Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                               3100 కిలోమీట‌ర్ల మైలు రాయి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.                               క‌రువు మండ‌లాల కుదింపు దారుణం: వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               పోలీసుల‌ను చంద్ర‌బాబు త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌                               చంద్రబాబు నిజ స్వరూపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయటపెట్టారు: జోగి ర‌మేష్‌                 
    Show Latest News
ఎన్.ఆర్.ఎ పప్పేష్

Published on : 08-Feb-2018 | 20:58
 

'హలో మిస్టర్ పప్పేష్' పలకరించాడు విలేకరి.
'ఎస్ చెప్పండి' అడిగాడు పప్పేష్.
'మీ అమెరికా పర్యటన ఎలా ఉంది' అడిగాడా జర్నలిస్టు.
'బ్రహ్మాండం, అక్కడి అమెరికా కార్యకర్తనలు కలిసాక కొత్త ఉత్సాహం కలిగింది' సంబంరంగా చెప్పాడు పప్పుబాబు.
'మరి అమెరికాలో ట్రంప్ పై పోటీ చేయడం సంగతి నిర్ణయించారా..అక్కడ మీ కార్యకర్తలను సిద్ధం చేసారా?' ప్రశ్న మీద ప్రశ్న వచ్చేసింది విలేకరి నుంచి. 
'ట్రంప్ తో పోటీ చేస్తా అని నేనెక్కడన్నాఅన్నా' అడిగాడు పప్పేష్ అమాయకంగా...
'అదేంటి సర్, అమెరికాలో తెలుగుదేశం ప్రభుత్వం తెస్తానన్నారు కదా. మరి అమెరికా అధ్యక్షడితో పోటీ చేయకుండే తెలుగుదేశం జెండాని అమెరికాలో ఎలా పాతుతారు' 
అప్పుడు గుర్తొచ్చింది లేకేష్ కి. రెండు రోజుల క్రితం తను అన్న మాట.
'ఓ తప్పకుండా చేస్తాం. తాతగారి ఆశీర్వాదం, నాన్నగారి 26 గంటలు కష్టపడేతత్వం అన్నీ కలిస్తే అదేమంత కష్టం కాదు. జయంతిని, వర్థంతి చేసినంత సునాయాసంగా అమెరికాలో తెలుగుదేశాన్ని తెచ్చేయగలం'  అన్నాడు పప్పేష్.
అంటే మీరు 'ఎన్.ఆర్.ఎ' అవ్వాలనుకుంటున్నారన్నమాట అడిగాడు జర్మలిస్ట్.
ఈ మాట ఎక్కడో విన్నట్టుందే అని బుర్రని రెండు చేతులతో గీక్కుంటూ ఆలోచించాడు పప్పు బాబు.
అది గమనించిన విలేకరే గుర్తు చేసాడు ' అదేసార్ నంది అవార్డుల ప్రదానం అప్పుడు మీరే అన్నారు గదా...ఎపిలో ఉండని వారు, ఎపిలో ఉండే అవకాశం లేక తెలంగాణాలో ఉండిపోయిన వారు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని. వాళ్లు అవార్డుల గురించి మాట్లడకూడదు అని చెప్పారు గదా' 
'అవును అవును' అన్నాడు పప్పేష్ నత్తినత్తిగా
'అయితే అమెరికాలో ట్రంప్ పై పోటీ చేయడానికి ఆంధ్రా నుంచి అమెరికా వెళ్లిపోతారనేగా...!!??? అక్కడి పౌరసత్వం తీసుకుని  నాన్ రెసిడెంట్ ఆంధ్రా అయిపోతారన్నమాటే గదా!!!??? ' కన్ఫర్మేషన్ కోసం గట్టిగా అడిగాడు విలేకరి.
అలా గుచ్చిగుచ్చి అడిగేసరికి ఇందులో ఏదో తిరకాసుంది ఊకొట్టి ఒప్పుకుంటే ఇప్పుడే ఎపి నుంచి తరమేసి అమెరికాలో పోయి కూర్చోమనేలా ఉన్నారు..అనుకున్నాడు పప్పేష్.
'అదీ..అదీ ఇంకా ఏ విషయం తేలలేదు. నాన్నారితో మాట్టాడి అప్పుడు డిసైడ్ చేద్దాం. ఇప్పటికి ఇంటర్వ్యూ చాలు...' అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు పప్పేష్. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com