Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆదివారం పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 317వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                               టీడీపీ హయాంలో దళిత సంక్షేమం టీడీపీ దొంగల సంక్షేమంగా మారింది: మేరుగ నాగార్జున                               సంతవురిటి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 313వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా దక్కినా ఆపదవి నిర్వహించనీయకుండా అడ్డుకోవడం వల్లే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు: ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               ఒక్కసారి వైయస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వండి..30 ఏళ్ల సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్తుంది: ఎంపీ విజయసాయిరెడ్డి                                అంతకాపల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 312వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
రాజకీయ బాహుబలి వైయస్ఆర్ - 7

Published on : 18-Feb-2018 | 13:41
 


ఇప్పుడు చూస్తున్నాము... గొప్ప దార్శనికుడు, పాలనాదక్షుడు అంటూ మీడియాతో బాజాలు వాయింపజేసుకునే చంద్రబాబు గత మూడేళ్ళలో ఇప్పటికి పాతికసార్లు ప్రత్యేక గగన విహంగాలలో ... ఒక డజనుమంది మేళగాళ్ళను వెంటేసుకుని తిరిగి, రెండు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని జల్సాలకు ఖర్చు చేసి సాధించింది శూన్యం. ప్రతిసారి సదస్సులు పెట్టినపుడల్లా లక్షలకోట్ల పెట్టుబడులు వచ్చాయని క్షుద్రపత్రికల భట్రాజులతో పల్లకీ సేవలు అందుకుంటూ పది రూపాయలు కూడా తేలేక నా చెయ్యిపడిపోయింది అంటూ బేలపలుకులు పలుకుతున్న చంద్రబాబు దీన వదనాన్ని గమనిస్తున్నాము.
మరి డాక్టర్ వైయస్ఆర్ తన అయిదేళ్ల కాలంలో కాలు బయటపెట్టకుండా, ఒక్కడిని కూడా ప్రాధేయపడకుండా, రాష్ట్రానికి సాధించిన పెట్టుబడులు అక్షరాలా మూడు లక్షల కోట్ల రూపాయలు! బాపురే! పారిశ్రామికరంగం వైయస్ఆర్ పాలనలో జవనాశ్వంలా ఉరకలెత్తింది. పెట్రో రసాయనాల పరిశ్రమలు రావడానికి చర్యలు తీసుకున్నారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టులకు పచ్చజెండా ఊపారు.
ఐటి రంగ అభివృద్ధిలో వైయస్ఆర్  సాధించిన విజయాలు అనన్యసామాన్యం. ప్రధాన ఐటి కంపెనీలు బాగా విస్తరించడం వైయస్ఆర్ కృషి ఫలితమే. దాదాపు రెండున్నర లక్షలమంది ఐటి నిపుణులు ఉద్యోగాలను సాధించారు. ఇక సిమెంట్, స్టీల్, ఫార్మా రంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధించింది.
వైయస్ఆర్ హయాంలో ఎలాంటి డప్పులు కొట్టుకోకుండానే ఇంగ్లాండ్, జర్మనీ, ఇజ్రాయెల్, అమెరికా, సింగపూర్, ఇండోనేషియా నుంచి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి సుముఖత చూపించారంటేనే వైయస్ఆర్ సమర్ధత ఏమిటో విశదమవుతుంది. చంద్రబాబు ముందు దర్జాగా కాలుమీద కాలువేసుకుని కూర్చునే అంబానీలు  వైయస్ఆర్  ముందు వినయంగా చేతులు కట్టుకుని నిలబడేవారు.
గంగవరం పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, శ్రీ సిటీ, శంషాబాద్ విమానాశ్రయం వైయస్ఆర్  ఎంతటి కృషీవలుడో నిదర్శనంగా నిలబడతాయి.
వ్యవసాయ రంగానికే కాకుండా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి కూడా పెట్టుబడులు వైయస్ఆర్  హయాంలో దూసుకుని వచ్చాయి. పెట్టుబడుల ప్రవాహం అంటే ఏమిటో వైయస్ఆర్ రాష్ట్రానికి తొలిసారిగా రుచి చూపించారు. ప్రపంచమంతా ఆర్థికమాంద్యం కమ్మిన రోజుల్లో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని ఆనాడు రిజర్వ్ బ్యాంకు కితాబు ఇచ్చిందంటే వైయస్ఆర్ పాలనాదక్షతను వర్ణించడం శ్రీశ్రీ తరం అవుతుందా? శ్రీనాధుడి తరం అవుతుందా? చెప్పండి!! ఎవరితరం?
వైయస్ఆర్ పాలనాకాలంలో మొత్తం అరవైకి పైగా నూతన పరిశ్రమలు, నూట రెండు ప్రత్యేక ఆర్ధిక మండళ్లు అనుమతులకు నోచుకున్నాయి.
చంద్రబాబు తన జల్సాలతో రాష్ట్రాన్ని అరవైవేల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచెత్తితే, వైయస్ఆర్ అయిదేళ్ల కాలంలోనే రాష్ట్రాన్ని రెండువేలకోట్ల రూపాయల మిగులు రాష్ట్రంగా మార్చారంటే... ఇంతింత ప్రగతిని సాధించడమే కారణం. కాకపొతే గజ్జి మీడియా ఒడలంతా పూసుకున్న దుర్గంధం కారణంగా ప్రజలకు వాస్తవాలు ఏనాడూ తెలియలేదు.
కనీసం 2009 ఎన్నికల ప్రచారంలో కూడా వైయస్ఆర్  కానీ, కాంగ్రెస్ కానీ, ఈ విజయాలను ప్రజలకు చెప్పుకోలేదు. అందుకు కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలి. అప్పటి ఎన్నికల్లో గెలిచి వైయస్ఆర్ ముఖ్యమంత్రి కానట్లయితే, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయి ఉండేది. చంద్రబాబు తొమ్మిదేళ్లు ప్లస్ నాలుగేళ్లు పాలించినప్పటికీ చెప్పుకోవడానికి ఒక్క ఘనకార్యం లేదు. కానీ, అంతులేని గోబెల్స్ ప్రచారం!
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా అన్నాడు ప్రజాకవి వేమన...చంద్రబాబు..వైయస్ఆర్ లాంటివారిని చూసే అని ఉంటాడు.

రచన : ఇలపావులూరి 

Labels :
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com