Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             జ‌ర్న‌లిస్టుల‌కు స్థ‌లాలిచ్చి..ఇళ్లు క‌ట్టిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే ప్రత్యేక హోదా సాధించడంతోపాటు, పోలవరం కూడా పూర్తయ్యేది: స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి                               ఉండూరు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 219వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               కాకినాడ జేన్‌టీయూ సెంటర్‌ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 217వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్ర వైఖరికి నిరసనగా మంగళవారం ఏపీ బంద్‌: వైయ‌స్ జ‌గ‌న్‌                               పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల‌ ధర్నా                                వైయ‌స్‌ జగన్‌ 216వ రోజు పాదయాత్ర ప్రారంభం                               కాకినాడ న‌గ‌రంలో సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌                               అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనం: మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                 
    Show Latest News
ముఖ్యమంత్రా ముఠా నాయకుడా?

Published on : 07-Jan-2018 | 18:02
 


నాయకుడంటే హుందాగా ఉండాలి. అతడి వెంట పదిమంది నడిచేలా ఉండాలి. ఎలాంటి కష్టమైనా ఆ నాయకుడికి చెప్పుకోవాలనిపించాలి. చెప్పుకుంటే ఆ కష్టానికి ఓదార్పు దొరుకుతుందన్న ఆశ కలగాలి. మొత్తంగా నాయకుడంటేనే ఓ నమ్మకంలా ఉండాలి. ఒకప్పుడు రాష్ట్రం అలాంటి నాయకుడిని చూసింది. రాష్ట్ర  ప్రజలు అలాంటి నాయకుడిని చూసారు. నేత అంటే ఇలా ఉండాలి, మమ్మల్ని నడిపించేలా, మాకోసం నడిచేలా ఉండాలని కోరుకున్నారు. 
 ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నఆ నాయకుడు దురదృష్టవశాత్తూ దూరమైపోయాడు. మీకోసం వస్తున్నా అంటూ చంద్రబాబు వచ్చాడు. నిలువెత్తు నిజాయితీని, నిండైన చిరునవ్వుని చూసి, నమస్తే అక్కయ్యా, నమస్తే చెల్లెమ్మా అంటూ పిలిచే ఆత్మీయమైన పిలుపును విన్న ఆంధ్రరాష్ట్ర ప్రజలకు బాబు తీరు మనోవేదనకు కారణమైంది. రాజన్న పేరును ప్రజల మనోఫలకంలోంచి చెరిపేయాలని బాబు తన పేరును తానే చంద్రన్నగా  మార్చుకున్నాడు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే నక్క పులి అవగలదా. ప్రజలంటే అభిమానం లేని వాళ్లు తెచ్చిపెట్టుకున్న ప్రేమను ఎన్నాళ్లు కురిపించగలరు? బాబు నిజస్వరూపం కొన్నాళ్లకే బైట పడింది. సమస్య ఇది అని వచ్చిన వాళ్లను చంద్రబాబు తన స్టైల్లో బెదిరించి పంపిస్తుంటాడు. ఎన్నికల ముందు వరకూ నేను మారిపోయిన మనిషిని అన్న బాబు ఎన్నికలై అధికారంలోకి రాగానే అసలు రంగు బైట పెట్టాడు. 

