Printed on 12-12-2018 23:00:11 PM

ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల్సిందే

అసెంబ్లీః కాల్ మనీ సెక్స్ రాకెట్ అనేది చాలా హేయమైన వ్యవహారం అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున వైఎస్సార్సీపీ శాసనసభ పక్ష ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అసెంబ్లీ దాకా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చర్యల్ని తీవ్రంగా దుయ్యబట్టారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ అనేది హేయమైన చర్యఅని, దీనికి ముఖ్యమంత్రిగా క్షమాపణ చెప్పాలని పట్టుపట్టారు. గుంజీలు తీసినా ఆ పాపం పోదని ఆయన అన్నారు. 

విజయవాడ కేంద్రంగా సాగుతున్న కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. విజయవాడలో  ఆడవాళ్లను ఆట వస్తువులుగా ఉపయోగించుకుని సెక్స్ రాకెట్‌కు పాల్పడితే, అందులో కూడా చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీజీ ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు ఇంతమంది కనిపిస్తుంటే దీన్ని దారి మళ్లించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇదేదో వడ్డీ వ్యాపారం అన్నట్లు వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేస్తున్నారు. వందల మందిని అరెస్టు చేస్తారు.. వాళ్లలో కూడా ప్రతిపక్షాల వాల్లే ఎక్కువ ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.

విజయవాడలో సీఎం అండదండలతో, నేరుగా డీజీ ఇంటెలిజెన్స్‌తో నిందితులు చర్చలు జరుపుతున్న ఫొటోలు కూడా ఉండగా, ఎమ్మెల్యే విదేశీ పర్యటనకు వెళ్లడం, ఆయనతోపాటు ఉన్న నిందితుడు మాత్రం తిరిగి రాకపోవడం చూస్తున్నాం. ఎమ్మెల్సీ పదవిలో ఉన్న వ్యక్తి సొంత తమ్ముడే ఈ వ్యాపారం చేస్తున్నాడు. 200 లకు పైగా వీడియో టేపులలో అమ్మాయిలను అశ్లీల చిత్రాలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేశారు. కాల్ మనీలో  సీఎం డబ్బులు ఉన్నాయి కాబట్టే సెక్స్ రాకెట్ కేసును తప్పుదోవ పట్టించేందుకు ఇది కేవలం వడ్డీ వ్యాపారంతో సంబంధం ఉన్నట్లు దాడులు చేయిస్తున్నారన్నారు. సాదా సీదా కేసుగా చిత్రీకరించే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది.

అడ్డుకున్న పోలీసులు
అసెంబ్లీ వద్దకు పాదయాత్రగా చేరుకున్న వైఎస్ జగన్, ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు లోపలకు తీసుకురావద్దంటూ వారికి ఆంక్షలు పెట్టారు. దీంతో వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం చంద్రబాబును తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతోందని, అసెంబ్లీ జరిపించుకుంటారా లేదా అన్న విషయాన్ని ఆయనకే వదిలిపెడతామని ఆయన అన్నారు. పోలీసులకు, ప్రతిపక్ష నేతకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చీఫ్ మార్షల్ బయటకు వచ్చి పోలీసులకు నచ్చజెప్పిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీలోకి అనుమతించారు.


అధికారం కోసం బాబు ఏ గడ్డి అయినా తింటాడుః వైఎస్ జగన్

Printed on 12-12-2018 23:00:11 PM

అధికారం కోసం బాబు ఏ గడ్డి అయినా తింటాడుః వైఎస్ జగన్
హైదరాబాద్ః రాష్ట్రంలో చంద్రబాబు పాలన దారుణంగా ఉందని ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. రాజధానిలో బాబు బినామీ భూదందా, పోలవరం అవతవకలు, అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం సహా అనేక అంశాలపై సభలో ప్రభుత్వాన్ని ఎండగట్టామని వైఎస్ జగన్ చెప్పారు. పార్టీ కార్యాలయంలో  మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ...రాజధానిలో చంద్రబాబు  ఏవిధంగా ఇన్ సైడ్ ట్రేడింగ్ చేశారో సభలో నిలదీశామన్నారు. ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూర్చేందుకు చంద్రబాబు విద్యుత్ కొనుగోళ్లలో భారీగా కుంభకోణాలకు పాల్పడిన విషయాన్ని సభావేదికగా ఎండగట్టామన్నారు. 

