కర్నూలు: మనిషి ఎలా ఉండకూడదో చంద్రబాబును చూసి నేర్చుకోవాలని వైయస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సిద్ధాపురం చెరువు వద్ద నిర్వహించిన వైయస్ఆర్ గంగా హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైయస్ఆర్ ఆశయాలు నెరవేర్చే సత్తా వైయస్ జగన్‌కే ఉందన్నారు. రాష్ట్రమంతటా వైయస్ఆర్ గంగా హారతి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్ రాకుండా కార్యకర్తలు పని చేయాలన్నారు. జనం సమస్యలు పరిష్కరించడమే వైయస్ జగన్ లక్ష్యమన్నారు.