Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 211వ రోజు ప్రారంభం                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన మాజీ మంత్రి మ‌హిధ‌ర్‌రెడ్డి                               అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                               రాయవరం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 210వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                                పార్లమెంట్, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమర్థిస్తుంది: విజయసాయిరెడ్డి                                రాజ్య‌స‌భ డిప్యూటి చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ద‌తిచ్చే ప్ర‌స‌క్తే లేదు: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               లా క‌మిష‌న్‌ను క‌లిసిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు విజ‌య‌సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు                               201వ రోజు ప్రజాసంకల్పయాత్రకు వర్షం అంతరాయం                 
    Show Latest News
దొపిడీకి మరో కొత్త పథకం

Published on : 13-Sep-2017 | 16:14
 

– అమ్మకు వందనం పేరుతో వసూళ్లకు శ్రీకారం
– ఓటేయని పిల్లల్నీ వదలని మేధావి ముఖ్యమంత్రి
– ఇప్పటికే  అమరావతి కోసం వసూలు చేసి అభాసుపాలు
– గతంలో ఇటుకలు అమ్మిన లెక్కలు తేల్చని వైనం

ఓటేస్తే రుణమాఫీ చేస్తానని రైతులను డ్వాక్రా మహిళలను, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులను.. ఇలా ఏ వర్గం వారినీ బాబు వదల్లేదు. ఆఖరికి పాఠశాల పిల్లలను కూడ వదలడం లేదు.  అధికారం చేతిలో ఉంది కదా ఏం చేసినా చెల్లుతుందనే నిరంకుశత్వం చంద్రబాబులో రోజురోజుకు పెరిగిపోతుంది. సొంత అవసరాల కోసం కోట్లు ఖర్చు చేసే బాబు.. ఓటేసి గెలిపిచించిన ప్రజలంటే ఎప్పటికీ చిన్నచూపే. ఇప్పటికే పలు సందర్భాల్లో దీనిని ప్రూవ్‌ చేసుకున్న బాబు ఇప్పుడు ఏకంగా విద్యార్థులను కూడా వదలడం లేదు.  ఓటు హక్కు లేని పిల్లలను ఎలా దోచుకోవాలా అని ఆలోచించి ఓ పథక రచన చేశారు. 

అమ్మకు వదంనం పేరుతో దోపిడీ
చంద్రబాబు కొత్తగా ‘అమ్మకు వందనం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం కోసం విరాళాలు సేకరించాలని విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి 2.5 కోట్లు అవసరం అవుతాయని.. 1.25 కోట్లు ప్రభుత్వం ఇస్తుందని.. మిగిలిన మొత్తాన్ని దసరాలోపు ఇంటింటికీ తిరిగి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమకూర్చుకోవాని సూచించారు. ఇదంతా దసరాలోపు జరగాలనేది ఉత్తర్వుల సారాంశం. గతంలోనూ చంద్రబాబు ఇలాగే చేశాడు. అమరావతి నిర్మాణం కోసమంటూ ఒక్కో విద్యార్థి నుంచి పది రూపాయలకు తగ్గకుండా చందాలు వసూలు చేయాలని ఉత్తర్వులిచ్చి అభాసుపాలయ్యారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. అప్పటికే చాలా మంది నుంచి వసూలు చేశారు. పింఛన్‌దారులు, డ్వాక్రా మహిళల నుంచి కూడా అమరావతి నిర్మాణం కోసమంటూ ఇటుకల కొనుగోలు పేరుతో డబ్బులు గుంజారు. అయితే ఎన్ని ఇటుకలు కొన్నారు.. ఎంత వసూలైంది.. దానికి దేనికి ఖర్చు చేశారనే లెక్కలు మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడా వెబ్‌సైట్‌ కనీసం పనిచేయకపోవడం విడ్డూరం. 

విద్యార్థికి స్కాలర్‌ ఇస్తామన్న జగన్‌..
ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ఇటీవలే ప్లీనరీ సందర్బంగా పాఠశాల విద్యార్థులందరికీ స్కాలర్‌షిప్పులు ఇస్తామని ప్రకటించారు. 1 నుంచి 5 వరకు చదివే విద్యార్థులకు 500, 5 నుంచి 10 వరకు 750, ఇంటర్‌ విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయలు. ప్రతి కుటుంబానికి ఇద్దరు విద్యార్థుల వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం టీచర్లను గ్రామాల్లో తిప్పి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజల నుంచి  నిధులు సమరూర్చాలనుకోవడం దారుణం. ఆయన సొంత బస్సు కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేశాడు. రెండు చపాతీలు తినడానికి నంద్యాలకు సొంత ప్యాంట్రీ వాహనాన్ని రప్పించుకున్నాడు. కానీ అమ్మకు వందనం కార్యక్రమం ఎందుకు పెట్టారో తెలీదు.. ఏం చేస్తారో తెలీదు. కానీ వసూళ్లకు తెర తీసి వసూల్‌ రాజా పేరును సార్థకం చేసుకుంటున్నాడు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com