Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 300వ రోజు పార్వతీపురం నియోజకర్గంలోని కోటవానివలస నుంచి ప్రారంభం                               ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                 
    Show Latest News
సిట్ విచారణల పేరుతో మోసం
వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు ధర్మాన ప్రసాదరావు

Published on : 08-Nov-2018 | 11:48
 


– విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ విచారణ సక్రమంగా జరగలేదు
– సిట్‌ నివేదికలో తన పేరు రావడం అభ్యంతరకరం
– ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది
 
శ్రీకాకుళం: సిట్ విచారణల పేరుతో ప్రజల్ని ప్ర‌భుత్వం మోసం చేస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మండిప‌డ్డారు. విశాఖ భూ కుంభకోణంపై సిట్‌ విచారణ సక్రమంగా జరగలేదని ఆరోపించారు. సిట్‌ నివేదికలో తన పేరు రావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విచారణల్లో నిజాయితీ ఎక్కడుందని ఆయన నిలదీశారు.  విశాఖ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ల్యాండ్‌ ఫూలింగ్‌ స్కీమ్‌ ప్రవేశపెట్టిందన్నారు. దాన్ని 14 నవంబర్, 2016న ప్రభుత్వం ఆమోదించిందన్నారు. నవంబర్‌ 25న మరో జీవో ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. 11 రోజుల్లో ప్రభుత్వం ఒక స్కీమ్‌ ప్రవేశపెట్టిందని, హుడాకు అనుమతి ఇచ్చిందన్నారు. ఇందులో ప్రభుత్వపెద్దల ప్రమేయం ఉండటం.. 500 ఎకరాల భూమి ఇంత వేగంగా భూ బదలాయింపులు జరిగాయన్నారు. భూ కుంభకోణంపై వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విశాఖ వేదికగా పెద్ద ఎత్తున ధర్నా చేశారని గుర్తు చేశారు. ఆ రోజు టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ కూడా ఈ వ్యవహారాన్ని తప్పుపట్టినట్లు చెప్పారు. మంత్రి నారాయణ అప్పట్లో మాట్లాడుతూ..భూ కుంభకోణంపై కేసు నమోదు అయిందని చెప్పారని, అలాంటి సమయంలో హుడాకు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. సిట్‌ విచారణలో ఉన్నది ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న కొంత మంది పోలీసులు, రెవెన్యూ అధికారులను నియమించి ప్రజలను మోసం చేయడమే అని ఆరోపించారు. భూ కుంభకోణం వెనుక ఉన్నది ఎవరో ప్రభుత్వం ఎందకు చోదించడం లేదని ప్రశ్నించారు. మీ భండారం బయటపడుతుందని ఇతరులపై నెపం నెట్టితే భయపడేది లేదన్నారు.  
 
-విశాఖ భూకుంభకోణంపై సిట్ విచారణ సక్రమంగా జరగలేదు.
-సిట్ నివేదికలో నా పేరు రావడం పై అభ్యంతరం చెబుతున్నాను.
-ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటివి ఎదురవుతుంటాయి.అయినా నేను భయపడను. వాటిని మేం పట్టించుకోవడంలేదు.
-రెవిన్యూలో పనిచేసిన వారందరికి తెలుసు.రెవిన్యూ మంత్రి ఈ వ్యవహరాలు చూడరని.
-జిల్లాల్లో కలెక్టర్, ఇతర రెవిన్యూ అదికారుల అజమాయిషీలో ఉండే పనులను నాకు అంటగడుతున్నారు.
-ప్రజలలో నా పట్ల అపోహలు సృష్టించే ప్రయత్నమే ఇది.
-అక్కడ రికార్డులు టాంపరింగ్ జరిగింది.టాంపరింగ్ గురించి ఎందుకు పరిశోధించలేదు.
-ప్రభుత్వ విచారణల్లో నిజాయితీ  ఎక్కడుంది?
-భూ కుంభకోణాలను పోలీసులు ఎలా విచారిస్తారు?
-సిట్ లో రెవిన్యూ అధికారులను ఎందుకు పెట్టలేదు?
-రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందని అధికారులు గుర్తించారు.
-ముఖ్యమంత్రి రెండు జిఓలు జారీ చేశారు.బిజేపి నేత ప్రశ్నిస్తే ఒక జిఓను రద్దు చేశారు.
-ముఖ్యమంత్రికి సన్నిహితులు ఈ కుంభకోణంలో ఉన్నారు.అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు.
-ప్రజల తరపున నిలదీస్తున్నానని,వైయస్సార్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నానని
 నన్ను అణగద్రొక్కాలని ప్రయత్నిస్తున్నారు.వాటికి నేను భయపడను.
-ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది.
-నిభందనలకు విరుద్దంగా రాజధాని భూసేకరణ చేశారు.
-సుప్రీంకోర్టు స్విస్ ఛాలెంజ్ పద్దతి వద్దంటే నీవు సిఆర్ డిఏ రూల్స్ మార్చి స్విస్ ఛాలెంజ్ పద్దతే అనుసరించారు.
-అనుభవం తెచ్చిన పాలనలాగా ఇది లేదు.తప్పులు ఉంటే సరిదిద్దాలి.
-ల్యాండ్ పూలింగ్ విషయంలో ఫైల్ వేగంగా ఎలా కదిలింది.
-500ఎకరాల సేకరణ వెనక పెద్దవాళ్లఎవరు?ఎంతమెత్తం చేతులుమారింది.వీటిని తేల్చలేదు.
-ప్రతిపాదించిన11 రోజుల వ్యవధిలోనే జిఓ ఎలా బయటకువచ్చింది.
-సిట్ దర్యాప్తు ఈ విధంగా సాగితే నిజాలు బయటకు వస్తాయా?
-సిట్ విచారణలో ప్రజలు అడిగిందేమిటి ?మీరు చేసిందేమిటి?
-మీ అదుపాజ్ఞలలో ఉన్న పోలీసులకే ఈ కేసులో చర్యలు తీసుకోమనే అధికారం ఇస్తారా? 
-నిజానికి ఎన్టీఆర్ సిఎంగా మీరు(చంద్రబాబు) రెవిన్యూమంత్రిగా ఉన్నపుడు1994,నవంబర్లో జారీ అయిన జిఓ ప్రకారమే ఇది జరిగింది.
-అసైన్డ్ ల్యాండ్స్ ,ఫ్రీడమ్ ఫైటర్స్ ,ఎక్స్ సర్వీస్ మెన్ ల భూములకు సంబంధించి ఆ జిఓ మీ ఆదేశాలమేరకు జారీ అయింది.
-1977 లో జారీ అయిన జీఓ ప్రకారం ఏ భూములను విక్రయించే అధికారం లేదు.
-సిట్ రిపోర్ట్ లో తప్పుడు పనులకు పాల్పడిన ప్రభుత్వంలోని పెద్ద ఎవరో ఎందుకు తేల్చలేదు.
-సిట్ రిపోర్ట్ ద్వారా ప్రజల ఆకాంక్ష ఏమాత్రం నెరవేరలేదు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com