Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నంద్యాలకు దొంగల ముఠా నాయకుడు వస్తున్నాడు..ప్రజలారా బాబు మోసపూరిత మాటలు నమ్మవద్దుః బొత్స                               వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి                               దేవరపల్లి ఘటనపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కఠారియాకు ఫిర్యాదు చేసిన ఎంపీ వైవీ                               బాబు తన రాజకీయ స్వార్థం కోసం దళితులపై దాడులు చేయిస్తున్నాడుః బత్తుల                               చంద్రబాబు తన పాలనలో కులవివక్షను పెంచిపోషిస్తున్నాడుః బత్తుల                               రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్ నాథ్ కోవింద్ ఘన విజయం..వైయస్ జగన్ హర్షం                               జగనన్న వస్తే టీడీపీకి పుట్టగతులుండవని బాబు భయపడుతున్నాడుః భూమన                               వైయస్‌ఆర్‌ దానకర్ణుడు... చంద్రబాబు కుంభకర్ణుడుః భూమన                               వైయస్సార్సీపీ నుంచి గెలిచి బాబు సంకలో దూరి మంత్రులుగా కొనసాగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేః అంబటి                 
    Show Latest News
చంద్రబాబు నంద్యాలలో పడుకున్నా వైయస్సార్సీపీదే విజయం

Published on : 17-Jul-2017 | 15:51
 

కర్నూలు: నంద్యాలలో ప్రభుత్వం బీసీలను  టార్గెట్‌ చేసిందని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య ఆరోపించారు. బీసీ కౌన్సిలర్‌పై పోలీసుల దాడిని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఖండించకపోగా,  దాడిని సమర్థించడం దారుణమన్నారు. అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు నంద్యాలలో పడుకున్నా ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత జీవోలన్నీ చిత్తు కాగితాలుగా మారతాయన్నారు.  నంద్యాలను సీడ్‌ క్యాపిటల్‌గా చేస్తామన్న హామీ ఏమైందని బీవై రామయ్య బాబును సూటిగా ప్రశ్నించారు.

ట్రాక్టర్లు, ఇళ్ల పంపిణీలో అవినీతి కంపు కొడుతోందన్నారు. ఎక్కువ ధరతో ట్రాక్టర్లు కొనుగోలు చేసి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇళ్ల నిర్మాణంలోను అదే పరిస్థితి అని, కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలని బీవై రామయ్య డిమాండ్‌ చేశారు.  కేశవరెడ్డి కేసు మాఫీ కోసమే ఆదినారాయణరెడ్డి పార్టీ మారారని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

Emperor of Corruption YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP
Prajalachentha Epaper Youtube
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com