అగ్రిగోల్డ్ బాధితులకు బాబు ఏవిధంగా  అన్యాయం చేశారో సభలో ప్రస్తావించామన్నారు. ఇసుకలో చంద్రబాబుకు వాటాలున్నాయని, నీకింత నాకింత అన్న విధంగా ఇసుకలో రూ.2 వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని నిప్పులు చెరిగారు. ఎడాపెడా రెండేళ్లపాటు ఇసుకను దోచుకొని బాబు ఇప్పుడు ఇసుక ఫ్రీ అని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.  సబ్ ప్లాన్  విషయంలో ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని, రైతులు, డ్వాక్రామహిళలు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు తన అవినీతితో రాష్ట్రాన్ని స్కాం ఆంధ్రగా మార్చాడని విరుచుకుపడ్డారు. అధికారం కోసం బాబు ఏగడ్డి అయినా తింటాడని జననేత ఫైరయ్యారు. 
సంతలో గొర్రెలను కొన్నట్లు కొంటున్నాడు

Printed on 12-12-2018 23:00:11 PM

సంతలో గొర్రెలను కొన్నట్లు కొంటున్నాడు
హైదరాబాద్ః రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ...అలా వచ్చిన బ్లాక్ మనీ సొమ్ముతో ఎమ్మెల్యేలను సంతలో గొర్రెలను కొన్నట్లు కొంటున్నాడని మండిపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేకి 20 నుంచి 30 కోట్లు, మంత్రి పదవులు ఎరచూపుతూ కొనుగోలు చేస్తున్న దానిపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరినట్లు వైఎస్ జగన్ తెలిపారు. అవినీతి డబ్బులతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు దుర్మార్గాలను ఆపాలని గవర్నర్ కు చెప్పినట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. 

చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం లేదని, ప్రజలు ఓట్లు వేస్తారన్న నమ్మకం లేకే తీసుకుపోయిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా కాపాడుతున్నాడని వైఎస్ జగన్ మండిపడ్డారు. బాబుకు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవమున్నా...సిగ్గు, రోశం ఏ కోశాన ఉన్నా తీసుకున్న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ప్రజల్లోకి రావాలని సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు ఎవరికి ఓట్లేస్తారో తేలుతుంది. బాబుకు దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలన్నారు. 
సొంత గడ్డ చంద్రగిరికి బాబు శఠగోపం

Printed on 12-12-2018 23:00:11 PM

సొంత గడ్డ చంద్రగిరికి బాబు శఠగోపం
 

– చంద్రగిరి నియోజకవర్గంలో 70 శాతం గ్రామాల్లో తాగునీరు కరువు
– బాబు చదివిన స్కూల్‌ గట్టిగా తుమ్మితే ఊడిపోయేలా ఉంది.
– వైయస్‌ఆర్‌ చలువతో చంద్రబాబు నాడు మంత్రి అయ్యారు
–  చంద్రబాబు చంద్రగిరిలో 17,500 ఓట్లతో ఓడిపోయారు
– నాలుగేళ్ల టీడీపీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు
– నాన్నగారి హయాంలో పేదలకు ఓ భరోసా ఉండేది.
– మీ పిల్లలను ఏ చదువైనా చదివించుకోండి..ఎన్ని లక్షలైనా ఇస్తాను.
– మెస్, బోర్డింగ్‌ చార్జీలకు ప్రతి ఏటా రూ.20 వేలు
– పింఛన్‌ రూ.2 వేలు ఇస్తా
– పేదలందరికీ పక్కా ఇల్లు కట్టిస్తా
– రాజకీయాల్లో విశ్వసనీయత తెచ్చేందుకు మీ అందరి సహకారం కావాలి 

చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గాన్ని విస్మరించారని, ఆయన పుట్టిన చంద్రగిరి నియోజకవర్గానికి శఠగోపం పెట్టారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చదివిన స్కూల్‌ పరిస్థితి అధ్వానంగా ఉందని, నియోజకవర్గంలో 70 శాతం గ్రామాల్లో తాగునీరు లేదని, వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని చంద్రబాబు విస్మరించారని ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 61వ రోజుచిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగించారు.

