Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చిన్న ఈర్ల‌పాడు వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన విద్యార్థులు                               ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కనిగిరి నియోజకవర్గంలోని చింతలపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 96వ రోజు ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి మండ‌లం హాజీస్‌పురం నుంచి ప్రారంభ‌మైంది.                               చంద్ర‌బాబు ముస్లింల ద్రోహి: ఎమ్మెల్యే ముస్త‌ఫా                               బీజేపీ, టీడీపీలు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయి: మ‌ల్లాది విష్ణు                               కేంద్రంపై పోరాటం చేసే ద‌మ్ము, ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా?: వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌                               వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత‌లు పైశాచిక ఆనందం పొందుతున్నారు: వాసిరెడ్డి పద్మ                               ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధమే: ఆదిమూల‌పు సురేష్‌                               బీజేపీ, టీడీపీల‌కు కాంగ్రెస్ గ‌తే ప‌డుతుంది: అంబ‌టి రాంబాబు                 
    Show Latest News
వైదిస్ కోలావెర్రి కట్టప్పా?

Published on : 12-Dec-2016 | 13:40
 

అమరావతి దేవతల రాజధాని. మామూలు ప్రజలది కాదు. స్వర్గాన్ని తలదన్నే ఆ అమరావతి నిజంగా ఉందో లేదో చూసివచ్చిన వాళ్లు లేరు. పురాణాల్లో, వేదాల్లో, జానపదగాథల్లో, కాల్పనిక సాహిత్యంలో మాత్రం అమరావతి వైభవాన్ని వేనోళ్ల పొగిడారు. 

                    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొత్త రాజధాని ఇంద్రుడి అమరావతి కంటే రెండు ఫ్లోర్లు ఎక్కువే ఉండాలనుకుంటున్నాడు.ఆశలకు హద్దు లేదు. కోరికకు కళ్లాలు లేవు. డిజైన్ ల కోసం తిరగని దేశాలు లేవు. కానీ, కట్టడానికే డబ్బులు లేవు. బాబు ఎక్కి, దిగే విమానాలు కాఫీ, టీ, టిఫిన్ చిల్లర ఖర్చులకు పోగా మిగిలింది డిజైన్ లు ఇచ్చిన సింగపూర్ కో, వాటిని సవరించిన గ్రాఫిక్ డిజైనర్ కో సరిపోయింది. 

          మహామహాదేశాలే అబ్బురపడే గొప్ప భారతీయ ఆర్కిటెక్చర్ నిపుణులు బాబు కళ్లకు కనబడలేదు. సింగపూర్, జపాన్, కొరియా, చైనా, జర్మనీ నగరాలంటూ రెండున్నరేళ్ల పుణ్యకాలమంతా చూసి రావడానికే సరిపోయింది. రాజధాని కోసం భూములు అర్పించుకున్న రైతుల్లో కూడా అసహనం, ఆవేదన పెరుగుతోంది. వెలగపూడి, ఉద్దండరాయునిపాలెంలో తాత్కాలికం, సెమీ తాత్కాలికం, తాత్కాలికం కమ్ పర్మినెంట్ అంటూ కట్టిన సచివాలయం ఎంత చక్కగా ఉందో రాస్తే రామాయణం, చెప్పే మహాభారతం. 
                          
                  ప్రపంచదేశాలన్నీ తిరిగి ప్రపంచ అత్యుత్తమ అయిదు నగరాల్లో అమరావతి ఒకటి అవుతుందని బాబు అంటుంటే అందరూ నవ్వుతున్నారు గానీ ఆయన నిజమే చెప్పారు. కాకపోతే ఆయన చెప్పింది గ్రాఫిక్స్, యానిమేషన్ తో నిర్మించే త్రీడీ అమరావతి. అది చూడ్డానికే-ఉండడానికి కాదు.

                        ఇన్నాళ్లు అస్పష్టంగా ఉన్న అమరావతి నిర్మాణంలో ఇప్పుడే క్లారిటీ వచ్చింది. బాహుబలిలో గ్రాఫిక్ తోటలు, కోటలు బాగా కట్టిన దర్శకుడు రాజమౌళిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సాయం అడిగిందట. ఆయన బాహుబలి రెండో భాగం పనికాగానే, అమరావతి పని పడతానని హామీ ఇచ్చారట. 
                                                                       వాట్ యూ ఆర్ సేయింగ్?
                                                                       వేర్ వుయ్ ఆర్ గోయింగ్?
                                                                       వైదిస్ కోలావెర్రి కట్టప్పా? 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com