ఢిల్లీ: ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్సీపీ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలువనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ఎంపీలు రాష్ట్రపతిని కలువనున్నారు. ప్రత్యేక హోదా సాధనకు ఇప్పటికే పలుమార్లు వైయస్ జగన్ రాష్ట్రపతిని కలిశారు. కాగా, ఇటీవల ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీ వేదికగా వైయస్ఆర్సీపీ నేతలు ఆమరణ దీక్ష చేశారు. వారి దీక్షకు మద్దతుగా ఏపీ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇవాళ ఏపీ బంద్ నిర్వహించారు. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు మరోమారు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వైయస్ఆర్సీపీ పోరాటం చేస్తోంది.