Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 143వ రోజు అగిరిప‌ల్లి శివారు నుంచి ప్రారంభం                               ఏపీకి జ‌రిగిన అన్యాయానికి నిర‌స‌న‌గా ఏప్రిల్ 30న వంచ‌న దినం : వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు బొత్స సత్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               142వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నూజివీడు శివారు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 141వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఈద‌ర శివారు నుంచి ప్రారంభం                               చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష. ఇదే దీక్ష ఢిల్లీలో చేసి ఉంటే ఉపయోగం ఉండేది: రోజా                               25 మంది ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే కేంద్రం దిగి వచ్చేది. ఇలాంటి దొంగ దీక్షలు, దగా దీక్షలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు: ఎమ్మెల్యే రోజా                                140వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర శోభ‌నాపురం శివారు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎంపీలు                               సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లువ‌నున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు                 
    Show Latest News
బండరాళ్లకేం తెలుస్తుంది నవరత్నాల గురించి

Published on : 13-Jul-2017 | 15:29
 

  • బాబు గ్రాఫిక్స్ కథలు చూసి చూసి విసిగిపోయాం
  • గ్రాఫిక్స్ లో రాజధానిని చూపిస్తూ ఇంకా ఎంతకాలం మోసగిస్తారు
  • అవినీతి, వెన్నుపోటు రాజకీయాల్లో యనమల బాబు-2
  • పేదలకు భరోసానిచ్చే నవరత్నాలు మీకు గులకరాళ్లుగా కనబడుతున్నాయా..?
  • మనసు లేని బండరాళ్లకు ఏం తెలుస్తోంది నవరత్నాల గురించి
  • వైయస్ జగన్ అధికారంలోకి రావడం తథ్యం
  • ప్రజలకు నవరత్నాలు అందించడం ఖాయం
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్ః గ్రాఫిక్స్ లో రాజధానిని చూపిస్తూ ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చంద్రబాబుపై మండిపడ్డారు. తమ నాయకుడు వైయస్ జగన్ ప్రజలకు నవరత్నాల్లాంటి పథకాలను ప్రకటించగానే చంద్రబాబుకు దడ పట్టుకుందని అన్నారు. అందుకే కోహినూర్ వజ్రం మోడల్ లో అసెంబ్లీని డిజైన్ చేయాలంటూ మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రెండేళ్లుగా చంద్రబాబు గ్రాఫిక్స్ కథలు విని విని విసిగిపోయామని అన్నారు. ప్లీనరీ వేదికగా వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలు బాబు మెదడును తొస్తున్నాయి గనుకే, ఆయనకు కోహినూరు వజ్రం గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు. బొమ్మలు చూపించడం అదిగో రాజధాని అని చెప్పే తంతును రెండేళ్లుగా చూసి చూసి విసిగిపోయామన్నారు.  ఏ దేశం వెళితే ఆ దేశంలా రాజధాని కడతానంటూ చెప్పడం తప్ప ఇంతవరకు బాబు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. 

ఎన్నికల్లో ఇచ్చిన  చిన్న హామీలకే దిక్కులేదు గానీ, కోహినూర్ వజ్రం మోడల్ లో అసెంబ్లీ కడతామంటూ బాబు మరోసారి మోసపూరిత ప్రకటనలతో హడావిడి తేస్తున్నారని వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. చేయలేని దానిని చేసినట్టు ఆర్భాటంగా గ్రాఫిక్స్ లో చూపడం చంద్రబాబు నైజమన్నారు. కానీ, వైయస్సార్సీపీ ప్రకటించిన నవరత్నాలు పేదవాడి జీవనాడి అన్నారు. సామాన్యుడి గురించి ఆలోచించే మనసుంటే చాలన్నారు. నవరత్నాలను మంత్రి యనమల రామకృష్ణుడు గులకరాళ్లుగా పోల్చడంపై వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనసు లేని బండరాళ్లకు నవరత్నాల గురించి ఏం తెలుస్తుందని పద్మ యనమలపై ఫైర్ అయ్యారు. రైతులు, మహిళలు, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలకు భరోసానిచ్చే పథకాలు మీకు గులకరాళ్లుగా కనబడుతున్నాయా అంటూ యనమలపై మండిపడ్డారు.  యనమల వయసు పెద్దరికం తప్ప మాటల్లో పెద్దరికం లేదని దుయ్యబట్టారు. అవినీతి,  వెన్నుపోటు రాజకీయాలు చేయడంలో యనమల చంద్రబాబు-2 అని ఎద్దేవా చేశారు. దొడ్డిదారిన ఆర్థికమంత్రి అయిన వారికి ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయన్నారు. ఏనాడైనా సామాన్యునితో మాట్లాడితే కదా తెలిసేదని యనమలపై నిప్పులు చెరిగారు.  అన్నం పెట్టిన వాడికి వెన్నుపోటు పొడవడం, బాబుకు చెంచాగిరి చేయడం మాత్రమే యనమలకు తెలుసునని, అందుకే ఆర్థిక వ్యవస్థ ఇలా తగలెడిందన్నారు.  ఆర్థిక పరిస్థితి దివాళాకు యనమలే కారణమని విరుచుకుపడ్డారు. 

