Epaper      Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             శింగనమల సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మేలుకొలుపు పాదయాత్ర ప్రారంభం                               ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట                                నారాయణరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలిః వేణుగోపాలకృష్ణ                               ప్రజల మన్ననలు పొందలేక చంద్రబాబు ప్రత్యర్థులను అంతమొందించాలని చూస్తున్నాడుః వేణుగోపాలకృష్ణ                               కరువు నివారణ చర్యలు చేపట్టడంలో బాబు సర్కారు విఫలమైందిః కాకాని గోవర్ధన్ రెడ్డి                               పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల బాబు, లోకేష్ ల గ్రోత్ రేటు పెరిగిందే తప్ప రైతులు, ప్రజల గ్రోత్ రేటు పెరగలేదుః కన్నబాబు                               అవినీతి, హత్యల్లో చంద్రబాబు ఏపీని నంబర్ వన్ చేశాడుః దాడిశెట్టి రాజా                               నష్టాల్లో ఉందని ఆర్టీసీని మూసేస్తారా..? ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తారా బాబుః పద్మ                               ప్రభుత్వ పాఠశాలలను నారాయణ విద్యాసంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందిః వాసిరెడ్డి పద్మ                 
    Show Latest News
టూరిస్ట్‌ సీఎం

Published on : 13-May-2017 | 13:31
 

– విదేశీ పర్యటనలతో మూడేళ్లుగా కాలక్షేపం
– రెండు నెలలకు పైగా విదేశాల్లోనే 
– 49 సార్లు ఢిల్లీ పర్యటనలు 
– రాష్ట్రంలో సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ విదేశాలకు
– దారి ఖర్చులకు కూడా సరిపోని పెట్టుబడులు 

రాష్ట్రంలో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడల్లా చంద్రబాబు విదేశీ పర్యటనలు పెట్టుకుంటాడు. వారం పదిరోజులు అక్కడక్కడా తిరిగేసి ఎంజాయ్‌ చేసేసి వచ్చిన తర్వాత రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు మోసుకొచ్చానని చెప్పుకుంటాడు. బాబు ఫారెన్‌ టూర్‌కి వెళ్తాడనగా రెండు రోజుల ముందు నుంచే ఈ ప్రచారం మొదలవుతుంది. పచ్చ పత్రికలు ప్రచారాన్ని నెత్తికెత్తుకుంటాయి. బాబు పర్యటనలో ఉన్నంత కాలం ఆ పత్రికలకు పరీక్షా కాలం. బాబు మాట్లాడిన ప్రతి మాటనూ ముత్యాల్లా ఏరుకుని అచ్చొత్తాలి. ఆయన ఏం చేసిన అద్భుతం అని కీర్తించాలి. చంద్రబాబు ఏపీకి వచ్చి ప్రెస్‌ మీట్‌ పెట్టి పర్యటన  వివరాలు వెల్లడిస్తాడు. ఏ దేశం వెళ్లొస్తాడో ఆ దేశంలాగా అమరావతిని చేస్తానని డాబులు మాట్లాడతాడు. నాలుగు రోజులు అనుకూల మీడియాలో మూటలు కట్టుకుని తెచ్చినట్టు వార్తలు ప్రసారం చేయించుకుంటాడు. అంతే ఐదో రోజు నుంచి ఆయన చెప్పిన మాటలు ఆయనకే గుర్తుండవు..

35 నెలల్లో 16 విదేశీ పర్యటనలు 
ఇప్పటి వరకూ చంద్రబాబు తన 35 నెలల పాలనలో 16 విదేశీ యాత్రలు చేశారు. అంటే ప్రతి రెండు నెలలకొకసారి విదేశాలు వెళ్లి వస్తున్నారు. అందులో దావోస్‌ మూడు సార్లు వెళ్లారు. సింగపూర్‌ రెండు సార్లు , అమెరికా రెండు సార్లు, జపాన్‌ కూడా రెండు మార్లు పర్యటించారు. చైనా, టర్కీ, బ్రిటన్, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, స్విట్జర్లాండ్, శ్రీలంక వంటి దేశాలూ చుట్టి వచ్చారు. ఆయన ప్రతి పర్యటనలోనూ ప్రధాన లక్ష్యం ఏపికి పెట్టుబడులు తీసుకురావడమేనని చెబుతుంటారు. అవన్నీ ఫలిస్తున్నట్టు, భారీగా ఎంవోయూలు కుదిరినట్టు, అమరావతికి తరలివస్తున్నట్టు కూడా చెప్పుకుంటారు. దేశంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్న చంద్రబాబు దానికి అదనంగా ఫారిన్‌ ట్రిప్పుల్లోనూ లక్షల కోట్లు ఏపికి వచ్చేస్తున్నట్టు చెప్పుకుంటారు. దానికి తగ్గట్టుగానే ఈ పర్యటనల్లో ప్రకటనలు ఉంటాయి. 

ఎక్కడికెళ్లారు? ఏమేం చెప్పారు? 

