బందిపోటు దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు

మీడియా స‌మావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు 

పచ్చ కళాకారుల గుంపే సిటిజన్స్‌ ఫర్‌ డెమెక్రసీ. 

పేదల సంక్షేమానికి రూ.2.75 లక్షల కోట్లు పంచిన వైయ‌స్ జగన్  బందిపోటు అవుతారా..? 

14 ఏళ్ళ పాలనలో స్కీములన్నీ స్కాములుగా మార్చిన చంద్రబాబు బందిపోటా? 

మార్గదర్శి అక్రమాలపై సుప్రీంకు సమాధానం ఎందుకు చెప్పలేదు రామోజీ? 

ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు. 

తాడేప‌ల్లి: బందిపోటు దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు మండిప‌డ్డారు. నీరు–చెట్టు పేరుతో మట్టిని దోచుకుని అమ్ముకున్న అసలు బదిపోటు దొంగల ముఠా నాయకుడివి నువ్వు కాదా?.  వంద రూపాయలు ఖర్చు అయ్యే కాంట్రాక్టు పనులను మరో వందకు పెంచి ప్రభుత్వ ఖజానాను దోచుకున్న బందిపోటువి నువ్వు కాదా?.. ఫేక్‌ రాజధాని నిర్మాణం కోసం ఫేక్‌ దేశాలు తిరిగి..ఫేక్‌ ప్రయాణపు ఖర్చులు పెట్టి ఫేక్‌ ముఖ్యమంత్రిగా మిగిలిన అసలు బందిపోటువి నువ్వుకాదా? అంటూ సుధాక‌ర్‌బాబు ప్ర‌శ్నించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.

మాజీ ఐఏఎస్‌ల పేరుతో ఒక్కొక్కరూ ముసుగు తీస్తున్నారు:
– వైయ‌స్ జగన్‌ గారి బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 
– ఏ గ్రామంలోకి వెళ్లినా పండుగ వాతావరణం కనిపిస్తోంది. భారీ సంఖ్యలో ప్రజలు జాతరలా వస్తున్నారు. 
– ఊహించిన దానికంటే, ఈ బస్సు యాత్ర వంద రెట్లు సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. 
– ప్రజల్లో అభిమానం పెల్లుబికి రోడ్డుమీదకు వచ్చింది. 
– ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడికి ఇంత పెద్ద ఎత్తున ప్రజాభిమానం కలిగి ఉండటం, ఇంత వరకూ జరగలేదు. మున్ముందు కూడా జరగదు. 
– అది చూసుకుని ఓర్చుకోలేని తెలుగుదేశం మద్దతు దారులు ఒక్కొక్కరుగా ముసుగులు తీస్తున్నారు.
– మాజీ ఐఏఎస్‌లు, మాజీ ఐపీఎస్‌లు ముసుగులు తీస్తున్నారు. ఇప్పటికే మీడియా సంస్థలు బహిర్గతం అయిపోయాయి. 
– చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే వారికి లాభాలు జరుగుతాయి కాబట్టి వారు ఇప్పటికే బయటపడ్డారు. 
– నిన్న విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ గారిపై భౌతికంగా దాడి చేయడానికి కుట్ర జరిగింది. ముఖ్యమంత్రి గారిని అంతమొందించాలనే కుట్ర జరుగుతోంది. 
– ఈ బందిపోటు ముఠాలను ఆయన ఎదిరిస్తున్నారని, వాళ్ల బట్టలు విప్పతీశారని భయంతో వారు దాడులకు దిగుతున్నారు. 
– జగన్‌ గారు క్లియర్‌గా ఇది క్లాస్‌వార్‌ అని చెప్పుకుంటూనే వస్తున్నారు. 
– ధనవంతులకు, పేదవారికి మధ్య జరుగుతున్న యుద్ధం అని స్పష్టంగా చెప్పారు.