నాకే భరోసా కల్పిస్తున్నారు..
ఒక వైపు వేలాది మంది అడుగులో అడుగులు వేస్తూ, వారు పడుతున్న బాధలను అర్జీలుగా ఇస్తున్నారు. మరో వైపు భరోసా ఇచ్చేందుకు వచ్చినా నాకే భరోసా కల్పిస్తూ చాలా మంది అడుగులో అడుగులు వేస్తున్నారు. ఈ నడిరోడ్డుపై నిలవాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు. అయినా కూడా కిలోమీటర్ల చొప్పున నాతో నడుస్తూ..చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు పంచుతున్నారు. ఆత్మీయతలు చూపుతున్నారు. మీ అందరికి ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు
 
చంద్రగిరి పరిస్థితే ఇలా ఉంటే..
దాదాపుగా నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనను చూశారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు తన కార్యకర్తలతో ఊదరగొడుతున్నారు. ఈ పాలన మీరంతా చూశారు. ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని సంతోషంగా ఉన్నారా అని అడగండి. ఇవాళ ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. రైతులు, అక్కాచెల్లెమ్మలు, అవ్వతాతలు, చదువుకుంటున్న పిల్లలు సంతోషంగా లేరు.  ఇదే చంద్రగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక ఉంది. ఈ నియోజకవర్గంలోనే చంద్రబాబు పుట్టారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? 1978లో ఇదే చంద్రబాబు ఇక్కడి నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్‌ తరఫున 2500 ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి అయ్యారు. అది కూడా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చలువతో మంత్రి అయ్యారు. ఐదేళ్లు పరిపాలన చేశారు. 1983లో ఎన్నికలు జరిగితే నాడు 17500 ఓట్లతో ఇదే పెద్ద మనిషి ఓడిపోయారు. ఈ నియోజకవర్గాన్ని ఒక్కసారి చూడండి. ఎవరికైనా పుట్టిన గడ్డ అంటే కాస్త ప్రేమ ఉంటుంది. ఎన్‌ఆర్‌ఐలు కూడా ఇదే స్పూర్తితో సొంతూరుకు ఏదో ఒకటి చేస్తారు. నారావారిపల్లెలో ఉన్న శేషాపురంలో ఆయన చదువుకున్నారు. ఇదే స్కూల్‌ ఇవాళ ఏ పరిస్థితి ఉందో తెలుసా? గట్టిగా తుమ్ముతే పడిపోయేటట్లుగా ఉంది. ఇదే పెద్ద మనిషి గతంలో 9 ఏళ్లు, ఇప్పుడు నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాను చదివిన స్కూలే, పుట్టిన ఊరే ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఇదే నియోజకవర్గానికి వైయస్‌ఆర్‌ వంద పడకల ఆసుపత్రి కట్టేందుకు జీవోలు కూడా జారీ చేశారు. దాని తరువాత నాన్నగారు అకాల మరణం పొందారు. ఇవాల్టికి ఈ జీవో ఉంది. ఇక్కడ వంద పడకల ఆసుపత్రి కట్టించడం పక్కన బెట్టారు. ఈ నియోజకవర్గంలో 138 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 70 శాతం ఊర్లలో తాగేందుకు నీరు లేదు. సాగునీరు అసలే లేదు. ఈ పరిస్థితి చూసి అర్థం చేసుకోవచ్చు ఈయన గారి పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