క్యాబినెట్ లో దోపిడీపైనా ఆలోచిస్తారు తప్ప ఏనాడైనా సామాన్యుని గురించి ఆలోచించారా...?ఏనాడైనా సింగపూర్, జపాన్ లన్నారే తప్ప సామాన్యుడి రాజధాని కడుతున్నామని చెప్పారా బాబూ అని పద్మ నిలదీశారు. సామాన్యుడు బతకడం కోసం మీరు మాట ఇచ్చి తప్పడం వల్ల రైతులు, మహిళలు అందరూ నిండా మునిగిపోయిన పరిస్థితుల్లో జగనన్న వస్తే నవరత్నాలు అందిస్తామంటే గులకరాళ్లుగా కనబడుతున్నాయా..? పేదవాడికి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకూడదా..?మనకు అన్నం పెట్టే రైతు ధైర్యం గా నిలబడతాడంటే హేళన చేయడానికి మీకు మనసెలా వప్పింది...? మీ లాగ ఇస్త్రీపెట్టెలు, సెలూన్ కత్తెర్లు ఇచ్చేసి బీసీలను ఉద్దరించామని జపం చేయాలా...? బీసీలు పూర్తి స్థాయిలో చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్ మెట్ ఇస్తామంటే అది గులకరాయా...? అంటూ ప్రభుత్వంపై వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.  ఖజానాకు నష్టమైనా సరే పేదల ముఖంలో సంతోషం టూడాలని మూడు దశల్లో మద్యపాన నిషేధం ప్రకటిస్తే గులకరాళ్లా...?  ఎంతసేపు భూములు గుంజుకోవడం, సింగపూర్, లండన్ సంస్థలకు రాజధాని ధారాదత్తం చేయడం మీకు వజ్రాలుగా కనిపిస్తున్నాయే తప్ప సామాన్యుని గోడు పట్టదన్నారు. తమకు  సామాన్యుడే  కోహినూర్ వజ్రమని స్పష్టం చేశారు.  

మీ హంగు, ఆర్భాటాలను, అవినీతిని ప్రశ్నించిన ప్రతిపక్షాన్ని రాజధానిని అడ్డుకుంటున్నారని చెబుతున్నారంటే అది మీ చేతగానితనానికి నిదర్శనమన్నారు.   ప్రజలకు ఇది చేశామని చెప్పుకోగలరా...? ఎప్పుడు జగన్ మీద పడి ఏడవడమే. కేంద్రం నుంచి నిధులు తీసుకురారు. మేనిఫెస్టోలోవి చేయరు.  మేం చేస్తామంటే పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. భయపడుతున్నారు. నవరత్న పథకాలను మీరెందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. మీకెందుకు ఆ మనసు లేకపోయింది. దీనిపై చర్చకు రండి. నవరత్నాలపై ప్రజలు చర్చించకుండా ఉండేందుకే బాబు కోహినూర్ వజ్రం పేరుతో మాంత్రికుని అవతారం ఎత్తారని ఫైర్ అయ్యారు. డిజైన్ల పేరుతో బాబు చేస్తున్న ఆర్భాటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. నీవు ఇచ్చిన మాటకే విలువలేకపోతే,  పేపర్ మీద గీసిన గీతలకు విలువేముంది బాబు అని పద్మ తూర్పారబట్టారు. నంద్యాల ఒకటుందని గానీ, అక్కడ అభివృద్ధి చేయాలని గానీ ఈ మూడేళ్లలో చంద్రబాబుకు గుర్తుకు రాలేదు.  ఉపఎన్నిక రాగానే రూ. 302కోట్లకు జీవోలు విడుదల చేశారు. ఎమ్మెల్యేలు చచ్చిపోతే తప్ప నియోజకవర్గాలు  బాగుపడవన్న పరిస్థితికి తీసుకొచ్చారు. ఎప్పుడూ చావు కోరుకుంటారే తప్ప ఏనాడైనా ప్రజలను బతికించాలన్నఆలోచన చేశారా..? వైయస్ జగన్ అధికారంలోకి రావడం ..నవరత్నాలు ప్రజలకు అందడం తథ్యమని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com