బందిపోటు దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు:
– జగన్‌గారు ప్రజలను నమ్ముకుని వారికోసం పనిచేస్తే..చంద్రబాబు తప్పుడు వ్యవస్థలను తీసుకొచ్చి దోచుకుని దిగిపోయాడు.
– ఇంకా అదే భ్రమల్లోనే బతుకుతూ తాను కాబోయే ముఖ్యమంత్రిని అని ఏదేదో చేస్తానంటున్నాడు.
– చంద్రబాబు ఏం చేశాడో కూడా మేం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి.
– జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో దోపిడీ దొంగల ముఠాలను పెట్టాడు.
– బాత్‌ రూమ్‌ కావాలన్నా, పింఛన్‌ కావాలన్నా, చిన్న సర్టిఫికెట్‌ కావాలన్నా లంచం. 
– గ్రామంలో 7 మంది జన్మభూమి కమిటీల సభ్యులు సంతకాలు పెడితేనే ప్రభుత్వ పథకాలు అందేవి. 
– ఈ రోజు అలాంటి వ్యవస్థలే లేవు. డోర్‌ డెలివరీ సిస్టమ్‌ వచ్చింది. పేదవాడికి ప్రత్యక్షంగా వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా సేవలు అందుతున్నాయి. 
– నీరు–చెట్టు పేరుతో మట్టిని దోచుకుని అమ్ముకున్న అసలు బదిపోటు దొంగల ముఠా నాయకుడివి నువ్వు కాదా?
– వంద రూపాయలు ఖర్చు అయ్యే కాంట్రాక్టు పనులను మరో వందకు పెంచి ప్రభుత్వ ఖజానాను దోచుకున్న బందిపోటువి నువ్వు కాదా?
– ఫేక్‌ రాజధాని నిర్మాణం కోసం ఫేక్‌ దేశాలు తిరిగి..ఫేక్‌ ప్రయాణపు ఖర్చులు పెట్టి ఫేక్‌ ముఖ్యమంత్రిగా మిగిలిన అసలు బందిపోటువి నువ్వుకాదా?

చంద్రబాబు ఒంటినిండా స్కాంలే:
– చంద్రబాబు ఒంటి నిండా జబ్బులతో పాటు స్కాంలే ఉన్నాయి. 
– స్కిల్‌ స్కాం, ఫైబర్‌ నెట్‌ స్కాం, రాజధాని రింగ్‌ రోడ్డు స్కాం, కరకట్టపై నువ్వు నిర్మించుకున్న ఇంటి స్కాం..ఇలా స్కాములు బాబుగా నువ్వు మిగిలిపోయావు.
– నీ జీవితంలో నువ్వు చెప్పుకోడానికి ఏ మైలు రాయీ లేదు..ఏ పునాది రాయీ లేదు. 
– అందుకే ఇప్పుడు గులకరాయిని నమ్ముకున్నావ్‌..గులకరాళ్ల రాజకీయాన్ని మొదలు పెట్టావ్‌. 
– నీ జీవితంలో కుళ్లు, కుట్రతో, అసూయతో నిండిపోయి వెన్నుపోట్లతో నిండిపోయి ఒళ్లంతా జబ్బుల మయం అయింది.
– కురువృద్ధుడివై మైకుల ముందుకు వెళ్లి నువ్వేం మాట్లాడుతున్నావో కూడా నీకు అర్ధం కావడం లేదు. 
– ప్రజల ముందు మాట్లాడే ముందు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడితే మంచిది. 

