Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు న్యాయ‌వాదుల సంఘీభావం                               నూక‌వ‌రం నుంచి ప్రారంభమైన 91వ రోజు ప్రజాసంకల్పయాత్ర                               వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన పొగాకు రైతులు..గిట్టుబాటు ధ‌ర కోసం పోరాడుదామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు                               నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉండి.. ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు: ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               బీజేపీ, టీడీపీ రెండూ క‌లిసి ఏపీకి అన్యాయం చేశాయి: మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు                               రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదు: పార్ధ‌సార‌ధి                               ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఎత్తడానికి కూడా చంద్రబాబు భ‌య‌ప‌డుతున్నారు: పార్ధ‌సార‌ధి                               ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు గుంటూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో కోటి సంత‌కాల సేక‌ర‌ణ‌                               బంగార‌క్క‌పాలెం నుంచి 90వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
    Show Latest News
సింగపూరు పట్నం చూడర బాబూ

Published on : 12-Oct-2017 | 17:15
 

అమరావతి ఎలా ఉంటుందో సాంపిల్ చూపించడం కోసం రాజధాని రైతులను సింగపూరు పంపుతున్నాడు చంద్రబాబు. లాటరీలో వందమంది రైతులు సింగపూరు ప్రయాణానికి ఎంపికయ్యారు. ఇక మిగిలిన కొద్దిమందిని మాత్రం నిరాశ పరచడం ఎందుకు అంటూ ఉదారంగా వారినీ సింగపూరు ఫ్లైటు ఎక్కించేయమన్నాడు. ఇక రైతులను తలపాగా తీసేసి టోపి పెట్టుకోమన్నాడు. పంచ ఊడపీకి సూటు బూటు వేయించాడు. మీసాలూ, గెడ్డాలూ గీయించేసి దొరల దేశం పద్ధతుల్లో తయారు కమ్మన్నాడు. సింగపూరు సిటీ చూసి ఆ కళ్లతో వచ్చి అమరావతిని చూడమన్నాడు. రాబోయే రోజుల్లో అలాంటి రాజధాని మనకూ రాబోతోందని అర్థం చేసుకోమన్నాడు. తిరిగి రాగానే రాజధాని రైతులందరూ వ్యవసాయం అనే మాటను మర్చిపోయి రాజధానిలో వాణిజ్యం చేసే స్థాయికి చేరుకుంటారు కనుక, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయమని సిబ్బందిని ఆదేశించాడు. సింగపూర్ బిజినెస్ మేన్లలా రాజధాని రైతులు తయారవ్వాలని సూచనలిచ్చాడు. అంతా సిద్ధమయ్యారు. సింగపూరు చేరుకున్నారు. ఆర్చర్డ్ రోడ్ లో బహుళంతస్థుల భవనాలు చూసి ఆహా అనుకున్నారు. సెంటోసా ద్పీపం చూసి ఓహో అనుకున్నారు. టైగర్ స్కై టవర్ చూసి అబ్బురపడ్డారు. కాసినోలను చూడగానే రైతుల కళ్లు తిరిగాయి. యాత్రపూర్తయింది. తిరిగి అమరాతికి చేరుకున్నారు రైతులందరూ. విమానం దిగగానే రైతులందరికీ రంగురంగుల కళ్లజోళ్లు అందించారు అధికారులు. ఇవి పెట్టుకోండి అన్నారు. ఎందుకివి అడిగారు రైతులు. సింగపూరు తర్వాత అంత గొప్ప రాజధాని అమరావతిని చూడటానికి అన్నారు. బలవంతంగా అందరి కళ్లకూ కళ్లజోళ్లు పెట్టి, ఎయిర్ పోర్టు నుంచి బయటకు తీసుకొచ్చారు. అంతే ముందంతా పెద్ద పెద్ద భవంతులు అచ్చం సింగపూర్ లో చూసినట్టే, ఫౌంటేన్లు, రోడ్లు అన్నీ సింగపూర్ లో ఉన్నట్టే ఉన్నాయి. పార్కులు, గార్డెన్లు, పెద్దపెద్ద కార్లు, అధునాతన వాహనాలూ అన్నీకళ్లముందు నుంచి కదులుతూ వెళ్తున్నాయి. అరే మనం సింగపూర్ చూసొచ్చేసరికి మన ముఖ్యమంత్రి ఇక్కడ అమరావతిని కట్టేసారు బాగుందే అనుకున్నారు రైతులు. దిగండి మీరు దిగాల్సిన ప్లేసు వచ్చింది అని బస్సులోంచి దింపి వెళ్లిపోయారు అధికారులు. ఆహా మన రాజధాని అద్భుతంగా ఉంది అనుకుంటూ కళ్లజోళ్లు తీసారు రైతులు. ఎదురుగా బీళ్లుపడి, కంచెలేసిన తమ చేలు కనిపిచాయి. కళ్లు తిరిగి పడిపోయారు వాళ్లు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com