Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌..వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డానికి చంద్ర‌బాబు విల‌న్ నంబ‌ర్ వ‌న్‌: వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి                               కె. అగ్ర‌హారంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               ఎవ‌రు ముందుకు వ‌చ్చినా.. రాక‌పోయినా తాము మాత్రం కేంద్ర ప్ర‌భుత్వంపై మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెడ‌తాం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి                                చెరువుకొమ్ముపాలెం చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                               తిమ్మపాలెం శివారు నుంచి 94వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం.                                చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ్రామాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు: శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి                               చంద్రబాబుపై పోరాడాల్సింది పోయి.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించటంలో ఆంతర్యమేంటి?- అంబ‌టి రాంబాబు                               చౌటపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                 
    Show Latest News
ప్యాంట్రీ వ్యాన్‌ ఎందుకు దారి మళ్లించారు

Published on : 19-Aug-2017 | 12:21
 

ఎన్నికల కమిషన్‌ దీనిపై లోతు దర్యాప్తు చేపట్టాలి
తినే ఒక్క చపాతీకి ప్యాంట్రీ వ్యాన్‌ అవసరమా..?
బాబు దేశంలోనే దగుల్బాజీ ముఖ్యమంత్రి
టీడీపీని నంద్యాల ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిద్దాం
రాజన్న రాజ్యం మళ్లీ సాధించుకుందాం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి 
నంద్యాల: చంద్రబాబు తినే ఒక్క చపాతీకి ప్యాంట్రీ వ్యాన్‌ ఎందుకని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్యాంట్రీ వ్యాన్, ఇన్నోవా కారులో డబ్బు లేకపోతే ఎందుకు దారి మళ్లించారని ప్రశ్నించారు. ఆ వ్యాన్‌లు ఎవరి దారి మళ్లించారు. ఆ వ్యాన్‌లో ఎంత అవినీతి డబ్బు ఉందో ఎన్నికల కమిషన్‌ లోతుగా దర్యాప్తు చేపట్టాలని కోరారు. నంద్యాల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తినే ఒక్క చపాతీ తయారు చేసేందుకు నంద్యాలలో ఒక్క ఇల్లు లేదా.. హోటళ్లు లేవా అని ప్రశ్నించారు. గత పది రోజులుగా నంద్యాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీ మాదిరిగా వంటలు చేయించుకోవడానికి పెద్ద పెద్ద వ్యాన్‌లు తెప్పించుకోలేదని, ప్రజలు పెట్టింది తింటూ వారిని సంతోషపెడుతున్నారన్నారు. 
రాజీనామా చేయించిన ధీరుడు వైయస్‌ జగన్‌
అధికారంలో ఉండి అవసరం లేకున్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఈ రోజుకీ వారితో రాజీనామా చేయించకుండా దేశంలోనే దగుల్బాజీ ముఖ్యమంత్రిగా తయారయ్యాడని కోటంరెడ్డి విమర్శించారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎమ్మెల్సీ వస్తే వైయస్‌ జగన్‌ ధీరుడిలా రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకున్నారన్నారు. వయస్సులో చంద్రబాబు కంటే వైయస్‌ జగన్‌ చిన్నవాడైనా, బాబు కంటే అనుభవం తక్కువగా ఉన్నా.. రాజకీయాల్లో పది మందికి ఆదర్శంగా ఉండాలని, విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు, వైయస్‌ జగన్‌కు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. 
ఉప ఎన్నికల తీర్పు చారిత్రాత్మకం అవ్వాలి..
మూడున్నర సంవత్సరాలుగా చంద్రబాబు దుర్మార్గులను చూస్తున్న చంద్రబాబు టీడీపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సూచించారు. చంద్రబాబు భయపెట్టి ఓట్లు వేయించుకునేందుకు కుట్రలు చేస్తున్నాడన్నారు. నా రోడ్ల మీద నడవొద్దు, కరెంట్‌ కట్‌ చేస్తే, పెన్షన్లు కట్‌ చేస్తా అన్న చంద్రబాబు బెదిరింపులు ప్రజలు ఎవరూ మర్చిపోలేదన్నారు. మరో కొన్ని గంటల్లో నంద్యాలలో ఎన్నికలు జరగబోతున్నాయని, 2014లో వందల కొద్ది హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని నంద్యాల ఓటర్లకు సూచించారు. ఎన్నికల ముందు కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తానని, తరువాత కాపు నేత ముద్రగడను అడుగడుగునా అవమానించి తీరును గుర్తుంచుకొని టీడీపీకి బుద్ధి చెప్పాలన్నారు. చంద్రబాబు చేతిలో మోసపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం దొరికిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. 2019లో వైయస్‌ జగన్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నంద్యాల ఉప ఎన్నికే తొలి అడుగు అన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రాజ్యం కోసం ఓటు వేయాలని కోరారు. నంద్యాల ప్రజలు ఇచ్చే తీర్పు చారిత్రాత్మక తీర్పు అవ్వాలన్నారు. చంద్రబాబు మోసాలు చూసి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా ఎన్నికలకు దూరంగా ఉన్నారన్నారు. ప్రజలంతా గమనించి వైయస్‌ఆర్‌ సీపీని గెలిపించాలని కోరారు
Labels : Kotamreddy, YSRCP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com