Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                               చంద్రబాబు ధనదాహం కోసమే పోలవరం అంచనాలను పెంచారుః బొత్స సత్యనారాయణ                               బాబు నిర్లక్ష్యంతోనే ఏపీకి నీటి కొరతః ఎంవీఎస్ నాగిరెడ్డి                               చంద్రబాబు ఏ పని చేసినా అక్రమమేః జోరి రమేష్                                చంద్రబాబు భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాలిః వైవీ సుబ్బారెడ్డి                               దేవుడి పేరుతో టీడీపీ వేల కోట్లు దోచేస్తోందిః వైవీ సుబ్బారెడ్డి                               చంద్రబాబు సదావర్తి భూములను ఎంత కారుచౌకకు కొట్టేశారో వేలంపాటను బట్టి అర్థమవుతోందిః వాసిరెడ్డి                               చంద్రబాబు ఎంత అవినీతిపరుడో సదావర్తి భూముల వేలంతో బట్టబయలైందిః కాకాని                 
    Show Latest News
నంద్యాలలో టీడీపీ భయానక వాతావరణం

Published on : 14-Jul-2017 | 18:44
 

కర్నూలుః చంద్రబాబు క్యాబినెట్ అంతా అమరావతిని వదిలేసి నంద్యాలలో తిష్టవేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఉపఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ రాకముందే నంద్యాలలో మకాం వేసి విచ్చలవిడిగా మోసపూరిత వాగ్ధానాలు, ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కర్నూలులో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నప్పుడు కూడ ఇలాగే చేశారన్నారు. మహానేత వైయస్ఆర్ హయాంలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్ట్ లకు సంబంధించిన మిగిలిపోయిన కొద్దిపాటి పనులు ప్రస్తుతం పూర్తి కాక నత్తనడకన సాగుతున్నాయన్నారు. హంద్రీనీవా ప్రాజెక్ట్ ను మూడొంతుల వరకు వైయస్ఆర్ పూర్తి చేశారని, కానీ, బాబు వచ్చాక మిగిలిన పనులు పూర్తి చేయకపోగా....ఆ ప్రాజెక్ట్ మేమే కట్టామని చెప్పుకోవడం దారుణమన్నారు.  నంద్యాలలో ప్రతి ప్రాంతానికి వెళ్లి కులాలపరంగా మేం కొంటామనే విధానంతో టీడీపీ నేతలు మాట్లాడుతుంటే నంద్యాల ప్రజలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని బుగ్గన చెప్పారు. ప్రలోభాలకు లొంగకుంటే భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వైయస్సార్సీపీ కౌన్సిలర్  సుబ్బరాయుడు ఇంటిమీదికి అర్థరాత్రి 50మంది పోలీసులు పోయి వేధించి...భూమి అమ్ముకున్న 2 లక్షల డబ్బులను ఎత్తుకెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కర్నూలులో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ ను ఎన్నికల హామీలపై ప్రజలను అడుగడుగునా నిలదీస్తున్నారని భూమన చెప్పారు. బాబు వస్తే జాబు వస్తుందని ఓట్లు వేయించుకున్నారు. ఎలాంటి ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా ఎంవోయూల పేరుతో ప్రచార అర్భాటం చేస్తున్నారు. 2లక్షల 40వేల 452 ఉద్యోగాలంటూ  ప్రజలను మభ్యపెడుతున్నారు. కేంద్రం ఇచ్చిన డేటా మేరకు దేశమంతా 2016లో లక్ష ఉద్యోగాలొస్తే ఏపీలో 2లక్షలకుపైగా  ఉద్యోగాలని చెబుతున్నాడు. ఎవరికిచ్చారు బాబు మీరు. పార్టీ మారిన  ఎస్పీ వై రెడ్డి , జలీల్ ఖాన్ లాంటి వాళ్లకు ఉద్యోగాలొచ్చాయి తప్ప ఎవరికీ ఉద్యోగాలిచ్చిన పాపాన పోలేదన్నారు.  నంద్యాల ఎన్నిక ఉందని జలీల్ ఖాన్ కు  వక్ఫ్ బోర్డు ప్రెసిడెంట్ గా ఉద్యోగాలిచ్చారు తప్ప ఏ ఒక్కరికీ ఉద్యోగాలివ్వలేదన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అందరూ గమనిస్తున్నారని,  జగనన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తాడని ఎదురుచూస్తున్నారన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా కలుపుకొని పోతాడన్న ఆశతో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుటున్నారని చెప్పారు. చంద్రబాబు ఆయన టీం నంద్యాలలో చెప్పేదంతా ఫాల్స్ డేటా, పచ్చి అబద్ధమని ప్రజలు కనుక్కున్నారని భూమన చెప్పారు. మీరు ఇలాగే అందరినీ బెదిరించి చేసినట్టయితే ఊర్లోకి రాని పరిస్థితి ఏర్పడుతుందన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com