యాంటి సోషల్ ఎలిమెంట్ గా పవన్ కల్యాణ్:
– నువ్వొక నరరూప రాక్షసుడివి..నీ నైజం..సమాజంలో అల్లర్లు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు ఉంటే రాజకీయ పబ్బం గడుపుకోవచ్చని వాటిని వేదికగా చేసుకున్నావు. 
– నీ నరరూప రాక్షసత్వానికి పోలికలతో మరో 7గురు ఉన్నారు. మీరంతా ఒకటే తాను ముక్కలు..అందుకే ఒకే చెట్టుమీదకు ఎక్కాయి. 
– వారు రామోజీ, రాధాకృష్ణ, టీవీ5, పవన్‌ కల్యాణ్‌ అందులో భాగం. 
– పవన్‌ కల్యాణ్‌ ఒక యాంటీ సోషల్‌ ఎలిమెంట్‌గా మారిపోయాడు. 
– ఆయన సభ్యసమాజంలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడటం లేదు. 
– వీళ్లు సమాజానికి పట్టిన చీడ పురుగులు వీరు. 
– కోవర్టులను ఏర్పాటు చేసి పక్క పార్టీ అయిన బీజేపీలోకి పంపాడు. 
– ఈ ముఠాలన్నీ కలిసి జట్టు కట్టి..సమాజాన్ని దోచుకుని దాడి చేస్తుంటే పేదవాళ్లంతా ఏకమయ్యారు. 
– పేదవాళ్ళ నాయకుడిగా, నీతి నిజాయితీతో పరిపాలించే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడిగా, వారు నమ్ముకున్న అర్జునుడే వైయ‌స్‌ జగన్‌ గారు.
– ఆ అర్జునుడే ఒక్కడే పోరాటం చేస్తున్నాడు. పేదవాడు కాలర్‌ ఎగరేసి బతకగలిగేలా చేస్తున్నాడు.
– ఆ ఆర్జునుడిలా, ఈ కుట్రదారులు చేస్తున్న దాడిని ఎదుర్కొని ఒక్కడే రొమ్మెత్తి నిలబడిన వ్యక్తి వైయ‌స్‌ జగన్‌ గారు. 

మార్గదర్శి అక్రమాలపై సుప్రీంకు సమాధానం ఎందుకు చెప్పలేదు రామోజీ?:
– ఈ రోజు రామోజీరావు తన ఈనాడు హెడ్‌లైన్స్‌లో బందిపోటు పాలన అని రాశాడు. 
– ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. రామోజీరావు అధర్మ యుద్ధానికి తెరలేపాడు.
– ఈ డ్రామోజీరావు వైయ‌స్ఆర్ పరిపాలన నుంచి ఈనాడు జగన్‌ గారిపై మాటల దాడి చేస్తున్నాడు.
– బందిపోటు అని టైటిల్‌ పెట్టిన వాడు మార్గదర్శిపై సుప్రీం కోర్టులకు సమాధానం చెప్పలేదెందుకు? 
– నీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో జరిగిన స్కాంలకు నువ్వు ముందు సమాధానం చెప్పు. 
– ఎక్కడ ఎన్ని కోట్లు డిపాజిట్లు అయ్యాయి..ఎన్ని వేల మందిని సభ్యులుగా చేర్చుకున్నావు..ఆ డబ్బును ఎక్కడ పెట్టావు..ఏ సంస్థలకు మళ్లించావని సుప్రీం కోర్టు అడిగింది. 
– సుప్రీం కోర్టుతో ప్రశ్నించబడిన దొంగవు నువ్వు..ఈ రోజు ప్రజానాయకుడిని పట్టుకుని ప్రతి రోజూ ఇలా టైటిల్స్‌ పెట్టి దాడి చేస్తున్నాడు. 
– మీరు చేసిన స్కాంలకు గ్రామాలు, జిల్లాలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వజ్రాయుధాన్ని తయారు చేసుకున్నారు. 
– వీళ్లు మనల్ని బతకనివ్వరు..మన ఆస్తులు, మన మాన,ధన ప్రాణాలు దోచుకుని తింటున్నారని, వీళ్ల నుంచి మనల్ని రక్షించే వాడు ఒక్కడే..ఆయనే జగన్‌ గారు అని నిర్ణయం తీసుకున్నారు. 
– అందుకే 151 సీట్లిచ్చి గెలిపించుకుని మూడు పూటలా కడుపునిండా అన్నం తింటూ తృప్తిగా ఉన్నారు. 
– ప్రజలకు ఏ కష్టం లేదు. కోవిడ్‌ వచ్చింది..ఆదుకున్నాడు..అకాల వర్షాలు వచ్చాయి..రైతన్నలను ఆదుకున్నారు. 
– నువ్వు చెప్పిన అబద్ధపు ప్రచారంలో మోసపోయిన యువతకు ఉద్యోగాలు ఇచ్చాడు. 
– ఇంత మంచి పనులు చేసినా ఇంకా మీ కక్ష తీరలేదు. 
– జగన్‌ గారిపై దాడుల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. 

