Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఏపీకి జ‌రిగిన అన్యాయానికి నిర‌స‌న‌గా ఏప్రిల్ 30న వంచ‌న దినం : వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌లు బొత్స సత్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               142వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నూజివీడు శివారు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 141వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఈద‌ర శివారు నుంచి ప్రారంభం                               చంద్రబాబు చేస్తున్నది దొంగ దీక్ష. ఇదే దీక్ష ఢిల్లీలో చేసి ఉంటే ఉపయోగం ఉండేది: రోజా                               25 మంది ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే కేంద్రం దిగి వచ్చేది. ఇలాంటి దొంగ దీక్షలు, దగా దీక్షలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు: ఎమ్మెల్యే రోజా                                140వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర శోభ‌నాపురం శివారు నుంచి ప్రారంభం                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎంపీలు                               సాయంత్రం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లువ‌నున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు                               మైల‌వ‌రం శివారు నుంచి 139వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                 
    Show Latest News
బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర
వైయస్‌ఆర్‌ సీపీ విజయవాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు ఉదయభాను

Published on : 15-Apr-2018 | 12:16
 


విజయవాడ: ప్రత్యేక హోదా సాధన కోసం నిర్వహించే బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు చంద్రబాబు సర్కార్‌ కుట్రలు పన్నుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మండిపడ్డారు. విజయవాడ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 16వ తేదీన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన కమిటీ ఏపీ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు వస్తున్న మద్దతును చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్నారు. బంద్‌లో పాల్గొంటే కేసులు పెడతామని పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఇప్పటికీ పలువురు వైయస్‌ఆర్‌ సీపీ నాయకులకు నోటీసులు సైతం అందజేశారన్నారు. ఒక వైపు ప్రత్యేక హోదా కావాలంటూనే మరో వైపు దాన్ని కాలరాసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు, యువత, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com