Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               చిన్నరాయుడుపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 298వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మార్గాని నాగేశ్వ‌ర‌రావు, భ‌ర‌త్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌                               కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం                               వైయ‌స్ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ పున:ప్రారంభం                 
    Show Latest News
ఇంత‌న్న‌డంత‌న్నాడే చంద్ర‌బాబు....

Published on : 22-Oct-2018 | 16:26
 


ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్ల‌న్నాడు
మిగిలిపోయిన ప్రాజెక్టుల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేస్తాన‌న్నాడు.
స‌వ‌రించిన అంచ‌నా వ్య‌యం ఇస్తే కాంట్రాక్టర్లు ప‌రుగులు పెడ‌తార‌న్నాడు.
పాత కాంట్రాక్టులు ప‌క్క‌నెట్టి కొత్త ధ‌ర‌లో కొత్త కాంట్రాక్ట‌ర్ల‌ను రంగంలోకి దించాడు.
జ‌ల హార‌తుల‌న్నాడు..
జాతికి అంకితం అన్నాడు...
కానీ కాగ్ వ‌చ్చి ఏటా లెక్క‌లు వేస్తే చెప్పిన‌దానికి మూడింత‌లు ఖ‌ర్చు అయ్యింది...
ప్రాజెక్టులు చూడ‌బోతే ఎక్క‌డేసిన గొంగ‌ళి అక్క‌డే ఉంది.
ఇదీ సాగునీటి రంగం గురించి బాబుగారు అంతేసి ఇంత‌లేసి చెప్పిన‌మాటల్లో లేస‌మంతేసైనా వాస్త‌వం లేదు అని కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్) తేల్చి చెప్పేసింది. 
పైగా మూడేళ్లుగా ఆడిట్ చేసి లొసుగులు తేల్చి, నివేదిక‌లిస్తే దానిపై చ‌ర్య‌లు కూడా తీసుకోలేద‌ని గుర్తించింది. 
అందుకే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మీద సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టింది. 
17,368 కోట్ల‌తో పోల‌వ‌రం, హంద్రీ నీవా మినహా మిగిలిన ప్రాజెక్టుల‌న్నీ పూర్తి చేస్తానంటూ చంద్ర‌బాబు నాలుగేళ్ల కింద‌టే శ్వేత ప‌త్రం ఇచ్చాడు. నాలుగేళ్లు గ‌డిచాయి 58 వేల కోట్ల‌తో ప్రాజెక్టుల ఖ‌ర్చు త‌డిసి మోపెడైంది. కానీ ఒక్క‌టంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. కొత్త‌గా ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణే జ‌ర‌గ‌లేదు. అస‌లు ఏటికేడాది సాగే సాగు కూడా తగ్గిపోతోంది. 
ప‌ట్టిసీమ‌ల ఎత్తిపోత‌ల్లో అక్ర‌మాల లోతుపాతుల గురించి కాగ్ గ‌తంలోనే రాష్ట్ర‌ప్ర‌భుత్వానికి నివేదిక ఇచ్చింది. దానిపై చంద్ర‌బాబు క‌నీసం విచార‌ణ కూడా జ‌రిపించ‌లేదు. ఆ త‌ర్వ‌త భారీగా పెరిగిన అంచ‌నా వ్య‌యాన్ని కూడా త‌ప్పంటూ కాగ్ చేసిన సూచ‌న‌లేవీ ఎపి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. దీంతో ఈ వ్య‌వ‌హారంపై కాగ్ య‌మా సీరియ‌స్ గా రియాక్ట్ అవుతోంది. ప్రిన్సిప‌ల్ అకౌంటెంట్ జ‌న‌ర‌ల్ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని, జ‌ల‌వ‌న‌రులు, ఇంకా ఆర్థిక శాఖ‌ను పోల‌వ‌రంలో జ‌రిగే అవినీతి అక్ర‌మాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెబుతూ లేఖ‌లు రాసినా నేటికీ చంద్ర‌బాబు అలాంటి ప్ర‌య‌త్న‌మేమీ చేయ‌లేదు. నిధులు ఖ‌ర్చైనా ప‌నులు పూర్తి కాక‌పోవ‌డం, అవ‌క‌త‌వ‌క‌ల గురించి రాష్ట్ర ప్ర‌భుత్వానికి తెలిసినా గ‌ప్ చుప్ గా ఉండిపోవ‌డం గురించి కాగ్ ఎంక్వైరీ మొద‌లెట్టింది. ప్రాజెక్టుల వారీగా స‌మ‌గ్ర విచార‌ణ‌కు సిద్ధ‌మౌతోంది. నారావారి అవినీతి ప్రాజెక్టుల్లో పార‌డాన్ని కాగ్ గ‌ట్టిగా బ‌య‌ట‌పెడుతుంద‌నే ఆశిద్దాం. 
ప్రాజెక్టులు క‌ట్టేస్తా, నీళ్లు ఇచ్చేస్తా, రాయ‌ల‌సీమ‌ను మార్చేస్తా న‌దులు అనుసంధానం చేస్తా ప్ర‌కృతిని మేనేజ్ చేస్తా, స‌ముద్రాన్ని కంట్రోల్ చేస్తా అంటూ బాబు చెబుతున్న బుడ‌త‌కీచు క‌థ‌లు ఇక కాగ్ కంచికి చేరుస్తుంద‌న్నమాట‌. 
Labels : chandra babu, projects, ap

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com