Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కర్ణాటక ఎన్నికలు ముగిసి 40 రోజులు కావొస్తోంది.. మరి బాబు చెప్పిన కేసులేమైనట్లు?: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు దొంగ దీక్షలు: మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి                               వైయ‌స్‌ జగన్‌ 198వ రోజు పాదయాత్ర సోమవారం ఉదయం మామిడికుదురు నుంచి ప్రారంభం                               కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రజలకు ఉపాధి లభిస్తుంది: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి                               కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం కడపలో మహా ధర్నా                               చింత‌ల‌ప‌ల్లి నుంచి 196వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               దేశంలోనే సీనియర్‌ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు: ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు                               రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                  
    Show Latest News
చంద్రబాబు అను నేను...

Published on : 06-Jun-2018 | 10:43
 

 నవనిర్మాణ దీక్షా ప్రాంగణం కటకట లాడుతోంది. అంటే సభికులు లేక అన్నమాట. ఆకలితో కడుపు నకనకలాడినట్టు, నీళ్లు ఇక్కట్లతో గొంతులు తడారినట్టు, ప్రజలు లేక నవ నిర్మాణ దీక్షా స్థలి సభికులకోసం కటకటలాడుతోందన్నమాట. ఎవరొచ్చినా రాకున్నా ప్రభుత్వోద్యోగులకు తప్పదు కదా. బాబుగారు ఎసి దీక్ష చేసినా, కూలర్ల పోరాటం చేసినా పాపం ఎపి ఉద్యోగులకు అటెండెన్స్ తప్పనిసరి. ఎండలు, వానలు, వడగళ్లు, తుఫాన్లు ఏమున్నాసరే తరలించడానికి ఆర్టీసీ బస్సులు ఉండనే ఉన్నాయిగదా. కిందటి సారి పుట్టినరోజు నాడు చేసిన ఎసిదీక్షకు విద్యార్థులను మండుటెండల్లో తరలించడంపై విమర్శలు రావడంతో చంద్రబాబు, విద్యార్థులకు ఎగ్జెమ్షన్ ఇచ్చినట్టున్నారు. పాపం ఉద్యోగలకు మాత్రం దీక్షా ప్రాంగణ దర్శనభాగ్యం, ప్రతిజ్ఞా పాఠం తప్పలేదు.

ఏటా నవనిర్మాణ దీక్ష అంటూ చంద్రబాబు ఓ ప్రతిజ్ఞను చేయిస్తున్నారు. రాష్ట్ర నిర్మాణంలో, ప్రగతిలో ప్రతిఒక్కరూ పాలుపంచుకుంటామని మాటివ్వడం ఈ ప్రతిజ్ఞ ఉద్దేశం. కానీ గతంలో కంటే ఈ ఏడాది నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ కాస్త డిఫరెంటుగా ఉంది. అశాస్త్రీయ విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం పూరించడానికి కష్టపడదాం అని గతంలో ప్రతిజ్ఞ చేయించిన చంద్రబాబు గారు. ఈ ఏడాది మాత్రం మాట మార్చారు. అవినీతి కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడుద్దాం అని అనిపించారు. మరి అందులో అవినీతి, కుట్రరాజకీయాలు చేసింది ఎవరో కూడా చెప్పి మరీ ప్రతిజ్ఞ చేయించాల్సింది. నాలుగేళ్లు అంటకాగిన ఎన్డీయే తో కలిసి నేను, నా ప్రభుత్వ చేసిన నష్టాన్ని పూరించుకోడానికి తెలుగు ప్రజలమంతా కష్టపడతాం అని చెప్పించి ఉండాల్సింది.

ఇక ప్రతిజ్ఞలోని చివరి మాటలు వింటే ఆ ప్రతిజ్ఞ చేయిస్తున్న బాబు మాటేమో గాని దాన్ని విని అనుసరించాల్సిన వాళ్లుమాత్రం సిగ్గుతో చితికిపోవడం ఖాయం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే, ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం...అని ప్రతిజ్ఞ చివరి మాటల్లో ఉంటుంది. ఇందులో ఏ ఒక్క ప్రతిజ్ఞ నెరవేర్చుకునే అవకాశం లేకుండా చేసింది చంద్రబాబే. అధికారుల్లో అవినీతిని పెంచి పోషించారు. అడ్డంగా దొరికిన లంచగొండులపై చర్యలే తీసుకోలేదు. సామాజిక అసమానతలను పెంచే వాఖ్యలు ఆయనతో సహా ఆయన నేతలంతా చేసారు. వ్యసాయం తగ్గి రైతులు, పరిశ్రమలు లేక యువత, ప్రభుత్వోద్యాగాలు లేక విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. వీరిలో ఉపాధి ఎవ్వరికీ దొరకలేదు. ఉద్యోగం వచ్చింది ఒక్క లోకేషుకు మాత్రమే. అందరికీ ఆరోగ్యంపంచే ఆరోగ్యశ్రీ లేదు, రాష్ట్రంలో ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. కానీ బాబు గారు ఆనందమయ రాష్ట్రాన్ని నిర్మించేస్తానన్న ప్రతిజ్ఞ మాత్రం అలాగే ఉంది. చంద్రబాబు అను నేను అంటూ బెంజి సర్కిల్లో బాబు చేసిన ప్రతిజ్ఞలో ప్రతి అక్షరం ఆయన పరిపాలనలోని అసమర్థతను ఎత్తి చూపేలా ఉందంనడంలో సందేహమే లేదు.  

 

Labels : NCBN, TDP

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com