Printed on 18-11-2018 17:55:13 PM

చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాలి
ఏలూరు: ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక హోదా కోసం మొద‌టి నుంచి పోరాడుతున్న‌ది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీనేన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్ల‌మెంట్ క‌న్వీన‌ర్ కోట‌గిరి శ్రీ‌ధ‌ర్ అన్నారు. ప్ర‌త్యేక హోదా కోసం ఏప్రిల్ 6వ తేదీ వ‌ర‌కు పోరాడుతామ‌ని అప్ప‌టికీ ఇవ్వ‌క‌పోతే పార్ల‌మెంట్ స‌భ్యుల‌తో రాజీనామా చేయిస్తామ‌ని త‌మ నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం హ‌ర్ష‌నీయ‌మ‌న్నారు. ప్ర‌జ‌లు కూడా త‌మ పార్టీ నాయ‌కుడి నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నార‌న్నారు. గ‌త నాలుగేళ్లుగా దొంగ‌నాట‌కాలు ఆడుతున్న చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ప్ర‌త్యేక హోదా కావాల‌ని.. త‌ర్వాత ప్యాకేజీ అని.. ఇప్పుడు కేంద్రం ఏమీ చేయ‌లేద‌ని మాట్లాడ‌డం సిగ్గుచేట‌న్నారు. ఇలాంటి నాయ‌కుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముఖ్య‌మంత్రిగా ఉండ‌డం రాష్ట్ర ప్ర‌జ‌లు చేసుకున్న దౌర్భ‌గ్య‌మ‌న్నారు.