గతంలోనూ బాబు నోటితీట చూపించాడు

నంద్యాల ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం అధినేత చేపట్టిన యాత్రలో ఓ వ్యక్తి చంద్రబాబును ప్రశ్నించే సాహసం చేసాడు. అంతే పబ్లిక్ గా ఫైర్ అయిపోయాడు బాబు. తమాషాలు చేస్తున్నావా? అంటూ ఆ వ్యక్తిని నోటికొచ్చినట్టు తిట్టాడు. మా కార్యకర్తలకు చెబితే నీ అంతు చూస్తారని బెదిరించాడు. పేదవాడు ప్రశ్నిస్తే ఇంత దారుణంగా మాట్లాడతారా! అంటూ ఆశ్చర్యపోయారు అక్కడున్న ప్రజానీకం. అంతకు ముందు కూడా రైతుల సభలో రుణమాఫీ గురించి మాట్లాడిన రైతులను మీరు ప్రతిపక్ష పార్టీవాళ్లా? నా సభలో గొడవ చేయడానికి వస్తే ఊరుకోనంటూ విరుచుకుపడ్డారు. మరో సారి నాకు ఓట్లు వేయకుంటే నేను వేసిన రోడ్లపై నడవద్దని, నేనిచ్చే ఫింఛను తీసుకోవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసారు. ఇక నిన్న ఎన్నికల హామీలు నెరవేర్చాలని కోరినపాపానికి మత్స్యకారులను ఇష్టం వచ్చినట్టు బెదిరించారు చంద్రబాబు. జన్మభూమి  కార్యక్రమంలో భాగంగా విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రిని కలిసి మత్స్యకారులను ఎస్టీల్లో చేరుస్తామని చేసిన హామీని నిలబెట్టుకోవాలంటూ మత్స్యకారుల ప్రతినిధులు, టిడిపి ఎమ్మెల్యే చంద్రబాబును కలిసారు. ధర్నాలు మానేసి, టెంట్లు పీకేయకపోతే తోలుతీస్తా అంటూ వారిని నానా దుర్భాషలాడారు చంద్రబాబు. చివరికి సొంత ఎమ్మెల్యేను కూడా వారి ముందు చిన్నచూపు చూసేట్టు మాట్లాడి పంపించారు. దీక్షలు విరమించకపోతే మీ ప్రాంతాలకు రోడ్డు కూడా వేయను, ఎవరి చెప్పుకుంటారో చెప్పుకోండి అని వారిచ్చిన వినతిపత్రాన్ని కూడా తీసుకోకుండా అక్కడ నుంచి జన్మభూమి కార్యక్రమానికి వెళ్లిపోయాడు బాబు. 

ఆయనలాగే తమ్ముళ్లూ

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదన్న చందంగా బాబులాంటి ప్రబుద్ధులే ఆయన మంత్రి గణం. మహిళలపై దాడులు, కబ్జాలు, ఇసుక దందాలు, మాఫియాలు చాలక ప్రజల పై నోరు పారేసుకోవడంలోనూ వాళ్లు ముఖ్యమంత్రినే ఆదర్శంగా తీసుకుంటున్నారు. దళితులు శుభ్రంగా ఉండరు, చదువుకోరు అని తన వాచాలత్వాన్ని బైట పెట్టుకున్నాడు మంత్రి ఆదినారాయణ. ఇక ఆయన మంత్రి గణంలో జెసి నోటికైతే అడ్డు అదుపూ ఉండదు. ఒక్కోసారి ఆ నాలుక తిరిగి దేశం నేతలనే టార్గెట్ చేస్తుంటుంది. 

బాబుగారి వియ్యంకుడు 

చంద్రబాబుగారి వియ్యంకుడు బాలయ్య కూడా ఏం తక్కువ తినలేదు. ఇష్టానుసారం మాట్లాడటమే కాదు, చేయి చేసుకోవడం కూడా ఆయనకు అలవాటు. తన కింద పని చేసేవాళ్లనే కాదు, చివరికి అభిమానులపై కూడా చేయి చేసుకునేంత షార్ట్ టెంపర్ బాలయ్యది. 
అడుగడుగునా ప్రజలను అవమానిస్తూ, అధికార దురహంకారాన్ని ప్రదర్శిస్తున్న చంద్రబాబు, ఇంకా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అందుకే జన్మభూమి కార్యక్రమాల్లోనూ, మునుపు జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలోనూ ప్రజలు వారిని నిలేసి కడిగేసారు. ముఖ్యమంత్రిగా కాక ముఠానాయకుడిగా మారిన బాబు పద్ధతిని ప్రజలు అనుక్షణం ఛీదరించుకుంటునే ఉన్నారు. 

ప్రజలంటే అధికారం కింద నలిగే బానిసలు కాదు. ప్రజలతో మాట్లాడటం అంటే నియంతృత్వ ధోరణిలో వారిపై అజమాయిషీ చెలాయించడం కాదు. ప్రజలంటే రాజకీయ నేతను ప్రజాధినేతగా, ప్రజానాయకుడిగా మార్చే ప్రజాస్వామ్య స్వరూపాలు. వారి కష్టాలను, సమస్యలను సావధానంగా విని, తగిన పరిష్కారాలు చూపడం నాయకుడి విధి. ముఖ్యమంత్రి పీఠం అంటే అధికార పీఠం అని, ప్రజలంటే తను చెప్పినట్టు వినే బానిసలనీ భావించే ఈ పెత్తందారు పరిపాలనకు రోజులు మూడాయని ఆవేశంతో ఆక్రోశంతో పిడికిలి బిగించి మరీ చెబుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 

 
Labels : YSRCP, YS Jagan, NCBN, TDP,
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com