Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఈవీఎంలకు ట్యాంపరింగ్‌ చేయడం బాబుకు బాగా తెలుసు: ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన తుపాను బాధితులు                               చ‌ల్ల‌వానిపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 324వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               వ‌ర‌ల్డ్ టూర్ ఫైన‌ల్స్ టైటిల్ గెలిచిన భార‌తీయ ఫ్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించిన పీవీ సింధుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు                                అమరజీవికి జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌ ఘ‌న‌ నివాళి                               టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో అన్ని అంశాల్లో రాజీపడింది చంద్రబాబే: బొత్స సత్యనారాయణ                               రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంత భ్రష్టుపట్టించారో, కేసీఆర్ అంత నష్టపరిచారు: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
నాయకుడు నటుడైతే....

Published on : 04-Oct-2018 | 13:17
 


 
వెండితెర నటులు నాయకులైన చరిత్రలు కోకొల్లలు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు పొరుగునున్న తమిళనాట కానీ, దక్షిణాదిని దాటి ఉత్తరాది వైపు చూసినా గానీ సినీ గ్లామర్ ఉన్న వాళ్లు తర్వాత పాలిటిక్స్ లో చేరి రసవత్తర రాజకీయ నాటకాలను నడిపించారు. ప్రేక్షకులు, అభిమానులు ఓట్లై సీట్లను గెలిపించిన దాఖలాలు బోలెడు. అంతేనా ఈ గ్లామర్ ను అడ్డుపెట్టుకునే కొందరు నేరుగా రాజకీయాల్లోకి రాకపోయినా కొన్ని పార్టీలకు మద్దతిచ్చి, ప్రచారాలు చేసి, ఎన్నికల్లో ఓట్లేయమని చెప్పి, వారి హామీలకు మేమే జవాబుదారి అని మైకుల ముందు ప్రమాణాలు చేసి సదరు పార్టీలను అధికారంలోకి తేవడంలోనూ కీలక పాత్ర పోషిస్తారు. సరే ఇదంతా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమే...కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇందుకు విరుద్ధమైనదొకటి జరుగుతోంది. సినిమాల్లో నటించక పోయినా బోలెడంత ఫాన్ ఫలోయింగ్ తెచ్చుకున్నాడో నటుడు...సారీ నాయకుడు. పైగా నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడి వారసత్వం కూడా ఇతగాడి వెన్నంటి ఉంది. ఈ నేత నోరు తెరిస్తే నవ్వులు, మాట మాట్లాడితే కామెడీ కితకితలు...గూగుల్ కూడా గుర్తించే గొప్పబిరుదాంకితుడు. జాతీయ స్థాయిలో తెలుగు రాజకీయ కామెడీ పంట పండించే ఆ ఘనత వహించిన నాయకుడెవరో మీరు గుర్తించే ఉంటారు...

మిస్టర్ పప్పేష్....మన లోకేష్...గాంధీ జయింతినాడు కూడా ఈయన తన సహజ ధోరణిలో ’’సంపద నుండి చెత్తను సృష్టిస్తా’’ అంటూ ట్విట్టర్లో కూసి తన హాస్య చతురతను నిరూపించుకున్నాడు. నిజానికి నటులు తెరమీద మనల్ని ఎంటర్ టైన్ చేస్తారు. కానీ ఈ నాయకుడు నాయకుడైన క్షణం నుంచీ మనల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నాడు. పాపం నాయకత్వ లక్షణాలు లేకపోయినా, తిన్నగా తెలుగు పలకరడం చేతకాకోయినా, అంతర్జాతీయ స్థాయి కాదు కనీసం..ఎలిమెంట్రీ స్థాయి నాలెడ్జ్ కూడా లేకపోయినా మహానాయకుడిలా నటించడం మామూలు విషయం కాదు. ఏమీ తెలియకున్నా అన్నీ తెలిసనట్టు నటించడం, నటించడానికి పదే పదే ప్రయత్నించడం చూస్తే పట్టువదలని విక్రమార్కుడికి ఈఅక్రమార్కుని కుమారుడు వారసుడేమో అని అనుమానం కలుగుతుంది.  

ఇంతకీ లోకేష్ నాయకత్వంలోని నటన గురించి చర్చించుకునే అవకాశం కల్పించిన ’’సంపద నుంచి చెత్తను సృష్టించడం’’ అనే కాన్సెప్టుకు తెలుగు ప్రజలంతా మూకుమ్మడిగా ఓటేసారు. అనుభవం ఉన్న నాయకుడని, అన్యాయం అయిన ఆంధ్రరాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తానన్నాడని నమ్మి, చంద్రబాబు రాష్ట్ర సంపద అనుకుని భ్రమపడిన తెలుగు ప్రజలకు అందులో ఉన్నది చెత్త అని స్పష్టంగా తెలిసిపోయింది కనుక...లోకేష్ సంపద నుంచి చెత్త సృష్టి గురించి వారికి త్వరగా అవగాహన కలిగి మారు మాట్లాడకుండా జై కొట్టారు.. 


Labels : ap, lokesh, tweet, chandra babu

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com