భారీ ప్రచారానికి వైయస్ జ‌గ‌న్ సిద్ధం

తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు

⁠" మేమంతా సిద్ధం" పేరిట బస్సు యాత్ర ఈనెల 26 లేదా  27 తేదీన ప్రారంభం

దాదాపు 21రోజులపాటు పార్లమెంటు నియోజకవర్గాల్లో బస్సు యాత్ర

రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో నాలుగు సభల నిర్వహణ

ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో " మేమంతా సిద్ధం " పేరుతో బస్సు యాత్ర

⁠బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలో వైయస్ జగన్

బస్సు యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకూ జనంలోనే వైయ‌స్ జగన్

మీడియాతో పార్టీ కార్యక్రమాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ 

తాడేప‌ల్లి:  ఎన్నికల నేపధ్యంలో రాష్ర్టంలో భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిధ్దం అయ్యారు. దీనిలో భాగంగా రాష్ర్టంలో " మేమంతా సిద్ధం " పేరిట బస్సుయాత్ర చేపట్టనున్నారు. సిద్ధం సభలు నిర్వహించిన 4జిల్లాలు/ పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగిలిన 21 జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టనున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ  తలశిల రఘురామ్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిందన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  పేర్నినానితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26 లేదా 27 తేదీన బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తెలియచేశారు. ఇప్పటికే పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సన్నద్ధంచేసే ప్రక్రియలో భాగంగా సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించామన్నారు. రాష్ర్టంలో రీజియన్ల వారీగా నాలుగు జిల్లాల్లో సిధ్దం పేరిట దేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా బహిరంగసభలు జరిగాయి. ఆ ప్రాంతాలలో ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి జగన్ గారి పరిపాలన పట్ల వారి మధ్దతు ప్రకటించారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలోకూడా పార్టీ కార్యకర్తలను, నాయత్వాన్ని సమాయత్తం చేయడానికి "మేము సిధ్దం...మా బూత్ సిధ్దం " పేరిట కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. “మేము సిద్ధం… మా బూత్ సిద్ధం – ఎన్నికల సమరానికి “ మేమంతా సిద్ధం’’ లక్ష్యంతో బస్సుయాత్ర కొనసాగుతుందన్నారు. “ మేమంతా సిద్ధం’’ పేరుతో జరిగే ఈ బస్సు యాత్ర ప్రతిరోజూ ఒక జిల్లాలో/పార్లమెంటు నియోజకవర్గంలో జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ ఉదయం పూట ఇంటరాక్ట్ అవుతారని, ఇందులో భాగంగా ప్రభుత్వం పనితీరును మెరుగుపరిచేందుకు సలహాలు, సూచనలు స్వీకరిస్తారని వెల్లడించారు. సాయంత్రం ఆ జిల్లా/పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. బస్సుయాత్ర ప్రారంభం అయిన తర్వాత, యాత్ర పూర్తయ్యేంతవరకూ కూడా  శ్రీ జగన్ పూర్తిగా జనంలోనే ఉంటారన్నారు. యాత్రలోనే విడిదిచేస్తారని స్పష్టంచేశారు. వైయస్సార్ రాజకీయ కార్యక్రమాల్లో ఓదార్పుయాత్ర, ప్రజాసంకల్ప యాత్ర ఎంత ప్రతిష్టాత్మకరంగా నిర్వహించామో, అదే తరహాలో బస్సుయాత్ర నిర్వహిస్తామన్నారు. మేమంతా సిద్ధం పాదయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలను రేపు ( మార్చి 19న) మీడియా సమావేశంలో వెల్లడిస్తామన్నారు.

Back to Top