పచ్చ పసుపు కళాకారుల గుంపే సిటిజన్స్‌ ఫర్‌ డెమెక్రసీ:
– మా ప్రభుత్వంలో స్పెషల్ సెక్రటరీగా పనిచేసి, మాచే ఉన్నతమైన పదవులను అందుకుని..ఈ రోజు రిటైర్‌ అయి ఏమీ చేయాలో తోచక అసలు రూపం బయటకు తీశారు మాజీ ఐఏఎస్ పీవీ రమేష్. 
– అసలు రూపమైన పసుపు విషపాములు బయటకు వచ్చాయి. 
– పచ్చ పసుపు కళాకారులు బయటకు వచ్చారు. ఆ గ్రూపు పేరే సిటిజన్స్‌ ఫర్‌ డెమెక్రసీ. 
– ఈ పేరుతో ఈయనో మేధావిగా, సమాజ సేవకుడిలా మాట్లాడుతున్నాడు. 
– ఈ పీవీ రమేష్‌ సమాజానికి ఏం చేశాడో..ఎన్ని దానధర్మాలు చేశాడో చెబితే మేం తరిస్తాం. 
– ఇది సిటిజన్స్‌ ఫర్‌ డెమెక్రసీ కాదు..ఇది సిటిజన్స్‌ ఫర్‌ డెమెగ్రఫీ. దెయ్యాల తత్వం ఇది. మీవి చీకటి బాగోతాలు. 
– ఏం వెలగబెట్టారు మీరు? నీకు, సిగ్గూ లజ్జా ఉంటే ఎలా బందిపోటు అయ్యాడో చెప్పు? 
– ఆయన బట్టలు విప్పదీసి నిలబడి,  ముసుగు తీసేసి అసలు పసుపు రంగులోకి వచ్చాడు. 
– రూ.2.75 లక్షల కోట్లు పంపిణీ చేసిన ప్రజా నాయకుడు బందిపోటు అయ్యాడా? 
– మీరు అభిమానించే చంద్రబాబు ఎన్నో స్కాంలు చేస్తే ఆయన బందిపోటు కాలేదా? 
– పీవీ రమేష్‌..నువ్వు వెధవల గుంపునకు నాయకుడిగా మారావు. 
– ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుని ప్రెస్‌మీట్‌లు పెట్టి, ఏసీ రూమ్‌లలో కూర్చుని మారుమూల ప్రాంతాల్లో జీవించే సామాన్యుడి జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన దొంగల ముఠాలో నువ్వూ చేరిపోయావు.
– 5 ఏళ్లు చంద్రబాబు పరిపాలనలో ఏం చేశాడో చెప్పు. నువ్వూ ఆనాడు చంద్రబాబు పరిపాలన విఫలమైందని చెప్పావు కదా?
– జగన్‌గారు బందిపోటు కాదు..అర్జునుడు. 51 శాతం ఓట్లతో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు. 
– మీరెన్ని దాడులు చేసినా, మేధావులు దాడి చేసినా, పత్రికాధిపతులు, టెలివిజన్లు దాడి చేసినా, సినిమా యాక్టర్లు దాడి చేసినా ప్రజల కోసం ఒక హీరో ఉన్నాడు. ఆయన పేరే జగన్‌మోహన్‌రెడ్డి. 
– ఆయన్ను తిరిగి 2024 ఎన్నికల్లో 13న ప్రజలు ఓట్లు వేస్తారు. జూన్‌ 4న ఫలితాలు వస్తాయి. 
– అప్పుడు మీరు ఒక్కరు కూడా కంటికి కనిపించరు. ఈ సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది. 
– ఏముంది నీ జీవితంలో..? ఏ రోజైనా నీకు ఎండ తెలుసా? నీ కాలిలో ముళ్లుందా? నీకు మట్టి వాసన తెలుసా? 
– మా నాయకుడు ప్రజలచే ఎన్నుకోబడి..ప్రజల కోసం నిలబడిన ప్రజానాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు.
– ఆయన గురించి బందిపోటు అని మాట్లాడితే ప్రజలే నీకు బహిరంగంగా బుద్ధిచెప్పే రోజు వస్తుంది. 
– ఇవేం వద్దు. ఒక్క ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వ్యక్తులును అడుగుదాం. 
– చంద్రబాబు బందిపోటా? జగన్‌ గారు బందిపోటా? అనేది అడుగుదాం.
– చంద్రబాబు హయాంలో వారి జీవితాలు బాగున్నాయా?  వైయ‌స్ జగన్  హయాంలో వారి జీవితాలు బాగున్నాయా? 
– చంద్రబాబు హయాంలో వారి ఎకౌంట్లలో ఎంతున్నాయి..జగన్‌ గారి హయాంలో వారి బ్యాంకు ఎకౌంట్లలో ఎంత పడ్డాయి అనేది అడుగుదాం.
– దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకు డబ్బు చేరవేసే విధానం వారికి నచ్చడం లేదు.
– సామాన్యుడు మూడు పూటల అన్నం తినడానికి మీరు వ్యతిరేకం కదా?
– కానీ ప్రజలు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో లేరు. వారు ధైర్యంగా కాలరెగరేసి బతుకుతున్నారు. 
– ప్రజలు మే 13న తీర్పు ఇవ్వబోతున్నారు. నువ్వు చెప్పిన ఆర్గ్యుమెంట్‌ కరెక్టో కాదో ఆరోజే తేలిపోతుంది.
– చంద్రబాబు ఎన్ని సార్లు విదేశీ పర్యటన చేశాడు..ఎందుకు చేశాడు..ఆ ఖర్చు ఎంత? 
– రాజధాని పేరుతో రైతులు భూములు ఎలా దోచుకున్నాడు..అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఎలా చేశాడో ఆనాడు నీకు కనిపించలేదా?
– తాను దోచుకోవడమే కాకుండా తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా పంచిపెట్టింది చంద్రబాబు కాదా?
– అయాక రైతుల భూములు దోచుకున్న అసలు బందిపోట్లు మీరే. 
– మీరు మాట్లాడే మాటలు ప్రసారం చేసే టీవీలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా మీరు కనిపిస్తున్నారు. 
– అవి లేకపోతే మీరు అసలు కనిపించను కూడా లేదు.
– మీరొస్తే వారిని సగర్వంగా నిలిపిన ఈ పరిపాలన మళ్లీ రాదనే భయంతో ప్రజలు వైయ‌స్ జగన్‌ గారికి ఓటేయడానికి మే 13 తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. 

