Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
ఓట్లు కొనడమూ -- కొట్టేయడమూ చంద్రబాబు నీతి

Published on : 22-Feb-2018 | 10:37
 


బరితెగింపుకు బందెలదొడ్డి అడ్డుకాదని సామెత. అలాగే ఉంది ఇప్పుడు తెలుగుదేశం వాలకం. రాష్ట్రం లో ప్రజలను వివిధ రకాలుగా చిత్రహింసలకు గురి చేస్తోంది చాలక, వాళ్ల రాజ్యాంగ హక్కుకు కూడా కన్నం పెట్టాలని చూడటం చంద్రబాబు నిరంకుశ విధానానికి నిదర్శనం. అధికారంలో ఉన్నారు గనుక, అధికారులు తాము చెప్పినట్టు వింటున్నారుగనుక ఏమైనా చేయొచ్చనుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న టిడిపి నేతలు ప్రజలు తిరగబడితే ఆ అధికారం తలకిందులౌతుందని గుర్తించలేకున్నారు. పౌరుడిగా పథకాలు అందించే కార్డులకే కాదు, పౌరసత్వాన్ని నిర్థారించే కార్డులను కూడా గల్లంతు చేస్తున్న కుట్రలు ఒక్కోటీ బట్టబయలౌతున్నాయి. 
ఎన్నికల్లో గెలుపు కోసం కొందురు సింహాలా రాజమార్గంలో వెళ్తే కొందరు, బాబులా దొడ్డిదారిన వెళ్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లు గల్లంతు చేయడం ద్వారా ప్రజా స్వామ్యానికే తూట్లు పొడుస్తున్నాడు చంద్రబాబు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నవారు, సానుభూతిపరులే కాదు, ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఓట్లే మాయం అయిపోతున్నాయి. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతల ఓట్లను కూడా ఓటర్ల జాబితానుంచి తొలగించారంటే దీని వెనుక చంద్రబాబు హస్తం లేదంటే రాష్ట్రంలో తెలుగు వాడెవడూ నమ్మడు. 

పచ్చపార్టీ కాకుంటే పౌర కార్డు గల్లంతే...

అధికార పార్టీ కుట్రలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతి పరులన్న అనుమానం వస్తే చాలు ఏదో విధంగా వారి ఓటర్ కార్డులను గల్లంతు చేసేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా అలాంటి ఓటర్లను గుర్తించడం, వారి ఓట్లను తొలగించడం పనిగా పెట్టుకున్నారు. ఓటరు కార్డు ఉంటే కదా  ప్రతిపక్షానికి ఓటేసేది అదే లేకుండా చేస్తే సరి అని కుత్సితపు ఆలోచన్లు చేస్తున్నారు. ఒక్కో నియోజక వర్గంలో 15 వేలకుపైగా ఓటర్లను తొలగిస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 14.77 లక్షలమంది ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఒక్క ఏడాదిలోనే 14 లక్షల మంది వల వెళ్లారనే కారణంతో ఓట్లు లేకుండా చేయడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలి సారి అంటున్నారు అధికారులు. 
సాధారణ ప్రజల పరిస్థితే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఓట్లను కూడా లేకుండా చేసిన ఘనత ఎన్నికల సంఘానిది. గుంటూరు జిల్లా సత్తెన పల్లి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు జాబితా నుంచి మాయం అయిపోయాయి. నరసరావు పేట ఎమ్.ఎల్.ఎ గోపీరెడ్డి దంపతుల పేర్లు జాబితాలో కనబడలేదు. జిల్లాలు, నియోజక వర్గాల వారీగా లక్షలాది ఓట్లు గల్లంతవడంతో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం బయటపడింది. ఓటర్ల జాబితాలో డొల్లతనం తేటతెల్లం అయ్యింది. 

