రాజన్న పాలన మరోసారి చూడాలి

చిత్తూరు(కొంగారెడ్డిపల్లె): ‘నాయనా... మరోసారి రాజన్న పాలన చూ డాలి.... అందుకోసం జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. రాబోయే ఎన్నికల్లో ఓటేసేంత వరకు మా గుండె చప్పుడు ఆగదు’ అని మహా నేత వైయస్.రాజశేఖరరెడ్డిని తలచుకుని పానాటూరుకు చెందిన వృద్ధులు కళ్లనీళ్లపర్యంతమయ్యారు. గురువారం గుడిపాల మండలంలోని పా నాటూరు, అనుపు, బోయనపల్లె, పల్లూరు, మఠం, చింతగుంటూరు గ్రామాల్లో గడప గడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏర్పాటైంది. పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఏఎస్. మనోహర్ దీనికి నాయకత్వం వహించారు. పానాటూరులో ఆయన తో వృద్ధులుపై విధంగా స్పందిం చారు. వైయస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కనుమగురు చేసేం దుకు ప్రభుత్వం చేస్తున్న ప్ర యత్నాలను ప్రజలు తిప్పికొట్టడం ఖాయమన్నారు. పార్టీ గుడిపాల మండల కన్వీనర్ పీఎం.శ్రీధర్‌రెడ్డి, మహిళా వి భాగం కన్వీనర్ విజయలక్ష్మీ, జిల్లా కమిటీ మెంబర్ సుందరమణి, పానాటూరు, గొళ్లమడు గు పంచాయతీ కన్వీనర్‌లు జ్యోతీశ్వరరెడ్డి, పురుష్తోతమ్‌రెడ్డి, పానాటూరు మాజీ స ర్పంచ్ రఘు, డానియల్, మధుసూదన్ రాయల్, రఘునాథరెడ్డి, బాలాజీరెడ్డి, గజేంద్రరెడ్డి పాల్గొన్నారు.

Back to Top