Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు న్యాయ‌వాదుల సంఘీభావం                               నూక‌వ‌రం నుంచి ప్రారంభమైన 91వ రోజు ప్రజాసంకల్పయాత్ర                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన పొగాకు రైతులు..గిట్టుబాటు ధ‌ర కోసం పోరాడుదామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు                               నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉండి.. ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు: ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               బీజేపీ, టీడీపీ రెండూ క‌లిసి ఏపీకి అన్యాయం చేశాయి: మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదు: పార్ధ‌సార‌ధి                               ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఎత్తడానికి కూడా చంద్రబాబు భ‌య‌ప‌డుతున్నారు: పార్ధ‌సార‌ధి                               ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు గుంటూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌                               బంగార‌క్క‌పాలెం నుంచి 90వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
బాబుకు బుద్ధి చెబుదాం

Published on : 11-Oct-2017 | 18:05
 

భీమునిపట్నం (విశాఖ‌): ఎన్నిక‌ల ముందు 600ల‌కు పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క‌టి నెర‌వేర్చ‌ని చంద్ర‌బాబుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బుద్ధి వ‌చ్చేలా చేద్దామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార‌ట్ఈ సేవాద‌ళ్ అధ్య‌క్షుడు మారుప‌ల్లి రాము పిల‌పునిచ్చారు.  బుధవారం ఇక్కడ 15వవార్డు తోటవీధిలో నిర్వహించి వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.  చంద్ర‌బాబు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌న్నారు.  జగన్‌ ముఖ్యమంత్రి అవ్వాలని, ఆయనద్వారానే తమ సమస్యలు తీరతాయని అందరు భావిస్తున్నారని తప్పకుండా వారి కోరిక నెరవేరుతుందని అన్నారు. ఇందులో బూత్‌ కన్వీనర్‌ మైలిపల్లి అప్పలరాజు, బూత్‌ ఏజెంట్‌లు చింతపల్లి పద్మరాజు, కర్రి అప్పారావు, నాయకులు గేదెల సత్యన్నారాయణ, పెమ్మి శ్రీను, బుగత ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
-----------------------

వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌లో 100 మంది చేరిక‌
అనంతగిరి(విశాఖ‌):  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు మిథుల స‌మ‌క్షంలో భీమ‌వ‌రం, గుమ్మ‌కోటకు చెందిన 100 మందికి పైగా గిరిజ‌నులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొన‌పురం పంచాయతీలో వైయ‌స్ఆర్ కుటుంబం కార్యక్రమం జరిగింది. ఈ సంద‌ర్భంగా జమిథుల మాట్లాడుతూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే గిరిజ‌నాభివృద్ధి సాధ్య‌మ‌న్నారు. నవరత్నాలు వైపే గిరిజనులు మొగ్గు చూపుతున్నార‌న్నారు. అభివృద్ధి చేయ‌ని టీడీపీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో ముఖ్య సమస్యలు విద్య, వైద్యం, రహదారి సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు ఎన్నో ఉన్నప్పటికి గిరిజనులకు, ఎంతో అభివృద్ధి చేశామని ప్రకటనలు  చేయ‌డం, ఒక్క టీడీపీ ప్రభుత్వనికే చేందుతుంద‌న్నారు. మౌలిక సదుపాయాలు నోచుకోక గిరిజనులు దుర్భరజీవనంలో సాగిస్తున్నారు. మూడేళ్ల పాల‌న‌లో గిరిజన సంక్షేమాన్ని విస్మరించారు పేర్కొన్నారు.
-----------------------
ఉత్సాహంగా వైయ‌స్ఆర్ కుటుంబం
మునగపాక (విశాఖ‌):  మండ‌ల వ్యాప్తంగా వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మాలు ఉత్సాహంగా జ‌రుగుతున్నాయి. పలు గ్రామాల్లో ఇప్పటికే వైయ‌స్ఆర్ కుటుంబం ముగియ‌గా, మరికొన్ని గ్రామాల్లో దాదాపుగా పూర్తి కావచ్చింది. దీనిలో భాగంగా మండలంలోని నారాయుడుపాలెంలో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కోరుకొండ రాజు, బూత్‌కమిటీ సభ్యులు సంజీవరావు తదితరులు ఇంటింటికీ వెళ్లి నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి రావడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ చంద్రబాబు మోసాలను నమ్మరాదంటూ ప్రచారం చేశారు. ఈ సందర్బంగా 9121091210 ఫోన్‌నెంబర్‌కు పలు కుటుంబాలనుంచి మిస్డ్‌కాల్స్‌ ఇప్పించారు. అలాగే మహానేత రాజన్న స్టిక్కర్లను గోడలపై అంటించారు.అలాగే కాకరాపల్లి, మూలపేట, వెంకటాపురం, రామగిరి, చూచుకొండ, రాజుపేట తదితర గ్రామాల్లో కూడా వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com