Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్‌ రద్దు చేస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి                                వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 300వ రోజు పార్వతీపురం నియోజకర్గంలోని కోటవానివలస నుంచి ప్రారంభం                               ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                  
    Show Latest News
బాబు సీఎంగా అర్హుడా?
వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి

Published on : 19-Jun-2018 | 16:40
 – మానసిక రుగ్మతతో బాబు బాధపడుతున్నారు
– చంద్రబాబు పాలనను మరచిపోయారు. 
– ఏపీలో పెడబొబ్బలు పెట్టి..ఢిల్లీలో ఎందుకు మొహం చాటేశారు
– మోదీని ఏ మేరకు నిలదీశారో సమాధానం చెప్పాలి
– ప్రతి తెలుగు వాడు తలదించుకునేలా బాబు వంగి వంగి దండాలు పెట్టారు
  –బలహీన వర్గాలపై చంద్రబాబు రగిలిపోతున్నారు
– బలహీన వర్గాలు సెకండరీ గ్రేడ్‌ పౌరులా
– మత్స్యకారుల తోలు తీస్తామని గతంలో బాబు బెదిరించారు
– ఇప్పుడు నాయిబ్రాహ్మణులపై బాబు బెదిరింపులు
– బలహీన వర్గాలు బాబు భరతం పడతాయి
– చంద్రబాబు అవినీతిపై త్వరలో పుస్తకం వేసి దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తాం

హైదరాబాద్‌: కుల వివక్షతో ఇతరులను అవమానిస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా అనర్హుడని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి విమర్శించారు. చంద్రబాబు తీవ్రమైన భయానికి లోనవుతున్నట్లు అర్థమవుతుందన్నారు. గత మూడు నెలలుగా ఏపీలో చంద్రబాబు పెడబొబ్బలు పెడుతూ సవాలు విసరుతున్నారన్నారు. ఏదో కేంద్ర ప్రభుత్వం ఒక్కటే రాష్ట్రానికి అన్యాయం చేసినట్లు, అందులో తన బాధ్యత లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి చంద్రబాబు వెళ్లే ముందుకు పత్రికలు విఫరీతమైన ప్రచారం చేశాయని, ఆఖరికి ఆయన వీపు ఎక్కడ విమానం మోత మోగుతుందో అని కనీసం సమావేశం అయిపోగానే పత్రికా సమావేశంలో సమాధానాలు చెప్పలేక పారిపోయి వచ్చారన్నారు. రోజు పెడబొబ్బలు పెట్టే మంత్రులు, నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. చివరకు చంద్రబాబు, మోడీ కలుసుకున్న ఫోటోలు చూసి ఏపీ ప్రజలు అవమానంతో తలదించుకున్నారన్నారు. ఏదైనా కంపెనీ ఎండీ కారు ఎక్కుతూ సిబ్బందికి చేయ్యి ఇస్తే ఎలా ఫీలవుతారో అలా చంద్రబాబు ప్రధాని వద్ద వ్యవహరించారన్నారు. ఎందుకు చంద్రబాబు ఢిల్లీలో మాట్లాడలేకపోయారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి వైయస్‌ఆర్‌సీపీ నేతలు వ్యక్తిగత పనులపై ఢిల్లీకి వెళ్తే వారు ఏం చేస్తున్నారో అని, ఏమీ పేపర్లు ఇస్తున్నారో అని భయపడుతున్నారని విమర్శించారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బీజేపీ నేత రాంమాధవ్‌ను కలవులేదని స్పష్టంగా చెప్పారన్నారు. బీజేపీ నేత కూడా స్పష్టంగా సమాధానం ఇచ్చారన్నారు. రాజేంద్రనాథ్‌రెడ్డి ఏదో పేపర్లు ఇచ్చారని టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏ అవినీతికి సంబంధించిన కాగితాలు రాంమాధవ్‌కు ఇచ్చారని బాధపడుతున్నారా అని నిలదీశారు. మీరు అవినీతిరహితంగా పరిపాలన చేస్తే ఎవరు కలిస్తే మీకేందుకు భయం అని ప్రశ్నించారు. అడ్రస్‌ను బట్టి టీడీపీ నేతలు కథలు కథలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

