Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పారాది నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 290వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
హోదా కోసం ఉద్యమ బాట
మార్చి 1న జిల్లా కలెక్టరేట్లు, 5 న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాలు

Published on : 12-Feb-2018 | 22:15
 


పెద్దకొండూరు, (శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) : ప్రత్యేక హోదా సాధనకు మరోసారి ఉద్యమబాట పట్టాలని వైయస్ ఆర్ సీపీ నిర్ణయించింది. ప్రజాసంకల్పయాత్రలో ఉన్న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి బస చేసిన శిబిరం లో సోమవారం రాత్రి నిర్వహించిన పార్టీ కీలక సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు సమావేశమై తదుపరి కార్యాచరణను ఖరారు చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ఎంపిలు, ఎంఎల్ఎలు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.  ‘ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజితో మోసపోవద్దు’ అనే నినాదంతో మార్చి 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాలని కార్యాచరణను రూపొందించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను నిరాకరించడం, అందుకు వంత పాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తందానా అనడంపై పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ రెండు గంటల పాటు చర్చించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి మీడియాకు వివరించారు. 

అందులోని అంశాలు

- మార్చి 1న అన్ని కలెక్టరేట్ల ముందు పార్టీ కార్యకర్తలు, సమన్వయకర్తలు అందరూ కలిసి ధర్నా చేయాలని నిర్ణయం. 
- ప్రత్యేక హోదా మన హక్కు ప్యాకేజీతో మోసపోవద్దు అనే నినాదం.
- మార్చి 5న ప్రత్యేక హోదా మన హక్కు. ప్యాకేజీ మాకొద్దు..అంటూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలతో ధర్నా.
- మార్చి 3న పార్టీ కీలక నేతలందరూ ఢిల్లీ పర్యటన...పర్యటనను వైయస్ జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. 

- ప్రత్యేక హోదా సాధించేంత వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని, గత మూడేళ్లుగా  వైయస్ జగన్ నాయకత్వంలో పోరాడుతున్నామన్నారు. గతంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ధర్నా చేయడమే కాకుండా అరెస్ట్ కూడా అయిన సంగతిని గుర్తు చేశారు.

- అనేకసార్లు  జగన్ ఆమరణ దీక్షలు చేశారని, యువభేరీ కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక హోదా లాభాలను ప్రతి ఒక్కరికీ వివరించారన్నారు. 
- ప్రత్యేక హోదా కోసంవైయస్ జగన్ పిలుపుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పలుమార్లు బంద్ లు నిర్వహించటం జరిగిందన్నారు.
- ప్రత్యేక హోదా మాత్రమే సంజీవని ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోంది. ఈ  ఆందోళనలు పోరాటాలు ప్రజల మన్ననలు పొందాయని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

- ప్రత్యేక హోదా మన హక్కు. ప్యాకేజీతో మోసపోవద్దని నినాదాలతో పోరాటాలకు శ్రీకారం చుట్టిందని స్పష్టం చేసిన భూమన. 
- ప్రజల దీనావస్థలు చూసి వారికి భరోసా కల్పిస్తూ..  వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. 
- మార్చి 3న పార్టీ నేతలు అందరూ వైయస్ జగన్ ను కలుస్తారని వివరించారు. 

వంచిస్తున్న చంద్రబాబు

- ప్రత్యేక హోదాతో మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు సిద్ధిస్తాయి. 
- ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక హోదా ముద్దు. వద్దని మరో రోజు. సంజీవని ఒక రో జు.. సంజీవనా అని మరో రోజు. ప్యాకేజీతో హోదా కన్నా ప్రయోజనాలు వచ్చాయని కల్లబొల్లి కబుర్లు చెబుతూ చంద్రబాబు ప్రజల్ని వంచిస్తున్నారు. 
- ప్రత్యేక హోదాను సాధించే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని భూమన తెలిపారు. 
- పోరాటం ఫలితాల కోసమే చేస్తాం. ప్రభుత్వం మీద ప్రభుత్వాలు చేస్తున్న మోసాల మీద తిరగబడటం ప్రజాస్వామ్య లక్షణం. పేద ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలన్న లక్ష్యం ప్రతిపక్ష నేత జగన్ కు  ఉంది. 
- ఎక్కడైతే శ్రీ వేంకటేశ్వరుని పాదాల సాక్షిగా 15 సంవత్సరాలు హోదా ఇస్తామంటూ.ప్రకటించారో అక్కడే. ప్రత్యేక హోదాకు తూట్లు పొడిచారని అన్నారు. 
-ఉద్యమాలు, ఆందోళనలకు  ఫలితం రానటువంటి పరిస్థితుల్లో మా పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని  వైయస్ జగన్ స్పష్టం చేశారన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com