Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                               3100 కిలోమీట‌ర్ల మైలు రాయి చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.                               క‌రువు మండ‌లాల కుదింపు దారుణం: వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               ఐటీ దాడులపై చంద్రబాబు నానా యాగీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               పోలీసుల‌ను చంద్ర‌బాబు త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటున్నారు: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌                               చంద్రబాబు నిజ స్వరూపాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ బయటపెట్టారు: జోగి ర‌మేష్‌                 
    Show Latest News
వినేవాడు వెంగళప్పైతే చెప్పేవాడు చంద్రప్ప

Published on : 21-Sep-2018 | 19:10
 

 

గుజరాత్ ను ఆంధ్రా దాటిపోతుందని మోదీ భయం అంటారు చంద్రబాబు. బాబు జ్ఞాన భేరి సదస్సులో ప్రసాదించిన ఈ జ్ఞానం విన్నవాళ్లు ఆశ్చర్యంతో అవాక్కైపోతున్నారు. అవునా నిన్నటిదాకా మోదీ చంద్రబాబుకు భయపడుతున్నాడనుకున్నామే .... కాదా ఎపి గుజరాత్ ను దాటిపోతుందని భయపడుతున్నాడా అని నోళ్లు వెళ్లబెడుతున్నారు. గుజరాత్ లో సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తైపోయాయి...ఎపిలో నాలుగున్నరేళ్లు గడుస్తున్నా పోలవరం పనులు కమీషన్ల దగ్గరే కొట్టుమిట్టాడుతున్నాయి. మరెందుకు ఎపి గుజరాత్ ను దాటిపోతుందని మోదీ భయపడాలి. పోనీ వ్యాపార రంగంలో గుజరాత్ వ్యాపార దిగ్గజాలైన టాటాలు, అంబానీలాంటి వాళ్లు ఎపిలో పెట్టుబడులు పెడుతున్నారా, పారిశ్రామికంగా ఎపిని పరుగులు పెట్టిస్తున్నారా అంటే అదీలేదాయె? మరెందుకు మోదీ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కు పోటీ అని భయపడుతున్నట్టు...

కాస్త డీప్ గా ఆలోచిస్తే ఒకటి తడుతోంది...పాలనా విషయాల్లో చంద్రబాబు మోదీకి పోటీగా ఉన్నట్టే కనిపిస్తున్నాడు. వెలిగిపోతోంది అని చెప్పుకోవడంలో మోదీ, చంద్రబాబు ఇద్దరూ ఇద్దరే. ఇక గుజరాత్ వెలుగుల వెనకున్న చీకటిని అక్కడి మీడియా ఎలా కప్పెట్టేసిందో, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ వెనుక అవినీతి కోణాలను ఎపిలో జాతి మీడియా అలాగే ముసుగు కప్పి ఉంచింది. గుజరాత్ లో మతోన్మాదం పెరిగి ముస్లింల ఊచకోతకు కారణమైనట్టుగానే, ఆంధ్రప్రదేశ్ లో కులదురహంకారం, అధికారాహంకారాలు పెరిగి దళితులపై, సామాన్యులపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. కనుక ఇలాంటి విషయంలోనూ గుజరాత్ ను మించిపోయేలా ఎపి ఉందని మోదీ భావించి ఉండొచ్చు.

అందుకే చంద్రబాబు చెప్పినట్టు మోదీ ఎపి అభివృద్ధిని చూసి భయంతో గజగజా వణికిపోతున్నాడని ఒప్పుకునే తీరాలి. ఎందుకంటే వినేవాడు వెంగళప్పైతే చెప్పేవాడు మరి చంద్రప్పేగా???

 

 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com