Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జగన్‌కు కలిసిన చెరుకు రైతులు                               మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి - వాసిరెడ్డి పద్మ                               బాబువి దౌర్జన్యపోకడలు-అంబటి రాంబాబు                               ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలి- స్పీకర్ కు ఎంపి వైవి సుబ్బారెడ్డి వినతి                               కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జగన్ ప్రజ సంకల్పయాత్ర                               కడపలో వైయస్‌ఆర్‌ సీపీ నిరసన                               దుర్గమ్మ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం-వెల్లంపల్లి శ్రీనివాస్                               జనం మధ్యనే జననేత నూతన సంవత్సర వేడుకలు                               పిట్టల దొర వచ్చాడు..శివన్నకు సినిమా చూపించాడు - వైయస్ జగన్ మోహన్ రెడ్డి                 
    Show Latest News
ప్రజారోగ్యం కాదు ఓట్లకు గాలం

Published on : 04-Jan-2018 | 12:54
 

చంద్రబాబుకు ఉన్నట్టుండి ప్రజల సంక్షేమం గుర్తొచ్చింది. మీరు ఏ నీళ్లు తాగుతున్నారో, ఏ గాలి పీలుస్తున్నారో, ఎలాంటి భూమిలో పండిపస్తున్నారో అన్నీ తెలసుకుంటున్నాను అని చెబుతున్నారు. నేడు పులివెందులలో జరిగిన చంద్రబాబు జన్మభూమి సభలో మాట్లాడుతూ బాబుగారు పై మాటలు చెప్పారు. గత తొమ్మిదేళ్ల పాలనలోనూ, ఈ నాలుగేళ్ల పరిపాలనలోనూ కలగని ఆలోచనలు బాబుకు ఇప్పుడెందుకు కలిగాయి అంటే అందుకు కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర వల్లే అని ఈజీగా అర్థం అవుతుంది. 

అడుగడుగునా ప్రతిపక్ష నేతకు లభిస్తున్న అపూర్వమైన ఆదరణ చూస్తుంటే చంద్రబాబుకు అసూయతో పాటు భయం కలుగుతోంది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ అడ్డాగా, జగన్ నియోజక వర్గంగా అందరూ పిలుచుకునే పులివెందులలో జన్మభూమి మీటింగ్ పెట్టారు బాబు. 

ఏ ఆసుపత్రికెళ్లినా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులుండేలా, దానిబట్టి వైద్యం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు టైమ్ కి డ్యూటీ చేసేందుకు బయో మెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేసామన్నారు. డాక్టర్లు బయో మెట్రిక్ లో హాజరు నమోదు చేస్తే ప్రజారోగ్యం బాగు పడుతుందా? అంటే దానికి చంద్రబాబు జవాబివ్వరు. సామాన్యులకు ఖరీదైపోయిన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చే ఆరోగ్యశ్రీని అన్ని రకాల వ్యాధులకూ వర్తింప చేయాలనే ఆలోచన కలగదు. వెయ్యిరూపాయిలు దాటిన ప్రతి అనారోగ్య సమస్యకూ ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తామని ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఎపి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించారు. దాంతో కంగారు పడ్డ బాబు ఇప్పుడు జన్మభూమి పేరుతొ సభలు పెట్టి ప్రజల ఆరోగ్యానికి బోలెడు చేయబోతున్నామని మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన రాజశేఖర్ రెడ్డి స్వయంగా వైద్యుడు. ఒక్క రూపాయికే వైద్యం చేసి రూపాయి డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారాయన. పేదలు అనారోగ్యం పాలైతే ఆ ఖర్చులు భరించడం ఆ కుటుంబాలకు ఎంత కష్టమో క్షుణ్ణంగా తెలిసన మనిషి వైఎస్సార్. అందుకే ఆయన ప్రజలపాలిట వరంలా ఆరోగ్యశ్రీని ప్రారంభించారు. ఆయన నడిచిన దారిలోనే నడుస్తున్నాడు యువనేత వైఎస్ జగన్. తండ్రి కంటే రెండడుగులు ముందుకేసి ఆరోగ్యశ్రీని మరింత విస్తృతం చేస్తానని మాటిచ్చారు. 
టెక్నాలజీని పర్ ఫెక్ట్గ్ గా, పకడ్బందీగా వాడుతున్నాను అని చెప్పారు చంద్రబాబుగారు. అది నిజమే. నంద్యాల ఎలక్షన్లో ఆవిషయం రుజువైంది కూడా. లాప్ టాప్ లు ఇచ్చి, విద్యార్థులతో సర్వేలు చేయించి, ప్రజలను భయపెట్టి ఓటు వేయించుకోవడానికి చంద్రబాబు టెక్నాలజీనే వాడారు. అయితే ఓటుకు నోటు కేసులో బాబును బుక్ చేసింది కూడా ఆ టెక్నాలజీయే అని బాబు గుర్తుంచుకుంటే మంచింది. 

టెలీ మెడిసిన్ పేరుతో బాబు ప్రకటించిన పథకంలో బోలెడు లోపాలున్నాయంటున్నారు అధికారులు. ఇది దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువ అని చెబుతున్నారు. పిల్లలు తక్కువగా ఉన్నారని స్కూళ్లు మూసేసినట్టే, రోగులు రావడం లేదని ఆసుపత్రులు మూసేయడానికి, వాటికోసం పెట్టే అరకొర ఖర్చులు కూడా మిగుల్చుకోవడానికే చంద్రబాబు ఈ టెలిమెడిసన్ పథకాన్ని పెట్టారని అంటున్నారు ఆయన కంత్రీ ఆలోచనలు తెలిసన కొందరు సీనియర్లు. చిన్న పాటి సమస్యలకైనా డాక్టరు పరీక్షించందే ప్రిస్కిప్షన్ రాయరు. అలాంటిది ఫోన్ ద్వారా రోగాలకు మందులు తీసుకోవడాన్ని అనుమతిస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చంద్రాబాబకు ఆ మాత్రం తెలియదా...సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com