ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారు

వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్ర‌హం

 సభ నిర్వహించడం చేతగాక పోలీసులపై విమర్శలా? 

2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 2024లో మళ్లీ కలిసి స్టేజ్‌పై ప్రత్యక్షమయ్యారు

కాంగ్రెస్, వైయ‌స్ఆర్‌ సీపీ ఒక్కటేనని మోదీ చెప్పగానే జనం నమ్ముతారా?

తాడేపల్లి: పదేళ్ల తర్వాత మళ్లీ అదే నాటకం మొదలుపెట్టారని ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారని వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సీఎం వైయ‌స్ జగన్‌ను విమర్శించడమే పని పెట్టుకున్నారని అన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా విమర్శలకే టైమ్‌ కేటాయించారని త‌ప్పుప‌ట్టారు.  వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

పదేళ్ల తర్వాత ముగ్గురూ కలిసి అదే నాటకం:

– ప్రజాగళం పేరుతో చంద్రబాబు,పవన్‌ కల్యాణ్, నరేంద్రమోడీ ఒకే వేదికపై కన్పించి రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. 
– ఇదేమీ కొత్తది కాదు..రాష్ట్రం విభజన నేపథ్యంలో పదేళ్ల క్రితం వీరు ముగ్గురూ ఒక వేదికపై కనిపించారు. 
– కొత్త రాష్ట్రం, కొత్త అవసరాలు, సమస్యలను పరిష్కరించాలంటే ఒక బలమైన పొత్తు ఉండాలని,  జాతీయ స్థాయి నాయకత్వం కావాలని చంద్రబాబు అన్నారు. 
– మేం దీనికి సరైన సొల్యూషన్‌ చూపుతామంటూ పవన్‌ కల్యాణ్‌ను తోడుగా తీసుకుని తిరుపతి సభలో ప్రత్యక్షమయ్యారు. 
– పదేళ్ల తర్వాత అదే నాటకం. ఆనాడు కొత్త పెళ్లి కాబట్టి కాస్తంత ఊపు మీద ఉన్నట్లున్నారు.
– ఈ సారి మొత్తం డీలాగా, కేవలం ప్రజల్ని మోసగిస్తున్న ఛాయలు వారి ముఖాల్లో కనిపించింది. 
– నాటకం అని ఎందుకన్నాం అంటే పొత్తులు పెట్టుకోవడం కొత్తేమీ కాదు. చంద్రబాబుకు అసలు కొత్తేమీ కాదు. ఆయన పొత్తు పెట్టుకోకుండా రానే రాడు. 
– ఊతకర్రల మాదిరిగా పొత్తులు పెట్టుకోవడం, ఆ తర్వాత వారిని మార్చడం ఆయనకు ఆలవాటు. 
– 2014లో వీళ్లు కలవడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. వీళ్లందరూ కలిసినా కేవలం 1 శాతం ఓట్ల తేడాతో వాళ్లు అధికారంలోకి వచ్చారు. 
– ఆనాడు వారు ఇచ్చిన ప్రత్యేక హోదాతో సహా హామీలన్నీ ఏమయ్యాయి? 
– కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర క్యాబినెట్‌లో బీజేపీ, కేంద్ర క్యాబినెట్‌లో టీడీపీ పాలు పంచుకుంది. 
– మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను వీరు ఏం నెరవేర్చారు. 

బండబూతులు తిట్టుకున్నారుగా..మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఒకే స్టేజ్‌ ఎక్కారు?:

– మూడేళ్ల తర్వాత విడిపోయి బండబూతులు తిట్టుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ పాచిపోయిన లడ్లు అన్నాడు. 
– ఇక చంద్రబాబు ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కుపెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పటికే తిరుగుతూనే ఉన్నాయి. 
– వ్యక్తిగత విషయాల్లో కూడా ఆవేశంగా మోడీ గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడారు. 
– ఈ రోజు మళ్లీ అదే చంద్రబాబు అవే పార్టీలను కలిపుకుని స్టేజ్‌ ఎక్కారు. 
– నిన్నటి సభలో వారు ఒక సంజాయిషీ ఇవ్వాల్సింది. 2014లో వారిచ్చిన హామీల విషయంపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 
– 2014లో నారా చంద్రబాబునాయుడు సంతకంతో ముగ్గురి ఫోటోలు పెట్టుకుని హామీలు ఇచ్చారు. 
– ఇవి కాక 600 హామీలు ఇచ్చారు. అది ఇప్పుడు దొరకడం లేదు. 
– రైతు రుణ  మాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఆడబిడ్డ పుట్టగానే 25వేలు వేస్తామన్నారు. 
– జాబు కావాలంటే బాబు రావాలి లేదంటే నెలకు రూ.2000 నిరుద్యోగ భృతి అన్నారు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా ఇళ్లు కట్టిస్తామన్నారు. 
– ఈ హామీలను ఇంటింటికీ పంచారు. చంద్రబాబు సంతకంతో ఈ హామీలు ఇచ్చారు. 
– దీనికి వారు సంజాయిషీ ఇచ్చి ఉండాల్సింది. బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తామంటూ లక్ష కోట్ల రైతు రుణమాఫీలో రూ.13 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. 
– అబద్దాలతో మోసపూరితమైన హామీలిచ్చి, కూటమి ఐదేళ్లు కూడా ఉండకుండా ఏ ముఖం పెట్టుకుని ఒకే స్టేజ్‌ మీదకు వచ్చి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. 
– నిన్నటి సభ అబద్ధాలు, వంచన, బాధ్యతారాహిత్యం, రాష్ట్రమన్నా..ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా మోసం చేయడం చాలా సులభం అనే లెక్కలేని తనం కనిపిస్తోంది. 
– రాష్ట్ర ప్రజలు అడగరని అనుకున్నారా? గుర్తుండదులే అనుకున్నారా? 
– పోనీ ఇప్పుడేం చేస్తాం అని చెప్తే నమ్మరని కేవలం జగన్‌మోహన్‌రెడ్డి గారిపై దుమ్మెత్తిపోయడం, నోటికొచ్చినట్లు మాట్లాడారు. 
– నిన్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు రాష్ట్రం పట్ల ఒక బాధ్యత ఉందనుకుంటే వారి ప్రసంగాన్ని తిట్లతో ప్రారంభించి..తిట్లతో ముగిస్తారా? 
– మూడు పార్టీలు కలిపి మీటింగు పెట్టాలనుకున్నారు..కానీ అది ఫెయిలయింది. 
– ఆ సభలో ఈనాడు, ఎల్లోమీడియా పైత్యాన్ని అక్కడ కక్కేసినట్లుంది. 
– వాళ్ల బ్రమల్లో వాళ్లు కొట్టుమిట్టాడుతున్నారు. మేం చెప్పిందే నిజమని అనుకుని ఆత్మతృప్తి పొందినట్లు కనిపించింది. 
– ప్రజలు ఆలోచించరని ఎందుకు అనుకుంటున్నారు..? 

చిన్న సభ నిర్వహించుకోలేక పోలీసులపై పడటం వారి దివాళకోరుతనం:

– సాక్షాత్తు ప్రధాని వచ్చారు. ఆ సభ జరిగిన తీరేంటి? ప్రహసనంలా గందరగోళంగా జరిగింది. 
– ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు వాళ్ల మైక్‌ సిస్టమ్స్‌ ఫెయిల్‌ అయితే పోలీసులు రాలేదని ఆరోపిస్తున్నారు. 
– మా సిద్ధం సభల్లోనూ ఎక్కువ మంది వచ్చినప్పుడు మన ఏర్పాట్లు మనం చేసుకోవాలి. 
– ఇంకా నయం పొరపాటున కరెంటు పోయి ఉంటే ఇక మాపైనే ఎన్నో అనేవారు. 
– ఒక చిన్న సభ..అంతా కలిపి 50–60 వేలు వచ్చి ఉంటారు. మీ సభ మీరేమైనా పొగుడుకోవచ్చు. 
– మీ చేతకాని తనానికి పోలీసు శాఖకు అంటగట్టడం దివాళాకోరుతనం. 
– ప్రధాని మోడీ గారికి సన్మానం అంటారు..శాలువా అంటారు..అది రాదు. 
– పుష్పగుచ్చం అంటారు..అది రాదు..మోడీని తీసుకొచ్చి ఆయన్ను అవమానించారు. 
– ఇవన్నీ చంద్రబాబు ఆత్రాన్ని సూచిస్తాయి. అర్జంటుగా అధికారంలోకి వచ్చేయాలి అనేదే ఆయన తాపత్రయం. 
– జగన్‌ గారి గురించి చంద్రబాబుకు వస్తున్న పీడ కలలను జనం ముందు కక్కేసి త్వరగా ఓట్లేయించుకుని అధికారంలోకి రావాలని తాపత్రయం. 
– జగన్‌ గారి చెల్లెల్లే ఓట్లేయవద్దంటున్నారు అని చంద్రబాబు అంటే...మోడీ గారు మా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ రెండూ ఒకటే అని చెప్తున్నారు. 
– ప్రజలంత అజ్ఞానులు అనుకుంటున్నారా? ఎవరి పార్టీ ఆలోచనలు ఏంటి? మాట చెప్తే మాట మీద నిలబడే వ్యక్తి అనేది వారికి తెలియదా? 
– మన దారిలో మనం విమర్శిస్తే జనం ఓట్లేస్తారనే ఆశ వారిలో కనిపిస్తోంది. 
– మొత్తం మీద ఈ ముగ్గురూ కలిసి రాష్ట్రానికి చేసిన మోసం, వంచన, దగాకోరుతనం స్పష్టంగా కనిపిస్తోంది. 

ప్రధానితో రాష్ట్రానికి హోదా వంటి హామీలు ఇప్పించి ఉండాల్సింది:
– నిన్ననైనా ప్రధాని గారు వచ్చాక రాష్ట్రం గురించి ఏదైనా మాట్లాడించాల్సింది. 
– మా ముఖ్యమంత్రి గారు ప్రధాని ఉన్న వేదికపైనే ప్రత్యేక హోదా, విశాఖఉక్కు వంటి వాటిని దృష్టికి తీసుకొచ్చారు. 
– రాష్ట్ర ప్రజలు సహజంగా ప్రత్యేక హోదా గురించి ఏదైనా హామీ వస్తుందనే అంచనాల్లో ఉంటారు. 
– కనీసం వీళ్లు ప్రస్తావన కూడా చేయలేకపోయారు. ఇంత పెద్ద మనిషిని తీసుకొచ్చాం..మళ్లీ వస్తే మేం ఇది చేస్తాం అని ఎందుకు చెప్పలేకపోయారు? 
– ప్రజలు ఇవన్నీ ఆలోచించి నిర్ణయం కూడా తీసుకున్నారని మేం బలంగా నమ్ముతున్నాం. 
– ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి డబుల్‌గా జగన్‌ గారు చేశారనే నమ్మకం ప్రజల్లో ఉంది. 
– ప్రజల్లో ఆ రెస్పాన్స్‌ కనిపిస్తోంది. సిద్ధం సభల్లో కూడా కన్పించిన రెస్పాన్స్‌ అక్కడి నుంచి వచ్చిందే. 
– నాయకుడంటే ఒక నిజాయితీ, స్థిరంగా ఉండే నిబద్ధత కలిసి విశ్వసనీయత వస్తుంది. 
– విశ్వసనీయతకు వారెంటీ అవసరం లేని గ్యారెంటీ జగన్‌మోహన్‌ రెడ్డి గారు అనేది ఈ ఐదేళ్లలో కనిపించింది. 
– వీళ్లు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలు జగన్‌ గారి పాలన వల్ల బెన్ఫిట్‌ అయ్యారు. 
– ఇది తాత్కాలికం కాదు..వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయి. అందుకే ప్రజలు జగన్‌ గారిని ఓన్‌ చేసుకుంటున్నారు. 
– కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పొత్తు పెట్టుకుని తీసుకొచ్చిన నేపథ్యంలో మళ్లీ 2014లో వేసిన నాటకం వేసి ప్రజలను భ్రమల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. 
– ఇలాంటి చంద్రబాబు ఎత్తులను తిప్పి కొట్టాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 
– 2014–19 కూటమిగా వచ్చి అబద్ధపు హామీలిచ్చి చేసిన పాలన ఉంది. 2019–24 మధ్య జగన్‌గారి పాలన కూడా కనిపిస్తోంది. 
– మరో ఐదేళ్ల పాటు జగనే మా నాయకుడు అని ప్రజలు గట్టిగా అనుకున్నారు. 
– మోసగించడానికి మేం వచ్చాం..మీరు సిద్ధమా అని వారు అంటుంటే..ప్రజలు మేం మోసపోవడానికి మేం సిద్ధంగా లేమని స్పష్టంగా ప్రజలు చెప్పబొతున్నారు. 

