Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జగన్‌కు కలిసిన చెరుకు రైతులు                               మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి - వాసిరెడ్డి పద్మ                               బాబువి దౌర్జన్యపోకడలు-అంబటి రాంబాబు                               ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలి- స్పీకర్ కు ఎంపి వైవి సుబ్బారెడ్డి వినతి                               కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జగన్ ప్రజ సంకల్పయాత్ర                               కడపలో వైయస్‌ఆర్‌ సీపీ నిరసన                               దుర్గమ్మ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం-వెల్లంపల్లి శ్రీనివాస్                               జనం మధ్యనే జననేత నూతన సంవత్సర వేడుకలు                               పిట్టల దొర వచ్చాడు..శివన్నకు సినిమా చూపించాడు - వైయస్ జగన్ మోహన్ రెడ్డి                 
    Show Latest News
పోలవరం పై కేంద్రం సీరియస్ యాక్షన్

Published on : 05-Sep-2017 | 15:38
 

 - తప్పుడు నివేదిక ఇచ్చినందుకు పిపిఎ మెంబర్ సెక్రటరీపై బదిలీ వేటు
- ఇలాగైతే 10ఏళ్లైనా పోలవరం పూర్తి కాదని కేంద్రానికి హుస్సేన్ కమిటీ నివేదిక 
- ట్రాన్స్ ట్రాయ్ కి ఈ ప్రాజెక్టును చేసే సత్తాలేదని తేల్చిన పరిశీలనా బృందం
- పర్యవేక్షణ కూడా లేకుండా కాంట్రాక్టర్ పై వదిలేసిన చంద్రబాబు సర్కార్
- లెక్కలు తేలందే నిధులు రావ్

వరుసగా రెండు అత్యున్నత స్థాయి బృందాల పరిశీలన, నివేదికల తర్వాత కేంద్రం చంద్రబాబు సర్కార్ పోలవరం పనుల తీరుపై తీవ్రంగా మండిపడిపోతోంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మెంబర్ సెక్రెటరీ ఆర్కే గుప్తాను కేంద్ర జలవనరుల శాఖ కొద్ది రోజుల క్రితం ప్రాజెక్టు పనితీరుపై వివరణ కోరింది. పనులు శరవేగంగా సాగుతున్నాయని, 2018కే పోలవరం పూర్తవుతుందని నివేదిక పంపారు ఆర్కే గుప్తా. కాని మూడేళ్లలో కేంద్రం విడుదల చేసిన 3,364,70 కోట్ల రూపాయిల వినియోగానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఎందుకు పంపండలో వివరణ మాత్రం ఇవ్వలేదు. దీనిపై అనుమానించిన కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ నేరుగా రంగంలోకి దిగారు. మరో కీలక కమిటీని పోలవరం పరిశీలనకు పంపారు. పోలవరం కుడి, ఎడమ కాలువే కాదు, హెడ్ వర్క్స పనులన్నీ ఇష్టారాజ్యంగా నామినేషన్, సబ్ కాంట్రాక్టులా కట్టబెట్టేసి, కనీస పర్యవేక్షణ కూడా లేదని ఈ బృందం గుర్తించింది. ఇంకో పదేళ్లైనా ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదంటూ నిజానిజాలను నివేదికగా కేంద్రానికి పంపించింది. పోలవరం విషయంలో పిపిఎ మెంబర్ సెక్రెటరీ ఇచ్చిందంతా తప్పుడు నివేదికే అని  ఎస్.మసూద్ హుస్సేన్ కమిటీ తేల్చి చెప్పడంతో ఆర్కే గుప్తాపై బదిలీ వేటు వేసారు. ఆ స్థానంలో కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎస్.కె శ్రీవాత్సవను నియమించారు. 

పోలవరం అతీ గతీ
2014లో టిడిపి ప్రభుత్వం వచ్చినపపటి నుండి పోలవరం గురించి సరిగ్గా పట్టించుకున్న దాఖలాలే లేవు. కేంద్రం నిధుల కేటాయింపు గురించి తేల్చేసింది. దాంతో 2010-11 నాటి అంచనాలను సవరించి కేంద్రానికి పంపారు. 2017దాకా అంచనా వ్యయం పెరుగుతోందన్న విషయమే చంద్రంబాబుకు తెలియదునుకోవాలా?ప్రస్తుతం ఎపి ప్రభుత్వం కేంద్రానికి పంపిన అంచనా వ్యయం 58,319 కోట్లు. అంతకంతకూ పెరిగిపోతున్న అంచనా వ్యయం, పనుల్లో జాప్యం, ఇప్పటికే విడుదల చేసిన నిధుల వాడకంలో అవకతవకలూ చూసిన కేంద్రానికి చిర్రెత్తుకొచ్చింది. పాత లెక్కలు తేలితేగానీ కొత్త నిధులు రావని ఆర్ధిక శాఖ తేల్చి చెప్పింది.

కేంద్ర జల వనరుల శాఖ పోలవరంపై ఫోకస్ పెట్టడంతో బాబు ఆగమేఘాల మీద సమీక్షలు, సమావేశాలు, ప్రాజెక్టు సందర్శనలు జరిపారు. పోలవంరంలో 48 గేట్లకు గాను 5పూర్తయ్యాయి అంటూ ప్రెస్ మీట్ లో పబ్లిక్ గా పచ్చి అబద్ధాలాడారు. నిజానికి మూడు పూర్తయ్యాయి, 2 నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక పోలవరం పనులను దక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు ఇంత పెద్ద ప్రాజెక్టును హాండిల్ చేసే సత్తా లేదని, ఇప్పటి వరకూ చేసిన పనులు కూడా సబ్ కాంట్రాక్టులకిచ్చి, వారికి చెల్లింపులు జరపడం లేదని అధికారులు సిఎమ్ దృష్టికి తీసుకువెళ్లారు. అబ్బే ట్రాయ్ పనులు అద్భుతంగా ఉన్నాయని, కాంట్రాక్టు సంస్థను తప్పు పట్టక్కర్లేదని సమర్థించారు చంద్రబాబు. 
నేడు కేంద్రం నేరుగా పోలవరం పనులను సమీక్షించడంతోపాటు, జరిగిన నిధుల వ్యయంపై కూడా పూర్తి స్థాయిలో ఆరా తీయనుంది. దాంతో ఖఃగుతిన్న టిడిపి అధినేత హడావిడిగా 60సి కింద ట్రాయ్ సంస్థకు నోటీసులు జారీ చేయమంటూ ఆదేశాలిచ్చారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పూర్తి చేయడం లేదంటూ విపక్షాలు, ప్రజలు, చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా విమర్శిస్తుంటే చంద్రబాబు, ఇంకా ఆయన తోక ప్రతికలు శరవేగంతో పోలవరం, 2018కల్లా గ్రావిటీతో నీళ్లు అంటూ అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారు. ఆడలేక మద్దెల ఓడన్నట్టు పోలవరం ఆలస్యానికి కారణం ప్రతిపక్షాలని, వారే పోలవరం పనులు అడ్డుకుంటున్నారని చెప్పుకోవడం హాస్యాస్పదం.  కొసమెరుపు – కేంద్రాన్ని మభ్యపెట్టడానికి ఆడుతున్నట్రాన్స్ ట్రాయ్ సంస్థకు నోటీసుల డ్రామాకు త్వరలోనే తెరపడిపోతుందని విశ్లేషకులంటున్నారు. ఎందుకంటే ఈ సంస్థ రాష్ట్ర అధికార పార్టీకే చెందిన ఓ ఎమ్.పి ది మరి.  

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com