Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
‘చంద్రబాబు తెలంగాణలో పెత్తనం చేయాలని చూస్తున్నాడు’

Published on : 07-Dec-2018 | 17:09
 

YSRCP MLA Ijaiya Slams Chandrababu Naidu Over Alliance With Congress - Sakshi

కర్నూల్‌ : ఏపీలో రాజ్యాంగ విలువలను సర్వనాశనం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. నిన్నటి దాక బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగేళ్లు సంసారం చేసిన వ్యక్తి.. నేడు సిగ్గు లేకుండా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ప్రచారం చేస్తున్నారంటూ మండి పడ్డారు. దేశంలో చరిత్ర హీన చక్రవర్తి చంద్రబాబేన్నారు. ​కాంగ్రెస్‌ మహాకూటమితో కలిసి తెలంగాణలో పెత్తనం చెలాయించాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారంటూ ధ్వజమెత్తారు.

ఏపీలో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను డబ్బుల సంచులతో పశువులను కొన్నట్లు కొన్నది నీవు కాదా బాబు అంటూ ఐజయ్య ప్రశ్నించారు. స్పీకర్‌ స్థానాన్ని కూడా అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడిన వ్యక్తి జగన్‌మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రజల వెంటే ఉంటూ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వ్యక్తి జగన్‌ మోహన్‌ రెడ్డి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని తెలిపారు.


సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com