Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               నందగిరి పేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 319వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                               డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు                 
    Show Latest News
పోలవారం పోయి సోమవారం వచ్చె

Published on : 06-Feb-2018 | 18:51
 



పోలవరం పేరుతో రాజకీయాలు చేయడమే తప్ప, ప్రజలకు ప్రాణాధారమైన ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్త శుద్ధి చంద్రబాబుకు లేదు. ఏదో ఒక మిషతో పోలవరం పేరును వాడుకుంటూ, ప్రాజెక్టును తాత్సారం చేయడమే చంద్రబాబు సిద్ధాంతం. అవకాశం దొరికినప్పుడల్లా బాబు పోలవరాన్ని పేకలో తురుఫు ముక్కలా వాడుకుంటున్నాడు. జలవనరుల శాఖా అధికారులతో సమీక్షలోనూ మరోసారి పోలవరం లెక్కలు చెప్పుకొచ్చాడు బాబు. అందులో నిజాలెంతంటే, నేతిబీరలో నెయ్యంత. 

ప్రతి సోమవారం పోలవారం అన్నారు. కానీ సోమవారం సోమవారంలాగే వెళ్లిపోతోంది. కానీ పోలవరం మాత్రం సోమరిపోతుల పరమయ్యే ఉంది. 
ప్రాజెక్టుల దగ్గర నిద్రపోయిన చంద్రబాబు, ఆ నిద్రనుంచి మేల్కొనలేదు. ప్రాజెక్టు ముందుకు సాగనూ లేదు.
పోలవరం పై వారం వారం రివ్యూలు అన్న ముఖ్యమంత్రి మాట మార్చి అధికారులు సమీక్షించి, నాకు నివేదిక పంపించడన్నారు. 
పోలవరం పని సవ్యంగా జరక్కపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతా, తాటవొలుస్తా అని బెదిరించిన చంద్రబాబు అవే సంస్థలకు నజరానాలు అందిస్తున్నారు. 
ఇప్పటికి బాబు పోలవరాన్ని దాదాపు 30 సార్లు సందర్శించారు. (కేవలం దర్శించారు)
40 సార్లు సాధారణ సమీక్షలు చేసారు.
50 సార్లు వర్చువల్ సమీక్షలు జరిపారు.
47 సార్లు అధికారులతో సమావేశాలు జరిపారు. 
2 సార్లు కేంద్ర బృందాలు పర్యటనలు జరిపాయి. 
పోలవరం గురించి చెప్పమంటే బాబూ చెప్పే కథ ఇది. ఒక్కముక్కలో చెప్పాలంటే పోలవరం 50శాతం పూర్తైంది, మరో యాభై శాతం 2019కి పూర్తవుతుంది. కాకపోతే దాన్ని ప్రతిపక్షనేతో, పక్కరాష్ట్రపు ముఖ్యమంత్రో, కేంద్రమో అడ్డుకోడం వల్ల ఆలస్యం అవుతోంది తప్ప తన తప్పు కాదు. పోలవరం పనులను ముక్కలు ముక్కలుగా 60%, 90%, 70% పూర్తయినాయని లెక్కలు చెబుతున్న బాబు, ఈ లెక్కల ప్రకారం చూసినా 2019కి పోలవరం పూర్తవదని మాత్రం నిజం ఒప్పుకోడం లేదు. 


 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com