పొత్తులతో లబ్ధిపొందాలనుకుంటే 2014లోనే జగన్‌ గారు అధికారంలోకి వచ్చేవారు:
– ఓ వైపు షర్మిల..వైయ‌స్ఆర్‌సీపీ, బీజేపీ అంతా ఒకటే అంటారు. మోడీ గారేమో వైయ‌స్ఆర్‌సీపీ, కాంగ్రెస్‌ ఒకటే అంటారు. 
– ప్రజలకైతే జగన్‌ గారు ఒకే ఒక్కరు..విలక్షణమైన నాయకుడు అనేది తెలుసు. 
– వీళ్లకు ప్రజలతో ఏం మాట్లాడాలో తెలియక పొద్దుపోని మాటలు చెప్పడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. 
– పొత్తులతోనే లబ్ధిపొందాలని అనుకుంటే 2014లోనే జగన్‌గారు అధికారంలోకి వచ్చి ఉండేవారు. 
– వైయ‌స్ఆర్‌సీపీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు. రాష్ట్రంలో మేం అధికారంలోకి వచ్చాం. 
– మనకున్న ఎంపీలతో రాష్ట్రం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. అక్కడ బలమైన సంఖ్యతో అధికారంలోకి వచ్చింది. 
– మేం హోదా, ఇతర అంశాలపై పోరాడుతూనే ఉన్నాం..నిజంగా మనమీద ఆధారపడే పరిస్థితి కేంద్రంలో ఉంటే మన డిమాండ్లు నెరవేరేవి. 
– మేం అధికారంలో ఉన్నామని అవినీతి అంటే కేంద్రంలో వారు అధికారంలోఉన్నారు..అక్కడా అవినీతి ఉందా? 
– ఏదో మాట్లాడాలి కాబట్టి అవినీతి అంటూ మూస ధోరణి ఆరోపణలు చేస్తున్నారు. 
– ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అధికారులపై లేనిపోని ఆరోపణలు చేయడం వారికి అలవాటే. 
– మీ కార్యకర్తలు, మీ ఆధ్వర్యంలో పెట్టుకున్న సభలో పోలీసుల పాత్ర ఎంతుంటుంది? 
– ఏదైనా పొరపాటు ఉంటే పోలీసులు మీ తాట తీస్తాను అని చంద్రబాబు ఎన్నిసార్లు బెదిరించలేదు..? 
– పీఎం తిట్టి ఉంటాడు..దాన్ని కవర్‌ చేసుకోడానికి పోలీసులపై ఆరోపణలు చేస్తున్నట్లున్నారు. 
– షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే మంచిదేగా. ఆమె ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ, దివాళా తీసిన రాజకీయ పార్టీ అది. 
– ఆమె ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఎన్నికలు వచ్చినప్పుడు సహజంగా పోటీలో దిగుతుంటారు. 
– ఆఖరుగా ప్రజలు ఏం డిసైడ్‌ చేస్తారనేది బ్యాలెట్‌ బాక్సుల్లో తేలుతుంది. 
– మేమైతే ఇతర పార్టీలలా బాధ్యతారహితంగా కామెంట్స్‌ చేయం. 
– రేవంత్‌ రెడ్డి ఏదైనా కలలు కనొచ్చు. అంతా 2 నెలల్లో తేలిపోతుందిగా. 
– ఎవరెవరివి పీడ కలలో, పగటి కలలో తెలిసిపోతుందిగా. 
– తీర్పు ఎలా ఉంటుందనేది కళ్లముందే కనిపిస్తుంది కాబట్టి మేం గట్టి నమ్మకంతో ఉన్నాం. 
– ఇక నుంచి ప్రజల్లోనే ఉండాలని, బస్సు యాత్ర చేయాలని అనుకుంటున్నాం. త్వరలో ఆ డిటెయిల్స్‌ చెప్తాం. 

Back to Top