–బలహీన వర్గాలు రాష్ట్రంలో రగిలిపోతున్నాయని పార్థసారధి పేర్కొన్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తే కించపరిచేలా చంద్రబాబు మాట్లాడటంతో ఆయన సీఎంగా ఉండటానికి కూడా అర్హుడు కాదన్నారు. గతంలో మత్స్యకారులు కూడా తమ హక్కుల కోసం అమలు చేయాలని సీఎం వద్దకు వెళ్తే ..వారిపై కూడా ఇలాగే మాట్లాడరని మండిపడ్డారు. నాయిబ్రాహ్మణులకు షాపులు ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీపై రుణాలు ఇస్తామని, మంగళవాయిద్యాలు ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో 8 హామీలు ఇ చ్చారని గుర్తు చేశారు. నాలుగేళ్లలో ఒక్క హామీని కూడా చంద్రబాబు పూర్తి చేయలేదని విమర్శించారు. చంద్రబాబు తీరుతో బలహీన వర్గాల పట్ల టీడీపీ నేతలు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందన్నారు. బలహీనవర్గాల పౌరులు సెకండరీ గ్రేడ్‌ వారా అని ప్రశ్నించారు. టీడీపీకి చెందిన కొంతమంది వెధవలు వైయస్‌ జగన్‌ను విమర్శిస్తున్నారని, వైయస్‌ జగన్‌ అవ్వతాతలను ఆప్యాయంగా పలకరిస్తుంటే వక్రీకరించి చూపుతున్నారని ఫైర్‌ అయ్యారు. బలహీన వర్గాల వైపు చంద్రబాబు వేలు చూపించి బెదిరించారని తెలిపారు. బలహీన వర్గాల సమస్యలను వినే ఓపిక కూడా చంద్రబాబుకు లేదన్నారు. పదవీ ప్రమాణ స్వీకారం చేసేముందు ప్రతిజ్ఞ చేస్తారని, అయితే చంద్రబాబు కుల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

– త్వరలోనే చంద్రబాబు చేసిన అవినీతిపై ఓ పుస్తకం వేసి ఢిల్లీ వెళ్లి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు, సామాజిక వేత్తలకు పంపిణీ చేస్తామని పార్థసారధి తెలిపారు. చంద్రబాబు చాలా మేధావిని, నిప్పు అని ఫోజు కొడుతున్నారని, ఆయన అవినీతిని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని చెప్పారు. చేసిన తప్పును సరిచేసుకోకుండా, బుగ్గన రాజేంద్రనాథ్‌పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రివిలô జ్‌ మోషన్‌ నోటీసులు ఇస్తారట? ఆయన వెన్నుపోటు రాజకీయాలు అందరికి తెలుసు అని, తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరని పార్థసారధి హెచ్చరించారు. 

– పరకాల ప్రభాకర్‌కు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు చేసిన అవినీతి, మోసాలను భయపెట్టాలని పార్థసారధి డిమాండు చేశారు. రాజీనామా చేస్తే ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బీజేపీ నేతలను కలిశారని తప్పుడు ప్రచారం చేసే టీడీపీ నాయకులను మేం ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రతి రోజు మీ కేబినెట్‌ మీటింగ్‌లో బీజేపీ మంత్రి భర్త పరకాల ప్రభాకర్‌ను కూర్చోబెట్టుకోవడం తప్పుకాదా అన్నారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మంత్రి భార్యను టీటీడీ సభ్యురాలిగా నియమించడం ఎంతవరకు సమంజసమన్నారు. బాలకృష్ణ సినిమా షూటింగ్స్‌కు వెంకయ్యనాయుడిని పిలవడం ఎంతవరకు న్యాయమన్నారు. పరకాల ప్రభాకర్‌ రాజీనామాను టీడీపీ ఓ డ్రామాగా ఆడిస్తుందని ఆయన మండిపడ్డారు.
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com