Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                               30న అనంత‌పురంలో న‌య వంచ‌న దీక్ష: వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                  
    Show Latest News
బీజేపీ..టీడీపీ రెండూ అన్యాయం చేశాయి
– వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు

Published on : 17-Feb-2018 | 14:33
 
–  బడ్జెట్‌పై సీఎం అభిప్రాయం చెప్పకుండా తిరుగుతున్నారు
– నాడు మోడీ ప్రతిష్టతో అధికారంలోకి రావచ్చు అని కలిసి పోటీ చేశారు.
– హోదాతో సమానమైనవన్నీ వచ్చేశాయని బాబు  గతంలో చెప్పారు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ను బీజేపీ, టీడీపీ పార్టీలు కలిసి అన్యాయం చేశాయని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. నాలుగేళ్లు కేంద్రంతో కలిసి భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఇప్పుడు బీజేపీ చేసిన అన్యాయం కనిపించిందా అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి కూడా ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తుందని చెబుతూనే ఉన్నామని, అయితే నాలుగేళ్లుగా ఏ నాడు బీజేపీని ఒక్క మాట కూడా అనని చంద్రబాబు ఇప్పుడు అజ్ఞాతంలో ఉండి లీకులిస్తూ పోరాటం చేస్తున్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టి 16 రోజులైంది. ఇంతవరకు చంద్రబాబు మీడియా ముందుకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని, మరోవైపు ఆయన కార్యాలయం నుంచి రకరకాల లీకులతో కాలయాపన చేస్తున్నారని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఈ బడ్జెట్‌ కంటే ముందుకు 2017, జనవరిలో కేంద్రంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన 3 గంటల్లోనే చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి మనమే ఎక్కువ సాధించామని పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడేందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. మూడు సంవత్సరాలు కలిసి పని చేసిన ఈ ప్రభుత్వంలో ఎప్పుడేమో ఒక్క నయపైసా కూడా విడుదల చేయడం లేదని చెబుతున్నారన్నారు. ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. సాక్షాత్తు మీరే గతంలో మాట్లాడిన మాటలు ప్రజలు నమ్మవద్దా అని ప్రశ్నించారు. 16 రోజులు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదన్నారు. దేశంలో టీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నాడు నరేంద్ర మోడీ ప్రతిష్ట తీసుకోకుంటే అధికారంలోకి రాలేమేమో అని బీజేపీతో జత కట్టారు.  బీజేపీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందని వైయస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి చెబుతునే ఉందన్నారు. మన తరఫున సీఎం పోరాటం చేయడం లేదని మొదటి నుంచి చెబుతున్నామన్నారు. ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమని అందరూ చెబుతుంటే..మీరేమో ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించారన్నారు. ప్రత్యేక హోదా కోసం వీధి వీధిన, వాడవాడన వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తునే ఉన్నామన్నారు. అప్పుడు టీడీపీ నేతలు హేళన చేశారన్నారు. ఇప్పుడు ఏం రాలేదని టీడీపీనే అంటుందన్నారు. అసలు మీ స్ట్రాటజీ ఏంటని ప్రశ్నించారు. బీజేపీని వదిలించుకునే ప్రయత్నంలో మీకు అనుకూలమైన మీడియాతో బీజేపీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ కచ్చితంగా అన్యాయం చేసిందని, అందులో టీడీపీ భాగస్వామి అని మండిపడ్డారు. ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం టీడీపీ  ఏ నాడు పని చేయలేదన్నారు. కేంద్రంలో ఉన్నట్లు నటించకపోతే మన పీక నొక్కేస్తారనే భయంతోనే బీజేపీతో కలిసి టీడీపీ పనిచేస్తుందని ఫైర్‌ అయ్యారు. ఇప్పటికైనా మీ డ్రామాలు కట్టి పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ఎంపీల రాజీనామాను స్వాగతించి, మీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించాలని ధర్మాన టీడీపీకి సూచించారు. లేదంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరని హెచ్చరించారు.
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com