Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన పొగాకు రైతులు..గిట్టుబాటు ధ‌ర కోసం పోరాడుదామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు                               నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉండి.. ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు: ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               బీజేపీ, టీడీపీ రెండూ క‌లిసి ఏపీకి అన్యాయం చేశాయి: మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదు: పార్ధ‌సార‌ధి                               ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఎత్తడానికి కూడా చంద్రబాబు భ‌య‌ప‌డుతున్నారు: పార్ధ‌సార‌ధి                               ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు గుంటూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌                               బంగార‌క్క‌పాలెం నుంచి 90వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్ర‌కాశం జిల్లాలోకి అడుగుపెట్టిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం                               హోదాపై పోరాటంలో మాతో కలిసి రండి.. మా ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలి: వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి ఫిర్యాదు

Published on : 17-Jul-2017 | 15:35
 

  • సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ను కలిసిన వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు
  • నంద్యాల్లో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్న సీఎం
  • బాబు బెదిరింపుల వీడియో పుటేజీని ఈసీకి అందజేసిన ఎంపీలు
న్యూఢిల్లీ: అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు ప్రధాన ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) ఏకే జ్యోతిని కోరారు. నంద్యాల ఓటర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారని సీఈసీకి ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయకుంటే అభివృద్ధి పనులు ఆపేస్తామని, మేము వేసిన రోడ్లపై ఎలా నడుస్తారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వీడియో పుటేజీని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనేందుకు చంద్రబాబు రూ. 50 లక్షలు వెచ్చించారని, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వీడియో, ఆడియో ఆధారాలతో దొరికిపోయిన వైనాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అప్రజాస్వామిక, అనైతిక చర్యలకు పాల్పడుతున్న టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఈసీని కోరారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే నంద్యాలలో 10 మంది మంత్రులు తిష్టవేసి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఫ్రీ అండ్‌ ఫెయిర్‌ పోల్‌ జరిగే విధంగా సెంట్రల్‌ ఫోర్స్‌ను పంపించాలని ఈసీని కోరామన్నారు. వీటన్నింటిపై ఎలక్షన్‌ కమిషన్‌ సానుకూలంగా స్పందించారన్నారు. అధికార పార్టీకి కొంత మంది ఒత్తాసు పలుకుతున్న పోలీసులు, ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com