పింఛన్ల పంపిణీని అడ్డుకుని..ఇప్పుడు మొసలి కన్నీరా బాబూ..?

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  

పింఛన్లు ఎలా పంపిణీ చేయాలో చెప్పడానికి నువ్వెవరు చంద్రబాబూ?

ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ఈసీని, ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తావా?:  సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది. నువ్వు చెప్పాల్సిన పనిలేదు.

వృద్ధుల కన్నీళ్లకు కారణం నువ్వే కదా...అసలు నువ్వు మనిషి జన్మ ఎత్తావా?

32మంది వృద్ధులను పొట్టన పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తుంది చంద్రబాబే

నీ హయాంలో కళ్లు నెత్తికెక్కాయా? అప్పుడెందుకు ఇంటింటికీ పింఛన్‌ పంచలేదు.?

వృద్ధులు, వికలాంగుల కష్టాలకు పూర్తి బాధ్యత చంద్రబాబు, పవన్, పురంధేశ్వరిలదే.:  సజ్జల 
రామకృష్ణారెడ్డి

కులాల మధ్య చిచ్చు పెట్టే లక్షణం దత్తతండ్రి, దత్తపుత్రుడికే ఉంది

తుని సంఘటనపై కేసు పెట్టింది చంద్రబాబే కదా..ఎవరు బాధ్యులో ఆయన్నే అడగు పవన్‌.

ఇంకా ఏమైనా అనుమానం ఉంటే ఆనాడు ముద్రగడకు సంఘీభావం తెలిపిన నీ అన్న చిరంజీవిని 
అడుగు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి. 

తాడేప‌ల్లి:  ఇంటింటికి అందుతున్న పింఛ‌న్ల‌ను అడ్డుకుని..ఇప్పుడు చంద్ర‌బాబు మొసలి కన్నీరు కార్చుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  మండిప‌డ్డారు. పింఛ‌న్ల పంపిణీపై చంద్ర‌బాబు తీరును స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఏమ‌న్నారంటే..

*నువ్వు ఒక నెల ఆపినంత మాత్రాన జగన్‌ గారిపై అభిమానం తగ్గుతుందా?:*
– వృద్ధులు, వికలాంగులకు నాలుగున్నరేళ్లుగా వాలంటీర్‌ వ్యవస్థ ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేస్తోంది. 
– చంద్రబాబు తన బినామీలతో వాలంటీర్లు వైఎస్సార్సీపీకి ప్రచారం చేస్తారనే సాకు చూపి వాళ్లను పక్కన పెట్టడానికి తానే కారణం అయ్యాడు. 
– ఏప్రిల్‌1న ఇవ్వాల్సిన పింఛన్‌ కొత్త ఏడాది అయినందువల్ల 3వ తేదీ ఇస్తే దాన్నీ కూడా యాగీ చేశాడు.
– దానికి ఆయన చెప్పిన కారణం వాలంటీర్లు వైఎస్సార్సీపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు అంటున్నారు.
– ఏ ప్రభుత్వమైనా మంచి చేస్తుంటే పార్ట్‌ టైమర్స్‌ అయినా సరే..వారిపై ప్రజల్లో అభిమానం ఉండొచ్చు.
– ఈ ఎన్నికల నెలలో వాళ్లెళ్లి ఇచ్చినంత మాత్రానా ప్రభావితం చేస్తారని అనుకోవడం పొరపాటని ఆనాడే చెప్పాం. 
– 2.60లక్షల మంది వాలంటీర్లు అనేకమైన సేవలు అందిస్తున్నారు. వాటిలో పింఛన్లు పంపిణీ చేయడం ఒకటి. 
– ఎప్పటికప్పుడు వారికి భరోసా ఇస్తూ పథకాలు లేకపోతే వాలంటీర్లకు ఆదరణ ఎందుకుంటుంది? 
– అల్టిమేట్‌గా అది వాలంటీర్ల వల్ల కాదు..వారు అందుకుంటున్న బెన్‌ఫిట్‌ ఎవరిస్తున్నారో వాళ్లకి బ్లెస్సింగ్స్‌ ఇస్తారు. అది వాలంటీర్ల వస్తుందని కాదు..
– నువ్వు ఒక నెల ఆపినంత మాత్రాన జగన్‌ గారిపై అభిమానం తగ్గుతుందా? 
– నువ్వు చెప్తే నిన్ను ఎక్కడ వెంటపడి కొడతారో అనే భయంతో ఒక బినామీ సంస్థతో ఆ వ్యవస్థను ఆపించాడు.
– సుప్రీం కోర్టుకు వెళ్లారు..ఎన్నికల కమిషన్‌పై వత్తిడి చేశారు. చివరికి వారు అనుకున్నది సాధించారు. 