ఓటు తీసేసి వట్టి మాటలు

అధికార పార్టీ స్థానిక నేతలు వెనకుండి నడిపించిన ఈ ఓట్ల తొలగింపు కథ పెద్ద కుట్రను తలపిస్తుంది. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై భారీ సంఖ్యలో ఓటర్లను తొలగించడం ప్రభుత్వంలో ఉన్న వారికే సాధ్యం. వలస వెళ్లిన వారు, మృతి చెందిన వారి ఓట్లను ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టింది. నిజంగా నిజాయితీగా ఈ ప్రక్రియ జరిగుంటే ఓటును  తొలగించేటప్పుడు వారి కుంటుంబం లోని వారిని సంప్రదించి, వారి ఇంటి వద్ద తనిఖీ చేసి తొలగించాల్సి ఉంది. కానీ ఎలాంటి తనిఖీ లేకుండా కేవలం నాయకులు దరఖాస్తు చేసిన జాబితాలను ఓటర్ల లిస్టునుంచి తొలగించేసారు. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు అధికారులను ప్రశ్నిస్తే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే నమోదు చేస్తామనే నిర్లక్ష్యపు సమాధానం ఎదురౌతోంది. 

జగన్ ఇలాకాలో అత్యధికంగా

ప్రతిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి వెన్నుదన్ను వైఎస్సార్ కడప జిల్లా అని అందరికీ తెలిసిందే. అందుకే అక్కడ ఆ పార్టీ ఓటర్ల సంఖ్యను తగ్గించడానికే టిడిపి నేతలు సాయ శక్తులా ప్రయత్నించారు. అన్ని జిల్లాల్లో కంటే వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 3,20,539 మంది ఓట్లను జాబితా నుంచి తొలగించారు. ఏళ్ల తరబడి ఒకే చోట నివాసం ఉన్నవారిని కూడా ఊళ్లో లేరనే కారణం చూపుతూ వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేసారు. 

వెల్లువెత్తుతున్న విమర్శలు

చంద్రబాబు సర్కారు విషపూరిత విధానాల్లో ఇది చాలా ప్రమాదకరమైన విధానమని కొందరు సీనియర్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్నాళ్లూ రేషన్లు, ఫించన్లు, పథకాల్లో పేర్లు తీసేసి పేదలను ఏడిపించిన చంద్రబాబు, ఇప్పుడు ఏకంగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా అన్యాయంగా కాల రాస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై ప్రజలు, ప్రజా సంఘాలు, విపక్షాలూ కలిసి పోరాడాలని పౌరహక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరలో ఉండగా ఇన్ని లక్షల ఓట్లను ఎలా తొలగిస్తారని ప్రజలు సైతం ఆగ్రహంతో ప్రశ్సిస్తున్నారు. 

ఒక పక్క ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెయ్యింతల బలం పుంజుకుంది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కు ప్రజా మద్దతు భారీగా ఉంది. దాంతో టిడిపి అధినేతకు రేపటి ఎన్నికల ఫలితాలు నేడే కళ్లముందు కనబడిపోతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయక తప్పదు. కోట్లు ఖర్చుపెట్టినా గెలుపు గ్యారెంటీ లేదు. దాంతో చంద్రబాబు ఈ అడ్డదారి, చెడ్డదారిని ఎంచుకున్నారనిపిస్తోంది. అసలు ఎన్నికల దాకా ఎదురు చూడకుండా ఈలోపే ప్రత్యర్థుల ఓట్లు మాయం చేస్తే సగం పని అయిపోతుందనుకున్నట్టున్నారు. ఈ విషయం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం అని టిడిపి నేతలు కొట్టిపడేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే పట్టుబట్టి వైఎస్సార్ మద్దతుదారుల ఓట్లే ఎందుకు మాయం అవుతాయి. టిడిపి మద్దతుదారుల ఓట్లు కూడా కనబడకుండా పోవాలి కదా లేదు? కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి ఓట్లనే ఏరి పక్కన బెడుతున్నారంటే, ఇది చంద్రబాబు వెనకుండి, పచ్చ తమ్ముళ్ల ఆధ్వర్యంలో అధికారులతో చేయిస్తున్న దిక్కుమాలిన కుట్ర అని క్లియర్ గా అర్థం అవుతోంది. పక్కరాష్ట్రంలో ఓట్లు కొంటూ దొరికిపోయిన ముఖ్యమంత్రి నేడు సొంత రాష్ట్రంలో ఓట్లు దొంగిలిస్తూ దొరికిపోయాడు. అందుకే వైఎస్ జగన్ అన్నారు నీతిలేని కొంగ చంద్రబాబు దొంగ. ఆ మాటకు రుజువు ఇప్పుడు కళ్లముందే దొరికిందిగా. 

 
Labels : YSRCP, YS Jagan, NCBN, TDP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com