Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             స్పీకర్‌ ప్రెస్‌మీట్‌ను సాక్షి ఒక్కటే కాదు అన్ని చానళ్లు ప్రసారం చేశాయిః వైయస్ జగన్                               అగ్రిగోల్డు టాపిక్‌ను డైవర్ట్‌ చేసేందుకు ప్రభుత్వం అష్టకష్టాలు                               చంద్రబాబు సభను తప్పుదోవ పట్టిస్తున్నారుః వైయస్ జగన్                               హిట్లర్‌కు బాబుకు దగ్గర పోలికః వైయస్ జగన్                               స్పీకర్ కోడెలపై గౌరవం, నమ్మకం పోయాయిః వైయస్ జగన్                               స్పీకర్ పై వైయస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం                               ప్రభుత్వానికి దమ్మూ, ధైర్యం ఉంటే సిట్టింగ్‌ జడ్డి చేత జ్యుడీషియల్‌ విచారణ చేపట్టాలని వైయస్ జగన్ డిమాండ్                               ఆగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల పేర్లు ఆన్‌లైన్‌ లో పెట్టాలిః వైయస్ జగన్                               అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ సోదరుడు సీతారామ్‌ను ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదుః వైయస్ జగన్                 
    Show Latest News
వైయస్సార్సీపీ ఉద్యోగ పోరు

Published on : 09-Jan-2017 | 17:52
Share    

  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బాబు తూట్లు
  • ఉద్యోగాలు కల్పించాలని వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన
  • కాకినాడ కలెక్టరేట్ వద్ద  ఉద్యోగ పోరు కార్యక్రమం
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్
తూర్పు గోదావరి జిల్లాః కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద వైయస్సార్ సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో ఉద్యోగ పోరు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ,రాష్ర్ట యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా ,రాష్ర్ట విద్యార్ది  విభాగం అధ్యక్షులు సలాం బాబు ,జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అనంత బాబు ,టౌన్ కన్వీనర్ ప్రుటీ కుమార్ , వివిధ నియోజక వర్గాల కోఆర్డినేటర్స్, పార్టీ  యువజన విభాగ రాష్ర్ట ,జిల్లా కమిటీ నాయుకులు పాల్గొన్నారు. 

2014 ఎలక్షన్ ప్రచారంలో ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ. 2వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి బాబు మోసం చేశారని యువనాయకులు మండిపడ్డారు. జాబు రావాలంటే బాబు రావాలటూ టీవీ లలో ప్రకటనలతో ఊదరగొట్టడంతో  పేదప్రజలు ఆశతో చంద్రబాబును గద్దెనెక్కించారని, ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా  త్వరితగతిన  హామీలు అమలు జరపాలని వైయస్సార్ కాంగ్రెస్స్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com