Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష. ఇదే దీక్ష ఢిల్లీలో చేసి ఉంటే ఉపయోగం ఉండేది: రోజా                               25 మంది ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే కేంద్రం దిగి వచ్చేది. ఇలాంటి దొంగ దీక్షలు, దగా దీక్షలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు: ఎమ్మెల్యే రోజా                                140వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర శోభ‌నాపురం శివారు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎంపీలు                               సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లువ‌నున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు                               మైల‌వ‌రం శివారు నుంచి 139వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ముత్యాల‌పాడు శివారు నుంచి 138వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను క‌లువ‌నున్నారు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు                               ఆంధ్రప్రదేశ్‌లోనూ మహిళలకు భద్రత కరువు: వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
టీడీపీకి అంత ఉలుకెందుకో

Published on : 12-May-2017 | 11:54
 

–  ప్రధానితో వైయస్ జగన్ భేటీ.. టీడీపీలో వణుకు
– పెదబాబు, చినబాబు అవినీతి బయట పడుతుందని భయం
–కల్లుతాగిన కోతుల్లా టీడీపీ నేతలు మతిభ్రమించిన వ్యాఖ్యలు
– ప్రత్యేక హోదాపై బాబు చేయని పోరాటం ప్రతిపక్ష నేత చేస్తున్నారని అక్కసు
– పచ్చమీడియా పిచ్చిరాతలు..మంత్రి నారాయణ పేరుతో నీచ రాతలు
– నారాయణ  జగన్‌ని తిట్టినట్టు పచ్చ టీవీలో వెర్రి స్క్రోలింగ్‌లు
-టీడీపీ సర్కార్ తీరుపై మండిపడుతున్న రాష్ట్ర ప్రజానీకం

వైయస్‌ జగన్‌ ప్రధాని మోడీని కలవడాన్ని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. తమ ప్రభుత్వంలోని మంత్రి కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందినా ఆ విషయాన్ని కూడా పక్కనపెట్టి జగనేదో చేయరాని నేరం చేసినట్టుగా పచ్చ దళారులు నిన్నట్నుంచి అదేపనిగా భేటీని వక్రీకరిస్తుంటే.. షరా మామూలుగానే పచ్చ పత్రిక పిచ్చి రాతలు రాసేసింది. వాస్తవానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రధానిని కలవడం అనేది రాజ్యాంగ విరుద్ధమైన అంశమేమీ కాదు. కానీ అదేదో తప్పన్నట్టుగా బయటి ప్రపంచానికి చూపించేసి లబ్ధిపొందడానికి నానా అవస్థలు పడుతున్నారు. 