*అసలు ఎలా పంచాలో చెప్పడానికి చంద్రబాబు ఎవరు?:*
– ఎన్నికల కమిషన్‌ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమన్నది. దానిలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం వీలైనంత త్వరగా పింఛన్‌ అందించడానికి ప్రయత్నం చేసింది.
– రాగలిగిన వాళ్లను సచివాలయాలకు రమ్మని చెప్పింది. రాలేని వాళ్లకు ఇళ్లకు వెళ్లి పంపిణీ చేసింది.
– సాధారణంగా వాలంటీర్లు ఉంటే ఒకరోజులోనే 90 శాతం అయ్యేది ఆ వ్యవస్థ లేదు కాబట్టి రెండు మూడు రోజులు పట్టింది. 
– దీన్ని చూసి ఆ వ్యతిరేకత అంతా తనమీదకు వస్తుందనే భయంతో సచివాలయ సిబ్బంది 1.20లక్షల మందితో పింఛన్‌ పంపిణీ చేయాలని కొత్త రాగం అందుకున్నాడు.
– అప్పటి వరకూ రాష్ట్రంలో ఉద్యోగులే లేరన్న చంద్రబాబు..జగన్‌ గారు పెట్టిన 1.20లక్షల మంది ఉద్యోగులున్నారని ఒప్పుకున్నాడు.
– అసలు ఎవరీయన? ఈయనేమన్నా ప్రభుత్వంలో ఉన్నాడా? 
– ఓ పక్క ఉన్న వ్యవస్థనూ నువ్వే దెబ్బ తీస్తావ్‌..మరో వైపు దానికి బదులు ప్రభుత్వం ఏం చేయాలో కూడా నువ్వే చెప్తావ్‌? 
– నువ్వు చెప్పింది చేయకపోతే నేను ఒప్పుకోను అంటాడు.

*చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ను తన మీడియాతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు:*
– తనకు ఏం అధికారం ఉందని రోజు ఏదో ఒకటి చెప్పడం, ఎన్నికల కమిషన్‌పై వత్తడి పెట్టడం చేస్తున్నాడు.
– చివరికి ఆయన బ్లాక్‌ మెయిల్‌ ఎంతవరకూ వెళ్తోందంటే ఉన్మాదంతో తన మీడియాలో అడ్డంగా అధికారులపై రాతలు రాయిస్తున్నాడు.
– చంద్రబాబు ఇప్పుడే కాదు..2019లోనూ సీఈవోపై దాడికే వెళ్లాడు. ఇప్పుడూ అదే చేస్తున్నాడు. 
– నువ్వు బ్రేక్‌ చేసినా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. సచివాలయ సిబ్బంది ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకూ కూర్చుని మూడు రోజుల్లో పంచేశారు.
– ప్రభుత్వం పని ప్రభుత్వాన్ని చేసుకోనిస్తే రెండు మూడు రోజుల్లో పూర్తవుతుంది. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది? 
– చంద్రబాబు భయం ఏంటంటే..అతని వల్లే వృద్ధులు రోడ్డెక్కాల్సి వచ్చింది..ఆ కోపమంతా తనపై చూపిస్తారని వణికిపోయాడు.
– దీంతో నేను ఒప్పుకోను...ఇంటికి తీసుకెళ్లే ఇవ్వాలంటూ పిటిషన్లపై పిటిషన్లు పెట్టాడు. 
– లేదంటే ఆ 32 మందిని నువ్వే చంపినట్లవుతుంది అని బూతులు తిట్టాడు.
– శవరాజకీయం చేస్తున్నాం అంటూ మాట్లాడుతున్నాడు. అసలు శవ రాజకీయం చేస్తున్నది చంద్రబాబు కాదా? 

