజీనామాలు మా ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని వెల్లడించారు. పార్లమెంట్‌లో టీడీపీ డ్రామాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. మేం గత రెండేళ్లుగా చెబుతున్నామని, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌ బయట, లోపల ఆందోళన చేపడుతున్నామన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం, స్టీల్‌ ప్యాక్టరీ కోసం ఆందోళన చేస్తునే ఉన్నామన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం ఉద్ధృతం చేస్తామని ఇది వరకే చెప్పామన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా టీడీపీ ఎంపీలు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే హోదాను వదులుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉండేది మేము కాదని, టీడీపీనే అన్నారు. హోదా కోసం గత నాలుగేళ్లుగా వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారని చెప్పారు. హోదా ఇవ్వకపోతే తుది అంశంగా ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించారు. మేం తీసుకున్న రాజీనామాల నిర్ణయంతో చంద్రబాబు మైండ్‌ బ్లాక్‌ అయ్యిందన్నారు. మొన్న రాజస్థాన్‌లో ఎన్నికలు జరిగాయని, అక్టోబర్, నవంబర్‌లో మరో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయన్నారు. మేం 15 నెలల ముందు రాజీనామా చేస్తున్నామని, ఎన్నికలు వచ్చిన చాలెంజ్‌గా రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా బయపడేది టీడీపీనే అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తెలుగు రాష్ట్రాల్లోనే పోగొట్టేలా ప్రయత్నిస్తున్నారన్నారు. మా రాజీనామాల నిర్ణయం టీడీపీకి చెంపపెట్టు అన్నారు. తెలుగు వారి పౌరుషాన్ని తెలిపేందుకే ఎంపీలు రాజీనామా చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్‌ఆర్‌సీపీ ముందుంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలు జరగవని చెప్పడానికి టీడీపీ నేతలు ఎవరని ప్రశ్నించారు.

బీజేపీని చూసి ఎందుకు భయపడుతున్నారు:  బొత్స సత్యనారాయణ
చంద్రబాబు 14 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై మీ ఆలోచన ఏంటని ప్రశ్నించారు. ఎందుకు ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు మాట్లాడటం లేదని ప్రజల తరఫున ప్రశ్నించారు. ఎందుకు మిత్రపక్షమైన బీజేపీని చూసి వణికి పోతున్నారని మండిపడ్డారు. మీకు బాధ్యత లేదా? అడిగే హక్కు లేదా అని ధ్వజమెత్తారు. మా నాయకుడు వైయస్‌ జగన్‌ మా పార్టీ విధానాలను ప్రకటించారన్నారు. విభజన చట్టంలోని అంశాలపై రాజీలేని పోరాటాలు చేస్తామని మా నాయకుడు చెప్పారన్నారు. వివిధ సందర్భాల్లో ప్రధాని, రాష్ట్రపతితో పాటు వివిధ పార్టీల నాయకులతో కలిశామన్నారు. ఢిల్లీలో ధర్నా చేశామని, గుంటూరులో వైయస్‌ జగన్‌ అమరణ నిరాహార దీక్ష చేశారని, విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని, యువభేరిలు నిర్వహించామని వివరించారు. ఈ రాష్ట్రానికి మేలు కోసం ఎందాకైనా పోరాడుతామని వైయస్‌ జగన్‌ ఇది వరకే చెప్పారన్నారు. స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు పత్రికలతో మాట్లాడుతూ..ఎందుకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేయడం లేదని ప్రశ్నించారు. మేం రాజీనామాలు చేసేందుకు ముందుకు వస్తే హేళనగా మాట్లాడుతారా?. నాలుగేళ్లుగా కేంద్రం బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. నాలుగేళ్లుగా మేం పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఈ రాష్ట్రానికి బీజేపీ చేస్తున్న మేలు ఏ రాష్ట్రానికి చేయలేదని చంద్రబాబే అన్నారని గుర్తు చేశారు. మా నాయకుడు తీసుకున్న నిర్ణయానికి మా ఎంపీలు త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా మేం రాజీనామా చేస్తామని ప్రకటించారు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ పార్లమెంట్‌లో డ్రామాలాడిందన్నారు. మీ స్వలాభం కోసం, మీ బలహీనతల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా అని నిలదీశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి మాపై విమర్శలు చేస్తారా? ఇదేనా ప్రజలపై మీకున్న చిత్తశుద్ది అని ప్రశ్నించారు. వామపక్షాలు బంద్‌ నిర్వహిస్తే..మా నాయకుడు మద్దతు తెలిపారన్నారు. మా నాయకుడు వైయస్‌ జగన్‌ ధ్యేయం ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధే అన్నారు. రాజ్యాంగంపై అవగాహన లేకుండా టీడీపీ మాట్లాడుతుందని మండిపడ్డారు. ఒక విధానం కోసం మేం రాజీనామాలు చేస్తుంటే స్వాగతించాల్సింది పోయి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అవినీతిపై ఎక్కడ కేంద్రం విచారణ చేపడుతుందోనని చంద్రబాబు భయపడుతున్నారని, మాకు కేసులపై భయం లేదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ పరిశీలిస్తున్నారని, ఎవరు రాజకీయాలు చేస్తున్నారో? ఎవరు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, మా నాయకుడు తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలపాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు మీరు కూడా పోరాటం చేయాలని హితవు పలికారు. ప్రత్యేక హోదా ఒక్కటే రాష్ట్రానికి సంజీవని అని, హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ చేస్తున్న పోరాటాలకు మద్దతివ్వాలని బొత్స సత్యనారాయణ కోరారు. అందరం కలిసి పోరాటం చేద్దామని, ప్రత్యేక హోదా సాధించుకుందామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపుగా చెబుతున్నామని బొత్స తెలిపారు.

 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com