Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డ్రామాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు: శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి                               చంద్రబాబుపై పోరాడాల్సింది పోయి.. ప్రతిపక్షాన్ని ప్రశ్నించటంలో ఆంతర్యమేంటి?- అంబ‌టి రాంబాబు                               చౌటపాలెంలో పార్టీ జెండా ఆవిష్కరించిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్ 93వ రోజు ప్రజాసంకల్పయాత్ర విప్పగుంట శివారు నుంచి ప్రారంభ‌మైంది.                               చింత‌మ‌నేనిపై అన‌ర్హ‌త వేటు వేయాలి: - అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు                               చట్టాలు తెలియనిది మాకా..?చంద్రబాబుకా..?: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               నరేంద్ర మోదీ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం. బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తామంటే కేంద్రంలోని మా మంత్రులు రాజీనామా చేయరని చంద్రబాబు అంటున్నారు: పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి                               ఊపిరి ఉన్నంత వ‌ర‌కు హోదా కోసం పోరాడుతూనే ఉంటాం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               ప‌్ర‌త్యేక హోదా సాధించ‌డ‌మే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్యం: భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి                  
    Show Latest News
మిర్చి రైతుకు రూ.13 వేలైతేనే గిట్టుబాటు

Published on : 06-May-2017 | 17:00
 

 -కేంద్రం ఇచ్చిన మద్దతు ధరకు ఒరిగేదేం లేదు
– సగం ధర కూడా చెల్లించకుంటే రైతులకు కష్టమే
– రైతులను ఒదిలేసి బాబు అమెరికా ప్రయాణం దారుణం 

మిర్చి ఘాటుతో ఆంధ్రప్రదేశ్‌ ఠారెత్తిపోతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం దేశం వదిలి అమెరికాకు పారిపోయాడు. మద్దతు ధర కోసం రైతులు, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే చంద్రబాబు మాత్రం అమెరికాకు పారిపోయి రైతుల్ని మీమాన మీరు చావమని వదిలేశాడు. రైతులంటే తనకెంత చిన్నచూపుందో ఇలాంటి ప్రతిసందర్భంలోనూ చంద్రబాబు నిరుపిస్తూనే ఉన్నాడు. అలాగని విదేశీ పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఏమైనా ఒరగబెట్టాడా అంటే అదీ లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన రూ. 5 వేల మద్దతు ధరతో రైతులకు ఒనగూరే ప్రయోజనాలు కూడా అంతంత మాత్రమే. లెక్కలన్నీ పరిశీలిస్తే రైతులు ఎకరాకు రూ. 50 వేలకు పైనే నష్టం భరిస్తున్నట్టు సుస్పష్టం. 

ఎకరా మిర్చి పంటను యూనిట్‌గా తీసుకుని పరిశీలిస్తే..
పొలం కవులు : 20వేలు 
దుక్కి,అరక, నాగళ్లు :15 వేలు 
విత్తనం, నాటు వరకు :15వేలు 
పురుగు మందులు. : 25వేలు 
ఎరువులు : 20వేలు
కలుపులు, పై కూలి : 5వేలు 
నీటి పారుదల ఖర్చు : 4వేలు
కోత, గ్రేడింగ్‌ : 30వేలు 
గోతాలు,తొక్కు కూలీ : 4వేలు 
యార్డుకి ట్రాన్స్‌పోర్ట్‌ : 2వేలు 
సాదర ఖర్చులు : 2 వేలు 
మొత్తం ఖర్చులు కలుపుకుంటే : లక్షా 42 వేలు 
ఒక వేళ భూమి సొంతదైనా కవులు రూపంలో వచ్చే ఆదాయాన్ని ముందస్తుగా పెట్టుబడి పెట్టినట్లే
ఇది సాగు నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అయ్యే ఖర్చు .
ఐతే తెలంగాణ, రాయలసీమల్లోని కొన్ని చోట్ల నీటి కొరత కారణంగా తక్కువ కాలమే కాపు వస్తుంది. అందువలన ఖర్చు కొంత తక్కువ, అలాగే పంట తక్కువ వస్తోంది.
ఇప్పుడు పంట, ఆదాయ వివరాలు చూద్దాం
సగటున 20 క్వింటాళ్లు పండుతోంది. అందులో20 శాతం తాలు గాయ(డామేజ్‌) . ప్రస్తుత సగటు రేట్ల ప్రకారం 
మంచి సరకు : 16 క్వింటాలు రూ. 5500(క్వింటా ధర)= 88వేలు 
తాలు సరుకు: 4 క్వింటాలు రూ. 1500(క్వింటా ధర) = 6 వేలు 
మొత్తం = 94వేలు 
యార్డ్‌లోని కొట్టు కమీషన్‌ 6 శాతం = రూ. 5640
పోను నికరంగా చేతికొచ్చే ధనం = రూ. 88360 
పెట్టుబడి : 142000– ఫలసాయం : 88360
నికర నష్టం: రూ. 53640 ప్రతి ఎకరాకు సగటున రైతు భరాయిస్తున్న నష్టం .
మరి గిట్టుబాటు ధర ఎంత అంటారా .
వ్యాపార ధోరణిలో చూద్దాం. పెట్టుబడి వ్యయానికి 5 రెట్లు టర్నోవర్‌ ఉండి 10 శాతం ఆదాయం అంటే 50 శాతం వేసుకొంటే మంచి వ్యాపారం కింద లెక్క . 
మేం దిక్కు మాలిన రైతులం కదా 6 శాతం కమిషన్‌ , 4 శాతం తరుగు పోను 40 పెర్సన్ట్‌ ఆదాయమే వేసుకొందాం . 
లక్షా 42వేలకు 40 శాతం రూ. 56,800 
అంటే మొత్తం లక్షా 98 వేలా 8 వందలు వస్తే తప్ప రైతుకు గిట్టుబాటు కాదు. 
అంటే రూ.12,425 సగటు ధర ఉంటే తప్ప మూడు ఎకరాల రైతు ఆరుగాలం కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదు. 
తాలుగాయలు వడ్డీకి చాలవు వదిలేయండి.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com