2015–2017 వరకు మూడు సంవత్సరాల పాటు వరుసగా ప్రతి జనవరిలోనూ దావోస్‌లో జరిగే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ఆయన హాజరయ్యారు. దానికోసం ఆ సదస్సులో పాల్గొనడానికి భారీ ఎంట్రీ ఫీజును కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఎంట్రీ ఫీజు కట్టిన వారందరికీ అవకాశం కల్పించే దావోస్‌కు బాబును ఆహ్వానించడమే ఘనకార్యంగా చెప్పుకోవడం కూడా విశేషం. ఆ మూడు సార్లు బాబు చెప్పిన మాటల ప్రకారం 2015లో స్పీడ్‌ రైలు వస్తుందన్నారు. 2016లో అయితే విదేశీ పెట్టుబడుల పోటెత్తి రావడం, 2017లో ఆయన మాటలను అనుసరించి విశాఖలో మాస్టర్‌ కారిడార్‌ ఏర్పాటు జరిగి ఉండాలి. కానీ ఏపికి రైల్వే జోన్‌ చట్ట ప్రకారం రావాల్సి ఉండగా కేంద్రాన్ని నిలదీయలేని చంద్రబాబు స్పీడ్‌ రైల్‌ మాటలను కూడా స్పీడ్‌గానే మరచిపోయినట్టు మనం భావించవచ్చు. 

– 2015లో చైనా వెళ్లినప్పుడు షాంఘై తరహాలో అమరావతి నిర్మిస్తామన్నా రు. జపాన్‌ పర్యటనలో టోక్యో మాదిరిగా అమరావతి నగర నిర్మాణం సాగుతుందన్నా రు. టర్కీ వెళ్లిన సందర్భంగా ఇస్తాంబుల్‌ నగరంలా అమరావతి నిర్మించబోతున్నామన్నారు. గత ఏడాది జులైలో కజికిస్తాన్‌ పర్యటన సందర్భంగా కాబూల్‌ కార్లు వస్తా యని చెప్పారు. రష్యా వెళ్లిన సమయంలో మెరైన్‌ వర్సిటీ వచ్చేస్తోందని చెప్పుకొచ్చారు. మొన్నటి జనవరిలో శ్రీలంక వెళ్లిన సమయంలో అమరావతికి ’మాస్టర్‌ ప్లాన్‌ శ్రీలంక’ ఇస్తుందని చెప్పుకొచ్చారు. అంతకుముందు లండన్‌ వెళ్లినప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం నార్మన్‌ ఫోస్టర్‌ను ఇప్పుడు రంగంలో దింపారు. 

విశాఖ సమ్మిట్లో పెట్టుబడుల ప్రహసనం 
–––––––––––––––––––––––––––––––––––––
2015 లో వచ్చినట్లు చెప్పిన పెట్టుబడులు – 6 లక్షల కోట్లు 
2016 లో వచ్చినట్లు చెప్పిన పెట్టుబడులు – 11 లక్షల కోట్లు 
దేశంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్న చంద్రబాబు దానికి అదనంగా ఫారిన్‌ ట్రిప్పుల్లోనూ లక్షల కోట్లు ఏపీకి వచ్చేస్తున్నట్టు చెప్పుకుంటారు. దానికి తగ్గట్టుగానే ఈ పర్యటనల్లో ప్రకటనలు ఉంటాయి. తిరిగి చూస్తే అంతా శూన్యం
సింగపూర్‌ పర్యటన అనంతరం 
––––––––––––––––––––––––––––––
––జిల్లాకో ఎయిర్‌పోర్టు 
ఉదాహరణకు ఆయన సీఎం అయిన తర్వాత తొలి పర్యటనలో భాగంగా సింగపూర్‌లో అడుగుపెట్టారు. 2014 నవంబర్‌ రెండో వారంలో జరిగిన ఆ మూడు రోజుల పర్యటన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి జిల్లాలో ఓ ఎయిర్‌ పోర్ట్‌ నిర్మిస్తానన్నారు. కానీ ఆ తర్వాత అది మరచిపోయారు. దాని వల్ల ఉపయోగం ఏమిటనే విషయం పక్కన పెడితే బాబు బహిరంగంగా చెప్పిన మాటను పూర్తిగా విస్మరించడం విశేషం. మాటలతో మభ్యపెట్టి బాబు పబ్బం గడుపుతున్నారు. 

మొత్తం 35 నెలలు – 49 సార్లు ఢిల్లీ యాత్రలు 
18 స్టేలు అంటే ఒక్కో స్టేకి నెలకి 2 సార్లు వేసుకున్నా 36 ట్రిప్‌ లు 
ఇంకా 13 మిగిలున్నాయి అంటే ఓటుకి నోటు దగ్గర నుండి పుష్కరాలు, రాజధాని భూములు, ఇసుక మాఫియా మొత్తం 2 లక్షల కోట్లు అవినీతికి 13 ట్రిప్‌ లు .
ఇప్పుడు మళ్లీ అమెరికా నుండి నేరుగా ఢిల్లీకి.
ఇకపోతే కప్పిన శాలువాలకి.. పంచిన తిరుపతి లడ్టూలకి లెక్కేలేదు.
గోవిందా గోవిందా !! 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com