Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి రెండో రోజు నిరాహార దీక్ష‌కు అనూహ్య మద్దతు                                రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                               వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 194వ రోజు నాగుల్లంక శివారు నుంచి ప్రారంభం                               30న అనంత‌పురంలో న‌య వంచ‌న దీక్ష: వైయ‌స్ఆర్‌సీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం: వైయ‌స్ జ‌గ‌న్ హామీ                               నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను: వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన వంద మంది అగ్ని కుల క్ష‌త్రియులు                               తనపై నిరాధార ఆరోపణలు చేసిన యరపతినేని , రవీంద్రకుమార్‌లపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి                                ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు స్వర బ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్ మృతి ప‌ట్ల వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి సంతాపం                 
    Show Latest News
విశాఖ తీరాన ఊకదంపుడు

Published on : 22-Feb-2018 | 10:31
 


ఏటా పెద్ద పండక్కు పిట్టల దొర వస్తాడు. బోలెడు కథలు చెప్పి వెళ్తాడు. చెప్పింది చెప్పకుండా చెప్పి కడుపుబ్బా నవ్విస్తాడు. గంగిరెద్దు మేళం వస్తుంది. డూడూ బసవన్నా అని అదిలించగానే కొమ్ములు ఊపి, గిట్టలు ఎత్తి ఆడి అలరిస్తుంది. అలాగే పగటి వేషగాళ్లు వస్తారు. రంగులు పూసుకుని, అట్టముక్కల ఆయుధాలు పట్టుకుని, రంగు రంగుల కిరీటాలు పెట్టుకుని చెవులకింపైన పద్యాలు పాడి ఆనందం కలుగ జేస్తారు. 

సేమ్ టు సేమ్. అచ్చం అలాగే చంద్రబాబు ఏటా సమ్మిట్ ఏర్పాటు చేస్తాడు. డిటో పిట్టల దొరలాగే ఏటికేడూ లక్షల కోట్ల పెట్టుబడుల కథలు చెబుతాడు. ఒక ఏడాది 1.95 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయంటాడు. కేవలం అమరావతి కోసమే 1.25 లక్షల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాల మీద ఇంకులేని పెన్నుతో సంతకాలు చేసుకున్నాం అంటాడు. భారతదేశంలో తొలి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ అమరావతి అని పెట్టుబడిదారులకు చెబుతున్నా అంటాడు. పెట్టుబడి కంపెనీలకు అనుమతులు 21రోజుల్లోనే ఇచ్చేస్తామని డప్పు కొట్టి చెబుతుంటాడు. ఇక పర్యాటక శాఖలో అయితే 26 కంపెనీలతో సుమారు 4,659 కోట్ల పెట్టుబడులు సాక్షాత్తూ చంద్రబాబు సమక్షంలోనే జరిగాయని పక్కనున్న వాద్యకారులు తాళాలూ, మద్దెలలూ మోగిస్తూ చెబుతుంటారు. రాష్ట్రంలో 100 హోటళ్లు, 15 హాస్పిటాలిటీ ట్రైనింగ్ అకాడమీల ఏర్పాటుకోసం 2500 కోట్లు పెట్టేందుకు బ్రిటన్ లోని మార్కెటింగ్ సంస్థ ఐవరీశాండ్ సూట్ కేసు చేతిలో పట్టుకుని నిలబడిందని కూడా అన్నారు. 
వృద్ధి రేటు 11 శాతం ఉంది అంటాడు చంద్రబాబు. ఉంది ఉంది అని తలూపుతారు బసవళ్లలాంటి మంత్రులు. వృద్ధి రేటు 14కు పెంచుతా అంటాడు బాబు. రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడతారు భజన బృందాల వాళ్లు. 666 బి టు బి ఒప్పందాలు ఖరారు అంటాడు బాబు. అవును అవునని మెళ్లో గజ్జలు మోగేలా తలలూపుతారు అధికారులు. 
ఇక కోట్ల లెక్కలు కరతలామలకంలా చెప్పి గుక్కతిప్పుకోకుండా చేయగల అవధానులు రంగంలోకి దిగుతారు. 
తొలి రోజు ఒప్పందాల ద్వారా రాష్ట్రానికి 1.95లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. భారత్ ఫోర్జ్, రిలయన్స్ వంటి ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు ఎమ్.వో.యులు కుదుర్చుకున్నాయి. సాని గ్రూప్, కేపీసీఎల్, సుజ్లాన్ ఎనర్జీ అండ్ యాక్సివిండ్ ఎనర్జీ, క్వీన్స్ లాండ్స్ కోల్ కార్ప్ ఇలా వందలాది కంపెనీలు లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాయి. ఇక విశాఖ నుంచి తుని వరకూ తీరాన్ని అభివృద్ధి చేసేందుకు కూడా ఎం.వో.యులు కుదిర్చేసుకున్నాం. 15వేల కోట్లు పెట్టుబడితో తీరాన్ని అభివృద్ధి చేసుందుకు సిద్ధం చేసాం. సముద్ర తీరాన్ని అత్యాధునికంగా అభివృద్ధి చేయడంతోపాటు, నేవీకి సంబంధించిన షిప్స్, సబ్ మెరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్వారియర్స్ను రూపొందించడానికి కూడా పెట్టుబడులు సంపాదించాం.
ఓరి నాయనో చెవులు తిరుగుతున్నాయి అపండిరా బాబూ! అన్నా వినకుండా చెప్పేస్తున్న వాళ్ల నుంచి జనాలు దూరంగా పారిపోయారు. అదిగో ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మరో సారి విశాఖలో దరువు మళ్లీ మొదలైంది. 
 
Labels : YSRCP, YS Jagan, NCBN,TDP,
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com