దమ్మిడి సాయం చేయలేదు..
ఇదే నియోజకవర్గంలో ప్రతి ఏటా ఎనుగులు వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. నష్టపోయిన రైతులకు ఇంతవరకు దమ్మిడి కూడా సాయం చేయలేదు.  చిత్తూరు జిల్లా మామిడి పంటలకు ప్రసిద్ధి. రైతుల వద్ద మామిడి పంటలు పండే సమయంలో ప్రైవేట్‌ వ్యాపారులు ఒక్కటై రేటు తగ్గిస్తున్నారు. వాళ్ల వద్దకు వెళ్లిన తరువాత రేట్లు ఆకాశానికి పెంచుతున్నారు. ఇదే జిల్లాలో చక్కెర పంట ఎక్కువ వేస్తారు. ఇవాళ చెరుకు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లాలో రెండు చక్కెర ఫ్యాక్టరీలు సహకార రంగంలో ఉన్నాయి. ఇవి కాక నాలుగు ప్రైవేట్‌ ఫ్యాక్టరీలు ఇవే జిల్లాలో ఉన్నాయి. ఎప్పుడు చంద్రబాబు సీఎం అవుతారో అప్పుడు చెరకు పరిశ్రమలు మూత పడుతున్నాయి. 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీలు మూత పడితే దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి డబ్బులు సాయం చేసి ఆ ఫ్యాక్టరీలు తెరిపించారు. మళ్లీ మన ఖర్మకొద్ది బాబు సీఎం అయ్యారు. మళ్లీ రెండు చెరకు పరిశ్రమలు మూత పడ్డాయి. కో–ఆపరేటివ్‌ రంగంలోని పరిశ్రమలు రైతుల గురించి ఆలోచిస్తాయి. కానీ చంద్రబాబు ఈ రెండు ప్యాక్టరీలు మూయించారు. కానీ ప్రైవేట్‌ రంగంలోని నాలుగు పరిశ్రమలు లాభాల్లో నడుస్తున్నాయి. చెరకు పరిశ్రమలు మూత వేయించడమే కాదు బెల్లం తయారీ చేయకుండా ఆంక్షలు విధిస్తున్నారు. బాబు పాలనలో లీటర్‌ నీళ్లు రూ.22, లీటర్‌ పాలు రూ.20 ధర ఉంది. చంద్రబాబు పాల వ్యాపారంలోకి అడుగు పెట్టి చిత్తూరు డయిరీని మూత వేయించారు. ఇవన్నీ కూడా మీరందరూ చూస్తున్నారు.

ఈ పాలన ముగియాలి..
ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఏమన్నారు. కరెంటు బిల్లులు మూడు సార్లు పెంచారు. గతంలో రూ.100 లోపే వచ్చేది. ఇప్పుడు రూ.500, 700 చొప్పున కరెంటు బిల్లులు వస్తున్నాయి. ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం అన్నాడు. ఇల్లు కట్టిస్తా అన్నారు. నాలుగేళ్ల తరువాత ఒక్క ఇల్లైనా కట్టించాడా?. గతంలో రేషన్‌షాపుల్లో బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, కిరోసిన, చింతపండు ఇలా 9 రకాల సరుకులు దొరికేవి. కానీ ఇప్పుడు బియ్యం తప్ప మరేవి ఇవ్వడం లేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. వ్యవసాయ రుణాలు బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? బ్యాంకుల నుంచి వేలం నోటిసులు ఇంటికి వస్తున్నాయి. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డాడు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. పక్క రాష్ట్రంలో రూ.7 తక్కువకు పెట్రోలు పోస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోని పెట్రోల్,డీజిల్‌ ధరలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. రాష్ట్రంలో విచ్చల విడిగా అవినీతి జరుగుతోంది. ఇసుక, మట్టి, మద్యం, బొగ్గు, కాంట్రాక్టర్లు, భూములు, చివరకు గుడి భూములను వదలకుండా చంద్రబాబు తింటున్నాడు. గ్రామాల్లో  తినడానికి జన్మభూమి కమిటీలను వదిలేశాడు. పింఛన్లు, రేషన్‌కార్డులు కావాలన్నా లంచాలు అడుగుతున్నారు. ఇలాంటి అన్యాయం చేసే, అబద్ధాలు చేప్పే పాలన పోవాలి. రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదాలకు అర్థం రావాలి. ఈ వ్యవస్థ మారకపోతే రేపొద్దున ఇదే చంద్రబాబు  అబద్ధాలకు హద్దుపద్దు ఉండదు. రేపొద్దున ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్మరు కాబట్టి వీళ్లను నమ్మించేందుకు ప్రతి ఇంటికి బెంజీ కారు అంటారు. ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అనే పదాలు తీసుకురావాలి. మోసం చేసిన వ్యక్తి ఇవాళ ఏమంటున్నారో తెలుసా? పింఛన్లు చాలా మందికి ఇవ్వాలని ఇవాళ తెలిసిందట. హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ వర్తించదని ఇవాళ తెలిసిందట. ఈ పాలన ముగియాలి. 