*ఈ పాపం నీది కాదా చంద్రబాబూ..అసలు నువ్వు మనిషి జన్మ ఎత్తావా?:*
– ఈ రోజు ఈసీ నుంచి విస్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీనికి డీబీటీ వేస్తే నేను ఒప్పుకోను అంటూ మాట్లాడుతున్నాడు.
– డీబీటీ ద్వారా వేయండి అని ఈసీ ఈ రోజే కాదు..ఏప్రిల్‌ మాసం ప్రారంభంలోనూ చెప్పింది. 
– మార్చి 30వ తేదీన ఈసీ ఇచ్చిన ఆదేశాల్లోనే డీబీటీ అన్నారు. ఈ సారి రాసిన లెటర్లో కూడా అదే చెప్పారు.
– మళ్లీ చంద్రబాబు గ్యాంగ్‌ మొత్తం గవర్నర్‌ను కలిసి, ఢిల్లీలో కూర్చున్న ఈయన ఏజెంట్లు ఎన్నికల కమిషన్‌పై వత్తడి తెస్తున్నారు. 
– ఇక్కడ సీఈవో ఎవరి చేతిలో ఉన్నాడంటూ వరుసపెట్టి కథనాలు రాయించాడు.
– వాళ్లను బ్లాక్‌మెయిల్‌ చేసి, వత్తడి చేసి మళ్లీ లెటర్‌ రాయించారు.
– ఆ ఆదేశాలకు మేరకే ఈ రోజు ప్రభుత్వం డీబీటీ ద్వారా అవకాశం ఉన్న వారికి బ్యాంకులో వేస్తోంది. లేని వారికి ఇళ్ల వద్దకు వెళ్లి ఇస్తోంది. 
– ఇందులో తప్పు ఎవరిది? ఈ పాపం ఎవరిది? చంద్రబాబుది కాదా? 
– నువ్వు తిట్టే తిట్లు చూస్తుంటే అసలు నువ్వు మనిషివేనా అనిపిస్తోంది. అసలు నువ్వు మనిషి జన్మ ఎలా ఎత్తావని అనిపిస్తోంది.
– చంద్రబాబు తన ప్రసంగం అరగంట సాగితే 27 నిమిషాలు తిట్లే ఉంటాయి.
– భూమికి భారం అంటాడు..తల్లికి భారం అంటాడు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబును చూసి తన తండ్రి కూడా సిగ్గుపడి ఉంటాడు.
– ఏవైతే తనకున్న లక్షణాలను తీసుకొచ్చి జగన్‌ గారికి ఆపాదిస్తున్నాడు.
– సంధి ప్రేలాపనలతో ఏదంటే అది మాట్లాడతాడు. 
– మొన్న ఏకంగా జగన్‌ గారిని చంపితే ఏమవుతుంది అంటున్నాడు.

*2014–19 మధ్య నువ్వు చేసిన పింఛన్ల పంపిణీ ప్రజలు మర్చిపోయారనుకుంటున్నావా బాబూ?:*
– నీకు చేతకాకపోతే తప్పుకో..ఒక నిమిషంలో నేను డిస్ట్రిబ్యూషన్‌ చేసి చూపిస్తా అంటాడు.
– నిజంగానే ఆయన తలకాయలో చిప్‌ జారిపోయింది. 2014–19 మధ్య నువ్వు చేసింది జనం మర్చిపోయి ఉంటారనుకుంటున్నారా? 
– ఇన్ని మాట్లాడుతున్న చంద్రబాబు ఏం చేశాడా అని ఆరా తీస్తే వృద్ధులు, వికలాంగులంతా క్యూలు కట్టి పింఛన్ల కోసం నానా అగచాట్లు పడ్డారు. 
– ఒక సారి ఆయన పింఛన్ల పంపిణీ ఎలా సాగిందో మచ్చుకు చీరాలలో చూద్దామా? 
– వృద్ధులు, వికలాంగులు, సుగర్, బీపీలు ఉన్న వాళ్లు ఎండలో నిలబడి నానా అగచాట్లు పడ్డారని లబ్ధిదారులే చెప్తున్నారు. 
– ఇలాంటి చంద్రబాబు హయాంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ప్రతి గ్రామంలో కనిపించే సాధారణ దృశ్యాలు. 
– రాష్ట్రమంతా దీనికి సాక్ష్యం. పింఛన్‌ వస్తుందో రాదో కూడా తెలియక, ఎన్ని నెలలు ఆపుతారో తెలియక తిరగాల్సిన పరిస్థితి.
– నువ్వు ఈ రోజు సాఫీగా సాగుతున్న పింఛన్‌ పంపిణీలో ఇబ్బంది రావడానికి కారణం నువ్వే అయ్యి జగన్‌ గారిని ప్రశ్నిస్తున్నాడు. 
– ఈ రోజు పరిస్థితికి చంద్రబాబే కారణం. 
– పోనీ ప్రభుత్వం తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తుంటే మళ్లీ మధ్యలో దూరతాడు.
– నానా యాగీ చేసి డీబీటీ ద్వారానే ఇవ్వండి అని ఈసీ నుంచి ఆదేశాలు తెప్పించాడు.
– మళ్లీ ఇప్పుడు లేదు లేదు ఇంటింటికి తిరిగి ఇవ్వాల్సిందే అంటాడు.

