Printed on 23-09-2017 07:44:19 AM

నంద్యాలలో వైయస్‌ఆర్‌ సీపీ గెలుపు తథ్యం.. శిల్పా
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు తథ్యమని, అందుకు చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలే నిదర్శనమని వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల 6, 7 వార్డుల్లో శిల్పా మోహన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ రాజన్న రాజ్య స్థాపనకు కృషి చేయాలని కోరారు. చంద్రబాబు పతనం నంద్యాల నుంచే మొదలవ్వాలన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.