మనందరి ప్రభుత్వం వచ్చాక..
రాజకీయాల్లో విశ్వసనీయత తెచ్చేందుకు నాకు మీ అందరి చల్లని దీవెనలు, ఆశీర్వాదం కావాలి. దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది నవరత్నాలు ప్రకటించాం. ఇందులో మార్పులు, చేర్పులు ఉంటే నాకు సలహాలు ఇవ్వమని అడుగుతున్నాను.
నాలుగు కత్తెర్లు ఇస్తే అది బీసీలపై ప్రేమా..?
చంద్రబాబుకు ఎన్నికలు వచ్చే సరికి బీసీలపై ప్రేమ అంటున్నారు. చంద్రబాబు పాలనను ఒక్కసారి చూడండి. ఇవాళ మన పిల్లలు ఇంజినీరింగ్‌ చదివే పరిస్థితి ఉందా? ఫీజులు లక్షల్లో ఉన్నాయి. చంద్రబాబు ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. మిగతా డబ్బులు ఆ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు. ఆ పిల్లాడి ఫీజులకు ఇల్లు , పొలాలు అమ్ముకోవాల్సి వస్తుంది. 

ప్రేమ ఎలా ఉంటుందో మహానేత చూపించారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో పేదలకు భరోసా ఉండేది. ప్రతి పేద వాడిని ఇంజినీర్‌ చదువుతావా? డాక్టర్‌ చదువుతా అంటూ వైయస్‌ఆర్‌ చదివించారు. నాన్న పేదవారి కోసం ఒక్క అడుగు ముందుకు వేశాడు. ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. మీ పిల్లాడు ఏం చదువుతాడో చదివించండి..ఎంత ఖర్చు అయినా నేను భరిస్తాను. మీ పిల్లలను ఇంజీనీర్‌ చదివించడమే కాదు, డాక్టర్‌ను చదివించడమే కాదు మీ పిల్లల హాస్టల్‌ ఖర్చులకు రూ.20 వేలు ఏడాదికి నేను చెల్లిస్తాను. మీ చిన్న పిల్లలను బడికి పంపిస్తే ఆ తల్లి ఖాతాలో ప్రతి ఏటా రూ.15 వేలు జమా చేస్తాను.

రూ.2 వేల పింఛన్‌
అవ్వతాతలకు వయసు పెరిగే కొద్ది తిండే కాదు..చిన్న చిన్న అవసరాలకు, మందులకు వేరే వారిపై ఆధారపడాలి. చంద్రబాబుకు ఇలాంటి వారికి పింఛన్‌ పెంచాలన్న మనసు రాదు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు రేట్లు పెంచుతారు. అవ్వతాతలకు మాత్రం పెంచాలన్న ఆలోచన రాదు. కారణం ఏంటంటే ఆ కాంట్రాక్టర్లు చంద్రబాబు లంచాలు ఇస్తారు కా» ట్టి. మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల రూ.2 వేల పింఛన్, పింఛన్‌ వయస్సు 60 ఏళ్లకే తగ్గిస్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉన్నాయి. వీరికి పింఛన్‌ 45 ఏళ్లకే ఇస్తాం.

ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు..
మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో 48 లక్షల ఇల్లు కట్టించాడు. చంద్రబాబు నాలుగేళ్లలో ఒక్క  ఇల్లు కూడా కట్టించలేదు. మనందరి ప్రభుత్వం వచ్చాక ప్రతి పేద వాడికి పక్కా ఇల్లు కట్టిస్తాను. వీటిలో ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నేను మీ మధ్యే ఉన్నాను. రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయతను తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ అడుగులో అడుగు వేయాలని కోరుతున్నాను. మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతున్నాను.