వైయ‌స్ జగన్‌ ని పేదల గుండెల్లోంచి తీసేయడం మీవల్ల కాదు:
– వైయ‌స్ జగన్ పేద ప్రజల గుండెల్లోకి వెళ్లిపోయాడు. వారి గుండెల్లోంచి జగన్‌ గారిని తీసివేయడం ఈ డ్రామా కంపెనీల వల్ల కాదు. 
– ఈనాడు డ్రామోజీరావు, రాధాకృష్ణ, కొత్తగా వచ్చిన మాజీ అధికారులు అందరిదీ పెత్తందారుల వ్యవస్థ. 
– సమాజాన్ని పట్టి పీడిస్తున్న జలగలు వీళ్లు. సమాజంలో ఉన్న సంపదను దోచుకోవాలని వివిధ రూపాల్లో వస్తున్నారు.
– వ్యవస్థను దోచుకోవడానికి వాళ్లు ఎంచుకున్న మార్గాలు రాజకీయాలు, మీడియా, సినిమా, మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లు. 
– ఆ పెత్తందారీ వ్యవస్థకు జగన్‌ గారు తూట్లు పొడిచారు. 
– జగన్‌ గారు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఒక రూపాయి పంపిణీ చేస్తే.. డీబీటీ ద్వారా ఆ రూపాయి నేరుగా లబ్ధిదారులకు చేరింది. 
– టీడీపీ హయాంలో ఈ మధ్యలో జన్మభూమి కమిటీల్లాంటి కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా సమాజాన్ని దోచుకున్న వారికి జగన్‌ గారు అడ్డుగా నిలిచారు.
– అందుకే ఆయనపై దాడి జరుగుతోంది. మాటలు దాడి, మీడియాతో అబద్ధపు ప్రచారాల దాడి జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా భౌతిక దాడులు మొదలు పెట్టారు.
– ఇదొక యుద్ధం. ఉన్నవారి ప్రయోజనాల కోసం పనిచేసే చంద్రబాబుకు, లేని వారి ప్రయోజనాల కోసం పనిచేసే జగన్‌ గారికి మధ్యలో జరుగుతున్న ఘర్షణ. 
– చిట్టచివరి పల్లెలో ఉండే వారు కూడా తన బిడ్డల్లా చదువుకోవాలని, సంక్షేమ పథకాలను, సంస్కరణలను అమలు చేసి చూపిస్తున్న నాయకుడు జగన్‌ గారు.
– అదే చంద్రబాబుకు 14 ఏళ్లు పాలించమని అధికారం ఇస్తే ఏం చేశావ్‌..అప్పనంగా దోచుకున్నావ్‌.
– నీకు అనుయాయులుగా ఉన్న సంస్థలను అభివృద్ధి చేసి వారిని దోపిడీ దొంగల ముఠాగా మార్చుకున్నాడు.
– వీరంతా ఒక జట్టు కట్టి, ఇప్పుడు వైయ‌స్ జగన్‌ గారిపై దాడికి దిగుతున్నారు.
– వైయ‌స్ జగన్‌ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 7 వ్యవస్థలు కొత్తగా వచ్చాయి.
– అందులో వాలంటీర్‌ వ్యవస్థ, ఆర్బీకేలు, సచివాల వ్యవస్థ, డిజిటల్‌ లైబ్రరీలు, నాడు–నేడు స్కూల్స్, నాడు–నేడు ఆస్పత్రులు, మహిళా పోలీసులు, ఇంగ్లీషు మాధ్యంలో బోధన. 
– ఈ వ్యవస్థలు జగన్‌ గారి సొంతం. ఆయన వచ్చిన తర్వాత మాత్రమే ఈ వ్యవస్థలో మన రాష్ట్రంలో ఏర్పడ్డాయి.
– మరి అంత అనుభవం కలిగిన చంద్రబాబు ఈ ఏడు వ్యవస్థలను ఎందుకు తీసుకురాలేకపోయాడు.
– చంద్రబాబును, పవన్‌ కల్యాణ్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు హయాంలో మీరు తీసుకొచ్చిన వ్యవస్థలేంటో ఏపీ ప్రజలకు చెప్పండి.
– దమ్ముగా మేం మా కార్యకర్తలతో ఇంటింటికీ తిరుగుతూ చెప్తున్నాం. మేమిన్ని కార్యక్రమాలు చేశాం..దీవించండి అని అడుగుతున్నాం.
– నువ్వేం చెప్తున్నావ్‌..రాళ్లేయమని చెప్తున్నాడు. తిట్టమని చెప్తున్నాడు. 