*అసలు నీకు సిగ్గూ ఎగ్గూ ఏమీ ఉండవా చంద్రబాబు..?:*
– అసలునీకు సిగ్గూ ఎగ్గూ ఏమీ ఉండవా చంద్రబాబూ? 
– నిన్న నువ్వేం చేశావ్‌...ఈ రోజు ఈ దుస్థితికి కారణం నువ్వు కాదా అని నిన్ను అడుగుతారనే సిగ్గు కూడా లేదా? 
– వాళ్లంతా రేపు నీ ముఖం మూడు ఉమ్మేకపోతే చూడు.
– ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి పెనం మీద నుంచి పోయ్యిలో పడ్డట్లు అయిపోయింది.
– ఇప్పుడు వచ్చి ఇంటింటికీ పంచమంటున్నావే..నీ హయాంలో అలా పంచడానికి కనీస ప్రయత్నం అన్నా చేశావా? 
– నువ్వంటున్న 1.20 లక్షల ఉద్యోగులకు వేరే పని ఏమీ ఉండదా? 
– ఆ పనులు చేసుకుంటూ పింఛన్ల పంపిణీకి అవకాశం ఉన్న వారితో పంపిణీ చేస్తున్నారు.
– కనీసం ఇంటి పక్కనే ఉన్న సచివాలయం నుంచి తెచ్చుకునేదానికి కూడా నువ్వు గండి కొట్టి దూరంగా ఉన్న బ్యాంకు వద్దకు వెళ్లేటట్లు చేశాడు.
– మళ్లీ ఈ పాపమంతా నీదే అంటూ జగన్‌ గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు.
– ఆనాడు ఎండలో అల్లాడుతున్న వృద్ధులను చూసైనా ఇంటింటికీ పంచాలనే ఆలోచన నీకు రాలేదా?
 – వారి కష్టాలను చూసే కదా జగన్‌ గారికి ఇటువంటి ఆలోచన వచ్చింది. మరి నీకెందుకు రాలేదు.
– ఆ వయసులో వారి ఆలనా పాలనా చూసుకుని కష్టం లేకుండా చేయాలని జగన్‌ గారు మొదటి ప్రాధాన్యం కింద ఇంటికే పింఛన్లు అందిచారు.
– అందువల్లే జగన్‌ గారికి అందరి ఆదరణ దక్కింది.
– నీ హయాంలో నువ్వు పాపం చేశావ్‌. దాన్ని సరిదిద్ది ఇంటివద్దే పంచుతుంటే దాన్నీ నాశనం చేశావ్‌.
– ఇప్పుడు నువ్వు తప్పుకో..నేనిస్తా అంటున్నాడు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఇవ్వమంటావా? 
– అడిగి చూడు..నీ మూతి పగలగొడతారు. అదే నిజమైతే ఆ రోజు ఎందుకు చేయించలేకపోయావ్‌? 

