Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్‌ జగన్‌ 216వ రోజు పాదయాత్ర ప్రారంభం                               కాకినాడ న‌గ‌రంలో సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌                               అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు నిదర్శనం: మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి                               బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, టీడీపీ రాజగురువుతో ఎందుకు చర్చలు జరిపారు, వాటి వెనుక ఉన్న రహష్యాన్ని బయటపెట్టాలి: అంబ‌టి రాంబాబు                               క‌ర‌కుదురు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 214వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఎన్నిక‌ల‌కు సిద్ద‌మా చంద్ర‌బాబు?: వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు పార్థ‌సార‌ధి                               మై డియ‌ర్ మార్తాండామ్ మూవీ టీజ‌ర్ విడుద‌ల చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్‌ జగన్‌ను కలిసిన 104 సిబ్బంది                                బుర‌ద‌మ‌య‌మైన రోడ్ల‌పైనే కొన‌సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ 213వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌                 
    Show Latest News
వైయస్‌ జగన్‌ జనతా క్యాంటీన్‌ ప్రారంభం

Published on : 14-Dec-2017 | 12:32
 



ప్రజా సంక్షేమానికి వైయస్‌ఆర్‌ సీపీ కట్టుబడి ఉంది
అన్నా క్యాంటీన్‌లు పెడతామని చంద్రబాబు మోసం 
హిందూపురం వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని హిందూపురం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌ అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తామని ఆ విషయాన్ని విస్మరించిందని మండిపడ్డారు. నవీన్‌ నిశ్చల్‌ ఆధ్వర్యంలో హిందూపురంలో వైయస్‌ జగన్‌ జనతా క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి డాక్టర్‌ సాయిప్రసాద్‌ ట్రస్టు ఆర్థిక సహాయంతో క్యాంటీన్‌లను నిర్వహించడం జరుగుతుందన్నారు. పేదలకు తక్కువ ధరకు టిఫిన్, భోజనం అందజేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు చిన్న మార్కెట్‌ వద్ద, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద క్యాంటీన్‌ అందుబాటులో ఉంటుందన్నారు. రూ. 9కే భోజనం అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో లేపాక్షి, హిందూపూర్, చిల్మతూరు మండలాల్లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గతంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన నియోజకవర్గంలో రాజన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే..

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com