దేశంలోనే 99 శాతం మేనిఫెస్టోని అమలు చేసిన తొలి నాయకుడు వైయ‌స్ జగన్‌ గారు:
– వైయ‌స్‌ జగన్‌ గారు తీసుకొచ్చిన ఈ సుపరిపాలనలో రూ.2.70 లక్షల కోట్ల డబ్బు డీబీటీ ద్వారా ప్రజలకు చేరిందా లేదా? దానికి ప్రజలే సాక్ష్యం. 
– డబ్బు తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా లబ్ధిదారుడు, ప్రభుత్వం మధ్యనే లావాదేవీలు జరిగాయి. 
– 2.31 లక్షల శాశ్వత ఉద్యోగాల కల్పించారు. దీనిలో ఏమైనా మోసం ఉందా? 
– ఒక్క సచివాలయ వ్యవస్థలోనే 1.30 లక్షల ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలే రాలేదంటారేం? 
– ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన చరిత్ర జగన్‌ గారు కాదా? 
– 99 శాతం మేనిఫెస్టోను అమలు చేసిన తొలి రాజకీయ నాయకుడు దేశంలో వైయ‌స్‌ జగన్‌ గారే ఒక్కరే.
– చర్చకు రండి..మీరు మాట్లాడే దాంట్లో 95 శాతం అబద్ధాలుంటాయని నేను నిరూపిస్తా. 

Back to Top