*నీ హయాంలో నీ కళ్లు నెత్తికెక్కాయా? అప్పుడెందుకు ఇంటింటికీ పంచలేదు..?:*
– అప్పుడు నీకు కళ్లు మూసుకుపోయాయా లేక కళ్లు నెత్తికెక్కాయా? వారి కష్టాలు కనిపించలేదా?
– నీకు మామూలు బాషలో చెప్తే ఎలాగూ అర్థం కావడం లేదు.
– అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా నిరాశలో సంధి ప్రేలాపనలు పేలుతున్నాడు.
– ఆయన నిర్వాకం వల్ల వృద్ధులు ఎవరైనా ఇబ్బంది పడితే దానికి బాధ్యులు శ్రీశ్రీశ్రీ చంద్రబాబునాయుడే.
– ఆయనకు వంత పాడుతున్న దత్తపుత్రుడు, ఆయన వదిన పురందేశ్వరిలే అవుతారు. 
– దీనికంతటికీ వైఎస్సార్సీపీ ఏ మాత్రం బాధ్యత కాదు. పరిపాలన అంతా చీఫ్‌ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నడుస్తోంది.
– నువ్వు మర్యాదగా దీనిలోకి జోక్యం చేసుకుండా ఉండి ఉంటే, మళ్లీ వత్తడి తీసుకురాకుండా ఉంటే మళ్లీ రెండు,మూడు రోజుల్లో అయిపోయేది.
– సచివాలయానికి వచ్చి తీసుకునే వాళ్లు తీసుకునేవారు..రాలేని వాళ్లకు ఇళ్లకు తీసుకెళ్లి ఇచ్చేవారు.
– ఎవరైతే 66 లక్షల మందికి ఆ విషయం బాగా తెలుసు. ఈ రోజు దీనికి కారణం చంద్రబాబే అన్న విషయం వారికి స్పష్టంగా తెలుసు.
– నువ్వు 2014–19 మధ్య నువ్వేం చేశావో వాళ్లు మర్చిపోలేదు.
– అసలు ఈ సిస్టమ్‌ తీసుకొచ్చి సమర్ధంగా జగన్‌ నడుపుతుంటే ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదని ఆలోచించాలి.
– ఆ 1.20 లక్షల మందిని నువ్వు పెట్టినట్లు డిమాండ్‌ చేస్తున్నాడు. 
– ప్రజలు జగన్‌కి అధికారం ఇచ్చారు. మంచి చేస్తున్నాడు..దానిలో వేలు పెట్టడం తప్పు అని అనుకోవాలి కదా.
– నా 14 ఏళ్ల చరిత్రలో ఇలా నేను చేయలేదు కదా..నాకు అర్హత ఏం ఉందని అనుకోవాలి కదా?

*దీనికి బాధ్యుడు చంద్రబాబే..ఫలితం అనుభవించక తప్పదు:*
– దీనికి బాధ్యుడివి నువ్వే...దాని ఫలితం కూడా నువ్వే అనుభవించాలి.
– అసలు 23 సీట్లు పెట్టుకుని నువ్వు హుకం జారీ చేయడం ఏంటి?
– రేపు ఆ 23 కాస్తా సింగిల్‌ డిజిట్‌కి దిగిపోయే పరిస్థితి ఉంది.
– అలాంటి నువ్వు నేను హుకం జారీ చేస్తున్నా అంటూ ఆదేశాలు ఇవ్వడం ఏంటో అర్ధం కావడం లేదు.
– కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఒళ్లంతా కొవ్వెక్కిందేమో అర్ధం కావడం లేదు.
– నా కంటి చూపే శాసనం అన్నట్లు మాట్లాడుతున్నాడు.
– ఇలా ప్రత్యర్థులను తిట్టడం, తాను శాశ్వితంగా అధికారంలోకి వచ్చేశానని హుకుం జారీ చేస్తున్నాడు.
– ఈ పదిరోజులైనా అది మానుకుంటే ప్రజలకు కొంతైన ఉపశమనం కలుగుతుంది.
– చంద్రబాబుకు డిపాజిట్లు కూడా గల్లంతు అవుతున్నాయనేది ఆయన మాటల్లోనే వ్యక్తం అవుతోంది. 

