Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                               3100 కిలోమీట‌ర్ల మైలు రాయి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.                               క‌రువు మండ‌లాల కుదింపు దారుణం: వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               పోలీసుల‌ను చంద్ర‌బాబు త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌                               చంద్రబాబు నిజ స్వరూపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయటపెట్టారు: జోగి ర‌మేష్‌                 
    Show Latest News
టీడీపీ దుర్మార్గపు పాలనపై రణం

Published on : 15-May-2018 | 14:33
 

వంచనపై గర్జన పేరిట కదం తొక్కిన వైయస్‌ఆర్‌ సీపీ
జననేత 2 వేల కిలోమీటర్ల పూర్తి సందర్భంగా సంఘీభావ యాత్రలు
మళ్లీ చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దు
వాడవాడలా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల పాదయాత్రలు

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులు కదం తొక్కాయి. నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న వంచనపై ధ్వజమెత్తాయి. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు సంఘీభావ పాదయాత్రలు చేపట్టారు. లక్షల గొంతుకలు ఒక్కటై చంద్రబాబు దుర్మార్గపు పాలనపై నిరసన తెలిపాయి.  అదే విధంగా చంద్రబాబు వంచనపై గర్జన పేరిట ప్రజలను చైతన్య పరుస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాదయాత్రల్లో పాల్గొంటున్నారు. రెండ్రోజులుగా చేపడుతున్న పాదయాత్రలు దిగ్విజయంగా కొనసాగుతుంది. 

ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను సాధించడంలో.. అదే విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని పార్టీ నేతలు వంచనపై గర్జన పేరిట పాదయాత్ర చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు పాలన ఏ విధంగా ఉందో మీరే ఆలోచించుకోవాలని.. కనీసం తాగడానికి కూడా మంచినీరు దొరకని పరిస్థితుల్లో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుందని ప్రజలకు వివరించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర వనరులను తాకట్టుపెట్టడమే కాకుండా.. నీటి పంపకాల్లో కూడా ద్రోహం చేశాడని మండిపడ్డారు. 

ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర బాగుపడుతుందని నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని చంద్రబాబు అనేక సందర్భాల్లో ఎగతాలి చేశారని గుర్తు చేశారు.  నాలుగేళ్లుగా బీజేపీతో అంటకాగిన చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను తాకట్టుపెట్టారన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వ పటిమతో  హోదా వద్దన్న బాబే నోటితో హోదా హక్కు అనే మాట పలికించాడని ప్రజలకు పార్టీ నేతలు వివరిస్తున్నారు. అదే విధంగా బీజేపీతో కలిసి ఇన్నాళ్లు రాష్ట్రాన్ని మోసం చేసిన ప్రజల నుంచి వ్యతిరేక రావడంతో బయటకు వచ్చి తన తప్పును ప్రతిపక్షంపై రుద్దాలని చూస్తున్నాడన్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీతో వైయస్‌ఆర్‌ సీపీ కలిసిపోయిందనే దుష్ప్రచారం చేస్తూ ఓటు రాజకీయాలు చేస్తున్నాడని, బాబు మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని కరపత్రాలను సైతం పంపిణీ చేస్తూ ప్రజలకు వివరిస్తున్నారు. అదే విధంగా 16వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్‌ వద్ద వంచనపై గర్జన పేరిట వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులు ఆందోళన, ధర్నా కార్యక్రమాలు చేపట్టి.. కలెక్టర్‌లకు వినతిపత్రాలు అందజేయనున్నారు. 
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com