Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల‌ ధర్నా                                వైయ‌స్‌ జగన్‌ 216వ రోజు పాదయాత్ర ప్రారంభం                               కాకినాడ న‌గ‌రంలో సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌                               అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనం: మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారు, వాటి వెనుక ఉన్న రహష్యాన్ని బయటపెట్టాలి: అంబ‌టి రాంబాబు                               క‌ర‌కుదురు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 214వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఎన్నిక‌ల‌కు సిద్ద‌మా చంద్ర‌బాబు?: వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు పార్థ‌సార‌ధి                               మై డియ‌ర్ మార్తాండామ్ మూవీ టీజ‌ర్ విడుద‌ల చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్‌ జగన్‌ను కలిసిన 104 సిబ్బంది                  
    Show Latest News
ఎన్నికల స్టంట్లు ఈ క్యాంటీన్లు

Published on : 09-Jul-2018 | 18:37
 

అన్నకాంటీన్ల నిర్మాణ ఆకృతులపై ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ప్రభుత్వం 18 నమూనాలను పెట్టి ఓటింగ్ చేయమంది. ఒక్కోటీ ఎన్టీఆర్, చంద్రబాబు భారీ ఫొటోలతో చిన్నపాటి విల్లాలా ఉన్న ఆ డిజైన్లు చూసి ఎవరైనా విస్తు పోవాల్సిందే. పచ్చటి గ్రీన్ గార్డెన్, విశాలమైన ఎంట్రన్స్, అద్దాల తలుపులు, ఖరీదైన ఇంటిని తలపించే బిల్డింగ్...ఇలాంటి నమూనాతో కొన్ని డిజైన్లు చేసి ముందుంచారు. చెప్పండి మీకు ఎలాంటి అన్నా క్యాంటీన్ కావాలో అని ప్రకటించారు. అందులో ఏది సెలక్టయ్యిందో తెలియదు కానీ, ఇంత వరకూ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లేవీ అలామాత్రం లేవు. అమరావతిలో సచివాలయానికి చేరువలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ఓ చిన్న షెడ్డులో ఉంది. కనీసం ఆ చుట్టుపక్కల కూలిపనులు చేసుకునే వాళ్లు కూడా వచ్చి అక్కడ భోజనం తినడం లేదట. దాంతో ఎప్పుడు చూసినా ఆ క్యాంటీన్ మూతేసే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబుగారు అన్న క్యాంటీన్లమీద దృష్టిపెట్టారు. ఏమయ్యిందో ఏమో కానీ చంద్రన్న క్యాంటీన్లు అని మాత్రం అనలేదు. ఈ నెల 11 నుంచి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. 13 జిల్లాల్లో మొదటి విడతగా 100 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారట. ఎన్నికల వేళ దగ్గర పడితే గాని పేదలకు ఆహార భద్రత సంగతి గుర్తు రాలేదు చంద్రబాబుకు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్న కాంటీన్ల హామీని ఇప్పుడు లైన్లోకి తెచ్చాడు. నిజానికి ఈ పథకం తమిళనాడులో జయలలిత అమ్మ కాంటీన్ల నుంచి స్ఫూర్తి పొందింది. బాబు స్ఫూర్తి నిజమైనదైతే ఈ పాటికే రాష్ట్రమంతా అన్న క్యాంటీన్లు పని చేస్తూ ఉండాలి. కానీ బాబు లెక్కలే వేరు గదా! గతంలో ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తీ శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో దీనిపై ప్రశ్నించారు. ఎన్నాళ్లుగానో అన్నా కాంటీన్లను నిర్లక్ష్యం చేస్తున్నారని అడిగినా ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. 
తేలు కుట్టిన దొంగ
600 హామీల మేనిఫెస్టో ఏది చంద్రబాబూ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్ నిత్యం ప్రశ్నిస్తున్నారు. ప్రజా సంకల్పయాత్రలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నేళ్లుగా బాబు మర్చిపోయిన అన్న క్యాంటీన్లను గుర్తు చేసేందుకు, ఈమధ్యనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి 4రూపాయిలకే సంచార భోజన పథకాన్ని రాజన్న కాంటీన్ ద్వారా  ప్రారంభించారు. బాబు చేసిన మోసాన్ని ఎండగట్టేందుకే మంగళగిరి సెంటర్లో సంచార భోజన పథకాన్ని ప్రారంభించారు. ఇది జరిగిన కొన్నాళ్లకే బాబు అన్న క్యాంటీన్లను మళ్లీ తెరమీదకు తెచ్చాడు. 
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com