 *కులాల మధ్య చిచ్చు పెట్టే లక్షణం దత్తతండ్రి, దత్తపుత్రుడికే ఉంది:*

– కులాల మధ్య చిచ్చు పెట్టే లక్షణం ఏదైనా ఉందంటే దత్తపుత్రుడికి, దత్త తండ్రికే ఉంది. 
– కులాలకు అతీతంగా ఆలోచించే వాడు కాబట్టే జగన్‌ గారిని ఆందరూ ఆదరిస్తున్నారు.
 – కులం కార్డుతోనే బయటపడాలనుకుంటున్నాడు కాబట్టే చంద్రబాబు దత్తపుత్రుడిని రంగంలోకి దించారు.
– పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నవన్నీ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌లో భాగమే. 
– తుని సంఘటనలో ఎవరిపై కేసులు పెట్టారు? కేసులు పెట్టింది ఈయన దత్తతండ్రి చంద్రబాబు కాదా?
– ఇంకా వారికేమన్నా అనుమానం ఉంటే చిరంజీవి గారిని అడిగితే చెప్తారు.
– ఎందుకంటే ఆ రోజు ఉద్యమానికి, ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావం తెలిపారు కూడా.
– వైఎస్సార్సీపీ వారు చేయించారా, కడప జిల్లా వాళ్లు చేయించారా అనేది చిరంజీవి గారిని అడిగితే పవన్‌ కల్యాణ్‌కు స్పష్టత వస్తుంది.
– మేనిఫెస్టో రోజు సీఎం గారు ప్రస్తావించిన పేరు సలహాదారు ధనుంజయ్‌రెడ్డి. అలాంటి పేర్లు చాలా మందికి ఉంటాయి.
– చంద్రబాబు అనే పేరైతే రాష్ట్రంలో ఎవరికీ పెట్టి ఉండరు. అలా ఉండకూడదనే వాళ్ల నాన్న చంద్రబాబు అని పెట్టి ఉంటాడు.
– మరుసటి రోజు వాళ్లు వెళ్లి చర్యలు తీసుకోండి అంటూ ఎన్నికల కమిషన్‌కు పిటిషన్‌ కూడా ఇవ్వడాన్ని చూసి నాకు నవ్వొచ్చింది.

*ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు:*
– వీళ్ల విషప్రచారం ఎక్కడికి పోతుందంటే..ఇక మనం అధికారంలోకి రామనే భయంతో వ్యవస్థపై దాడి చేస్తున్నారు.
– ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. దానికి ఒక రూల్‌ ఆఫ్‌ లా అనేది ఉంటుంది.
– అలాంటిది ఆస్తులను అమ్మేసుకోవడం ఈ వ్యవస్థలో సాధ్యమా? 
– లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై మీ భూములన్నీ పోతాయన్నట్లు చెప్తున్నారు. 
– టెక్నాలజీ పెరిగిన తర్వాత పేపర్‌లెస్‌కి వెళ్లాలనే ప్రయత్నాలు సాగుతుంటే వీరు చేసే ఆరోపణలు సాధ్యమా? 
– వీళ్ల ప్రచారం చూసి భయమేస్తోంది. వీళ్లు ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం పోయేటట్లుగా విషప్రచారం చేస్తున్నారు.
– ఇలాంటి ప్రచారం చేసే చంద్రబాబు అండ్‌ కో అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఉండటానికి అర్హులేనా? 
– ఆయన హయాంలో ఐఎంజీ స్కాం చేసి భూములను అడ్డగోలుగా లాక్కోవలే ప్రయత్నం చేసిన చంద్రబాబే ఇప్పుడు ఈ ప్రచారం చేస్తున్నాడు.
– ప్రజలు ఏమరిపాటుగా ఉంటే నిలువు దోపిడీ చేసే చేయి చంద్రబాబుది. 
– ఈ పది రోజులు ఇతన్ని ఎలా భరించాలో కూడా అర్ధం కావడం లేదు.
– అసలు ప్రతిపక్షంగా కూడా మేం అనర్హులం అనేది వాళ్లు ప్రూవ్‌ చేసుకుంటున్నారు. 
– కాంగ్రెస్‌ పార్టీ ఒక పార్టీనేనా? షర్మిలమ్మ ఎక్కడనుంచి ప్రత్యక్షమయ్యారు? 
– తెలంగాణ నుంచి మాయం అయినందుకు అక్కడ సంజాయిషీ ఇచ్చారా? 
– ఇక్కడ అడ్డమైన ప్రశ్నలు అడగడం ఏంటి? ఆ అర్హత ఆపార్టీకి, ఆమెకు ఉందా?
– 13వ తేదీ తర్వాత వీళ్లెవరు కనిపించరు. 

Back to Top