Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               చిన్నరాయుడుపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 298వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                 
    Show Latest News
ఉత్తరాంధ్ర ఉనికి మరచిన బాబు

Published on : 12-Sep-2018 | 12:48
 

 

మెడికల్ హబ్, మల్టీస్పెషాలిటీ, కార్పొరేట్ ఆసుప్రతులు, మెడికల్ కాలేజీలు...చంద్రబాబు మైకు పట్టుకుంటే చెప్పే ముత్యాల్లాంటి మాటలివి. మేడి పండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టుగా...బాబు మాటలు చూడ మురిపెంబుగుండు...తరచి చూడబోతే బోడి గుండు అన్నట్టుంది రాష్ట్రం ఆరోగ్య దుస్థితి. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం విషజ్వరాలతో మూలుగుతోంది. కార్పొరేట్ ఆసుపత్రులకెళ్లి లక్షల్లో బిల్లులు చెల్లించగల వారికి వైద్యం అందదనే బెంగలేదు. ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చిన నాయకులకూ విదేశాలకెళ్లి రూట్ కెనాల్ కు కూడా ప్రభుత్వ ఖర్చులతో ఖరీదైన వైద్యం అందుతుంది. కానీ బడుగులకు, బలహీనులకు, ఓటు బాంకుగా ఆ నాయకులు లెక్కపెట్టుకునే జనానికి మాత్రం సాధారణ జ్వరానికి కూడా మందులుండవు. విజయనగరం, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలే కాదు మైదాన ప్రాంతాల్లోనూ విషజ్వరాలు, డెంగ్యూ మరణాలు ఉధృతమౌతున్నాయి. వేలాదిరోగుల్లో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు రోగుల తాకడి ఎక్కువౌతోంది. కానీ ఎక్కడా పరీక్షలు, మందులు ఉండటం లేదు. దాంతో ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న రోగులను ఫీజుల పేరుతో పీడించుకుతింటున్నారు. తప్పని పరిస్థితుల్లో వేల రూపాయిల ఫీజులు చెల్లించుకుంటున్నారు రోగులు. గత పదిరోజుల వ్యవధిలో ఉత్తరాంధ్రలో 100మందికి పైగా డెంగ్యూతో మరణించినట్టు సమాచారం. జిల్లా పి.హెచ్.సిల్లో మందులు డాక్టర్ల కొరత, చివరకు జ్వర నిర్థారణ కిట్లు కూడా లేకపోవడం వీటిలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.   
పారిశుధ్యలోపం, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఖరి ఈ మరణాలకు ముఖ్య కారణం. ఎక్కడ చూసినా పేరుకుపోతున్న చెత్త చూస్తే చంద్రబాబు చెబుతున్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర లేదా అని అనిపించకమానదు. విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వాసుపత్రుల్లో అవసరమైన చికిత్సలు అందుబాటులో ఉండటం లేదు. ప్రత్యేక వైద్య శిబిరాలు, మందుల పంపిణీ, తక్షణ దిద్దుబాటు చర్యలే లేవు. వైద్యశాఖా అధికారులు సైతం ఎలాంటి చలనం లేకుండా ఉండటం దురదృష్టకరం. తనిఖీల పేరుతో డెంగ్యూ బాధితుల లెక్కింపు తప్పించి, అదుపు చేసేందుకు తక్షణ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ప్రతిపక్షం, ప్రజాసంఘాలు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర నటిస్తోంది. నిజానికి ఉత్తరాంధ్రలో మెడికల్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు వైద్యనిపుణులు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గూడెల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ చంద్రబాబు ఈ ప్రాంతం గురించి కానీ, ఇక్కడి ప్రజల ఆనారోగ్య పరిస్థితులపై కానీ పెదవి విప్పడం లేదు. ఓ పక్క ఇంత దారుణమైన పరిస్థితులు ఉత్తరాంధ్రలో విలయతాండవం చేస్తుంటే విషజ్వరాలే లేవని బొంకుతోంది ప్రభుత్వం. పేదలకు అండగా ఉన్న ఆరోగ్యశ్రీని లేకుండా చేసిన ప్రభుత్వం ప్రజల సాధారణ ఆరోగ్య అవసరాలను కూడా తీర్చలేని నిర్లక్ష్యపాలన సాగిస్తోంది.  ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ ఈ పరిస్థితులను చూసే 1000 దాటే ప్రతి చికిత్సనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చారు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com