టీడీపీకి  ఎందుకంత అసహనం
ప్రతిపక్ష నాయకుడు ప్రధానిని కలిస్తే టీడీపీకి ఎక్కడ లేని భయం పట్టుకుంది. వారిద్దరి భేటీని చేయకూడని నేరంగా చూపించాలని కిందా మీదా పడుతున్నారు. ప్రధాని ఇక తమవైపు చూడరనుకున్నారో ఏమో  మిత్రపక్షం అనే విషయాన్ని కూడా మరిచిపోయి టీడీపీ నేతలు తిట్ల పురాణం మొదలుపెట్టారు.  ఓ పచ్చ పత్రిక, ఛానల్‌లో ఇప్పటికే వైయస్‌ జగన్, ప్రధాని మోడీ భేటీపై వంకర రాతలు రాసేశారు. అవినీతి కేసులను మాఫీ చేయించుకోవడానికే మోడీని కలిశాడని అర్థంలేని రాతలు రాసేసి పార్టీ పరువును రోడ్డున పడేశారు. అంటే దానర్థం మోడీ అవినీతికి సహకరిస్తాడని ప్రధాని ప్రతిష్టకు భంగం కలిగేలా వారి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానితో భేటీ అనంతరం వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని నిర్ణయించామని.. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలని పిలుపునిచ్చారు. అందరికీ సమ్మతమైన వ్యక్తిని రాష్ట్రపతిని చేసి ఆ పదవికున్న గౌరవాన్ని కాపాడుదామని అన్ని పార్టీలకు వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అందరూ కోరుకునేది కూడా అదే. పైగా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ కూడా వైయస్‌ నిర్ణయాన్ని స్వాగతించాలి. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడి తీరాలి.  అయితే ఇక్కడ జరిగింది మాత్రం పూర్తి విరుద్ధం. వైయస్‌ జగన్‌ ఎప్పుడైతే బీజేపీ అభ్యర్థికి మద్ధతిస్తాడని ప్రకటించాడో టీడీపీ నాయకుల్లో వణుకు మొదలైంది. తమ ప్రభుత్వంలోని మంత్రి కుమారుడు అతి దారుణంగా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టి వైయస్‌ జగన్‌ ప్రధానితో జరిగిన భేటీని ప్రస్తావించి మీడియా ముందు అసహనాన్ని  వెల్లగక్కడం నిజంగా టీడీపీలోని భయాన్ని తెలియజేస్తుంది. ఏమో మోడీ ఇప్పటికిప్పడు టీడీపీని వదిలేస్తాడేమో.. జగన్‌ను చేరదీస్తే మన  పరిస్థితి ఏంగానూ.. అసలే బాస్‌ కూడా దేశంలో లేడు. పరిస్థితిని చక్కదిద్దాలి అన్నంతగా కిందా మీదా అవుతున్నారు. టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే పచ్చ పత్రికకైతే ఏం చేస్తున్నామో కూడా అర్థంకాక తన కొడుకు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మంత్రి నారాయణను కూడా రాజకీయంలోకి లాగి.. కేసుల మాఫీ కోసమే ప్రధాని మోడీని జగన్‌ కలిశాడని నారాయణ అన్నట్టుగా టీవీల్లో స్క్రోలింగ్‌లు ఇవ్వడం కన్నా మరో దౌర్భాగ్యం ఉండదు. 

అంశాల వారీ మద్ధతే కదా..
ప్రధాని మోడీని కలిసిన అనంతరం వైయస్‌ జగన్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్ధతు ఇస్తామని చెప్పడంతోపాటు మరో విషయం కూడా చెప్పాడు. బీజేపీని కానీ ప్రధాని మోడీని కానీ మేమెన్నడూ వ్యతిరేకించలేదు.. అలాగని వారిని నెత్తుకెత్తుకుందీ లేదన్నారు. పైగా ఆ పార్టీకి అంశాల వారీ మద్ధతును మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. మొదట్నుంచీ ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీని నిలదీస్తూనే ఉన్నామని.. ఇక మీదట కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయలేని పనిని ప్రతిపక్ష నాయకుడిగా వైయస్‌ జగన్‌ ప్రధానితో భేటీలో ప్రస్తావించడం గొప్ప పరిణామం. నింజగా ఇది అందరూ మెచ్చుకుని తీరాల్సిన విషయం. అందుకేనేమో తాము చేయలేని పనిని వైయస్‌ జగన్‌ చేస్తున్నాడని, ఆయన్ను జనాలెక్కడ మెచ్చుకుంటారోనని భయపడిపోయిన పచ్చపార్టీ కల్లుతాగిన కోతుల్లా మతిభ్రమించిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధానితో భేటీలో జగన్ఆ పూర్తిగా రాష్ట్ర సమస్యల మీదనే మాట్లాడారు. మిర్చికి మద్ధతు ధర, అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని ప్రధానిని కోరారు. దాంతోపాటు చంద్రబాబు అవినీతిపై రాసిన పుస్తకాన్ని కూడా ప్రధానికి ఇచ్చి వచ్చారు. పనిలో పనిగా లోకేష్‌ పవర్‌ సెంటర్‌గా మారి చేస్తున్న అవినీతిపైనా విచారణ జరిపించాలని ప్రధానిని విజ్ఞప్తి చేశారు.  ప్రభుత్వం, బాబు-కొడుకుల అవినీతిపై  ముద్రించిన ‘ఎంపరర్‌ ఆఫ్‌ కరఫ్షన్‌’ పుస్తకాన్ని ఆధారాలుగా సమర్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com