Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆదివారం పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 317వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                               టీడీపీ హయాంలో దళిత సంక్షేమం టీడీపీ దొంగల సంక్షేమంగా మారింది: మేరుగ నాగార్జున                               సంతవురిటి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 313వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా దక్కినా ఆపదవి నిర్వహించనీయకుండా అడ్డుకోవడం వల్లే వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు: ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               ఒక్కసారి వైయస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వండి..30 ఏళ్ల సంక్షేమంతో రాష్ట్రం ముందుకెళ్తుంది: ఎంపీ విజయసాయిరెడ్డి                                అంతకాపల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 312వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతం

Published on : 23-Feb-2018 | 11:59
 - ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించిన వైయ‌స్ఆర్‌సీపీ
- మార్చి 1న క‌లెక్ట‌రేట్ల ముట్ట‌డి
- మార్చి 5న ఢిల్లీలో ధ‌ర్నా
- 21న పార్ల‌మెంట్లో అవిశ్వాస తీర్మానం
- ఏప్రిల్ 6న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల రాజీనామా

 అమ‌రావ‌తి:  ఐదుకోట్ల మంది ఆంధ్రులకు సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లుగా ఉద్య‌మిస్తునే ఉంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ, టీడీపీ ఇచ్చిన విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బడ్జెట్‌లో ప్ర‌త్యేక హోదా ప్ర‌స్తావ‌న లేక‌పోవ‌డంతో ఉద్య‌మాన్ని ఉధృతం చేసింది.   హోదా కోసం ఎందాకైనా అంటూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై  ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో ‘ప్యాకేజీతో మోసం చేయొద్దు.. ప్రత్యేక హోదా మన హక్కు’ అన్న నినాదంతో మార్చి నెలలో ఏపీలోనూ, ఢిల్లీలోనూ, పార్లమెంటులోనూ పోరాట కార్యాచరణను ప్రకటించిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6న తమ ఎంపీలు రాజీనామా చేస్తారని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.  మార్చి 1న అన్ని జిల్లా కేంద్రాల వ‌ద్ద ధ‌ర్నాలు, 5న ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద ధ‌ర్నా, 6వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వ‌ర‌కు పార్ల‌మెంట్‌లో ఎంపీల పోరాటం, అంత‌కు ముందే మార్చి 21న కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతుంది. 184 నిబంధన కింద ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. ఈ అంశంపై జ‌రిగే చ‌ర్చ‌లో పాల్గొని హోదా నినాదాన్ని వినిపిస్తోంది.  

హోదాపై బాబు పూటకోమాట 
ఐదుకోట్ల మంది ఆంధ్రుల భవితవ్యానికి సంబంధించిన ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి చేయడానికి గానీ, దానిని సాధించడానికి గానీ చంద్రబాబుకు మనసొప్పలేదు. చంద్రబాబు చేసినన్ని విరుద్ధమైన ప్రకటనలు మరెవరూ చేసి ఉండరు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సంజీవని అన్నారు. ప్రత్యేక హోదా పదేళ్లు కూడా సరిపోదు.. పదిహేనేళ్లు కావాలని ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ సాక్షిగా సభలలో డిమాండ్‌ చేశారు. తమ కూటమి గెలిస్తే ఏపీకి పదిహేనేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే చంద్రబాబు మాటమార్చారు. 14వ ఆర్థిక సంఘం కుదరదన్నది.. నీతి ఆయోగ్‌ వద్దంటోంది.. అంటూ హోదాకు మంగళం పాడేశారు. ప్రత్యేకహోదా ఇవ్వడానికి ఆర్థికసంఘం, నీతిఆయోగ్‌లకు సంబంధంలేదని, జాతీయఅభివృద్ధిమండలి చైర్మన్‌ హోదాలో ప్రధానమంత్రి ఒక్క సంతకం చేస్తే ఏ రాష్ట్రానికైనా ప్రత్యేకహోదా ఇవ్వవచ్చని ప్రతిపక్ష వైయ‌స్ఆర్‌సీపీ పలుమార్లు చెబుతూ వచ్చింది. అయితే ప్రత్యేకహోదాకు వీలుకాదని, హోదాకు సమానంగా కేంద్రం నిధులు ఇస్తానంటోందని, ప్రత్యేక హోదాతో వచ్చేవన్నీ ఇస్తున్నందుకే ప్యాకేజీకి ఒప్పుకున్నామని ఇలా చంద్రబాబు రకరకాల సాకులు చెప్పారు. హోదా ఏమన్నా సంజీవనా అని ప్రశ్నించారు. హోదాతో ఏం వస్తాయి? అని అడిగారు. హోదా కన్నా మెరుగైన ప్యాకేజీ ఇస్తామంటే వద్దంటామా అని అంటూ కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని ఎద్దేవా చేశారు. 
ప్రత్యేక హోదాపై వివిధ సందర్భాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలివీ.. 
18.5.2016 – హోదాతో ఏం వస్తుంది? హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే ఏం లాభం? ఈశాన్యరాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? 
19.5.2016 – హోదాతోనే అంతా కాదు. హోదా సంజీవని కాదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధానికి విన్నవించా.  
11.9.2016 – ప్రత్యేక హోదావస్తే ఏం వస్తుంది? ప్యాకేజీ వద్దంటే అభివృద్ధి పనులకు ఆటంకం.  
16.9.2016 – హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామికరాయితీలకు హోదాకు సంబంధం లేదు. 
18.9.2016 – ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా. దానివల్ల పారిశ్రామిక రాయితీలు రావు. వస్తాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధం 
23.9.2016 – హోదాకన్నా మెరుగైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ప్యాకేజీపై విస్తృత ప్రచారం చేయండి. 
4.2.2017 – హోదా వేస్ట్, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో పరిశ్రమలకు ప్రోత్సాహకాల్లేవు 
16.2.2017 – ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా. హోదాతో వచ్చేవన్నీ ప్యాకేజీలో ఇస్తామన్నారు.   

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com